Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌

    Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌

    April 14, 2023

    యాంకర్‌ అనసూయ బుల్లితెరపై ఎంత ఫేమస్సో… సోషల్‌ మీడియాలో అంతకంటే ఎక్కువ ఫేమస్‌. నెటిజన్లు వేసే ట్రోలింగ్ పోస్టులకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇవాళ కూడా మరోమారు అనసూయ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఎప్పటిలా నెటిజన్లను తిడుతూనే, విమర్శిస్తూనో కాదు. ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన కొంటె ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చి ఆశ్యర్యపరిచింది. ఇంతకీ అనసూయను నెటిజన్లు ఏ ప్రశ్నలు అడిగారు?. అందుకు ఆమె ఇచ్చిన ఆన్సర్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం.

    ప్రశ్న: మీపై వచ్చే ట్రోల్స్‌, జీవితంలో తగిలే ఎదురు దెబ్బల నుంచి బయటిపడేలా మిమ్మల్ని 

    మోటివేట్ చేసే అంశం?

    అను: జీవితంలో తగిలే ఎదురుదెబ్బలను నేను అసలు పట్టించుకోను. ఇక ట్రోలర్స్‌ నన్ను ఎప్పటికీ కిందకు లాగలేరు. పైగా ట్రోల్స్‌ నన్ను బలమైన శక్తిగా చేస్తాయి. 

    ప్రశ్న: ఇప్పటివరకూ చూసిన వాటిలో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పాత్ర?

    అను: నేను చేసిన పాత్రలు అన్ని నాకు ఇష్టమే. ఎందుకంటే చేసింది నేను కదా..

    ప్రశ్న: రంగ మార్తండలో మీ పాత్ర బాగుంది. కానీ రంగస్థలంలోని రోల్‌ అంటేనే ఇప్పటికీ ఇష్టం. మీరేమంటారు?

    అను: ఒక నటిగా ప్రతీ పాత్రకు పూర్తిగా న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా. నేను ఎంచుకునే పాత్రలు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయాలనేదే నా తాపత్రయం. 

    ప్రశ్న. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు?. ఇటీవల వెళ్లిన పుణ్య క్షేత్రం? ఏమైనా మెుక్కుకున్నారా?

    అను: హనుమంతుడు నా ఫేవరెట్‌. ఇటీవల శ్రీకాళహస్తి వెళ్లా. మెుక్కు చెప్తే తీరదంటారు.

    ప్రశ్న: ఫ్యాన్స్‌కు ఫొటోస్ ఎందుకు ఇవ్వరు.. ఫ్యాన్స్ వల్లే ఈ స్టేజీలో ఉన్నారు.

    అను: మనుషులు అన్నాక కొన్ని మూడ్స్ ఉంటాయి. సెలబ్రెటీలు అయినంత మాత్రానా మేము మనషులు కాదనుకుంటే ఎలా. చాలా మందికి సెల్ఫీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నన్ను ఇలా జడ్జ్‌ చేయడం కరెంట్ కాదు. 

    ప్రశ్న: మీపై జరిగిన ట్రోలింగ్స్‌, సినిమా ప్రమోషన్స్‌లో అసభ్య పదజాలంపై మీరు చాలా ధైర్యంగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగే పర్యవసానాలపైన మీకు  భయం వేయలేదా?

    అను: నీ తప్పు లేనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదని మా అమ్మ చెప్పింది. చేయాల్సింది చేయ్‌ మిగతాది పైవాడు చూసుకుంటాడని అన్నది. 

    ప్రశ్న: ఇవాళ గురువారం రెండు ఫోటోలు పెట్టొచ్చుగా?

    అను: అయ్యో.. త్వరలో దీనికి పరిష్కారం ఇద్దాం.

    ప్రశ్న: పుష్ప సినిమాలో మీకున్న మంచి ఎక్స్‌పీరియెన్స్‌ చెప్పిండి?

    అను: పుష్ప సెట్‌లో పాలుపంచుకోవడమే ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఆ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది.

    ప్రశ్న: జబర్దస్త్‌లో ఒక టీమ్‌/ డైరెక్టర్‌తో గొడవ జరిగి వెళ్లి పోయారంటా నిజమేనా?

    అను: అది నిజం కాదు. 

    ప్రశ్న: మీపై ఆన్‌లైన్‌లో జరిగే ట్రోల్స్‌పై ఏమంటారు?

    అను: నథింగ్‌.. ప్రతీ ఒక్కరినీ సరిదిద్దాలని అనుకోవడం నా పని కాదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version