• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS Elections: రూ.1 గ్యాస్ సిలిండర్లు

    తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. తమ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్‌ యాదవ్‌. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలిస్తానని చెబుతున్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీరును నియమిస్తామని, 70 ఏళ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్‌ బటన్‌ నొక్కగానే వచ్చి సాయం అందిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు.

    చంద్రమోహన్ మృతి ఎంతో విషాదకరం: చిరు

    సినీ నటుడు చంద్రమోహన్ మృతిపై హీరో చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను’. అని చిరు … Read more

    బస్సు హారన్‌ కొట్టాడని.. డ్రైవర్‌పై దాడి

    బస్సు హారన్‌ కొట్టాడని డ్రైవర్‌పై కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు పుట్టినరోజు వేడుకలను నగరంలోని ప్రధాన రోడ్డుపై నిర్వహించారు. ఆరుగురు యువకులు కలిసి నడిరోడ్డుపై ద్విచక్రవాహనాలు అడ్డు పెట్టి కేకులు కోస్తూ హడావుడి చేశారు. అదే సమయంలో ట్రావెల్స్‌ బస్సు వెళ్తూ రోడ్డుకు అడ్డుగా ఉన్న యువకులు తప్పుకోవాలని డ్రైవర్‌ హారన్‌ కొట్టాడు. ఆగ్రహించిన యువకులు బస్సుపై రాళ్లు విసిరి డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

    చంద్రమోహన్‌ మరణం బాధాకరం: ఎన్టీఆర్

    సీనియర్ నటుడు చంద్రమోహన్‌ మృతిపై సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. తాజాగా హీరో ఎన్టీఆర్ టీట్ చేస్టూ.. ‘‘ఎన్నో దశాబ్దాలుగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్‌ గారి అకాల మరణం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని ఎన్టీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు.

    హైదరాబాద్‌లో మోదీ రోడ్‌ షో

    తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. వరుసగా మూడు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 25న కరీంనగర్, 26న నిర్మల్ సభల్లో పాల్గొననున్నారు. చివరిగా 27న మోదీ హైదరాబాద్‌లో రోడ్ షో చేపట్టనున్నారు.

    చంద్రమోహన్ నటించిన చివరి సినిమా ఇదే!

    టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. నటనతో సినీ అభిమానులను అలరించిన సీనియర్ నటుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆయన మృతి పట్ల అభిమానులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చేసిన సినిమా విషయానికి వస్తే 1966లో రంగుల రాట్నంతో చంద్రమోహన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. విభిన్నమైన పాత్రల్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

    సూర్య “కంగువ” రిలీజ్ అప్పుడే?

    కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దర్శకుడు శివ “కంగువ” చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో దిశా దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుంది. సూర్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ సినిమా కావడంతో గట్టి హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా రిలీజ్ పై అయితే ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 11న రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

    శ్రీలంకకు ఐసీసీ షాక్

    శ్రీలంకకు ICC షాక్‌ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్‌ సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఐసీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని ఐసీసీ పేర్కొంది. శ్రీలంక క్రికెట్‌ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

    Aus Vs Ban: టాస్ గెలిచి ఆసీస్ బౌలింగ్

    వన్డే వరల్డ్ ‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆస్ట్రేలియా తలపడుతోంది. పుణె వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తుదిజట్లు: ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడం జంపా, జోష్ హాజిల్‌వుడ్‌. బంగ్లాదేశ్‌ తాంజిద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్( వికెట్ కీపర్), తౌహిద్ హృదోయ్, మెహిదీ … Read more

    ప్రపంచకప్‌లో వైఫల్యంపై స్పందించిన పాక్ కెప్టెన్

    ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ వైఫల్యంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ స్పందించారు. టీవీలో మాటలు చెప్పడం సులువని వ్యాఖ్యానించాడు. ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే తనకు నేరుగా ఫోన్‌ చేయొచ్చన్నారు. మూడేళ్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. సారథ్యాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదని చెప్పారు. ‘ప్రపంచకప్‌లో ఆడుతున్నప్పుడు ఒత్తిడిలో లేను. ఫీల్డింగ్‌లో నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు పరుగులు రాబట్టి జట్టుకు విజయాన్ని అందించాలని ఆలోచిస్తా’. అని బాబర్‌ వివరించాడు.