• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోహిత్‌ వద్దన్నా కెప్టెన్సీ అప్పగించాం: గంగూలీ

    మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌శర్మ విముఖత ప్రదర్శించాడని తెలిపారు, ఎలాగైనా కెప్టెన్‌గా ఉండాల్సిందేనని అతడిని ఒప్పించామని చెప్పుకొచ్చారు. మూడు ఫార్మాట్లలో తీరికలేక భారత జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌ మొదట ఒప్పుకోలేదన్నారు. కానీ కోహ్లి తర్వాత అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రోహిత్‌ సరైనోడని భావించానని తెలిపారు. అందుకే అతడిని బలవంతంగా ఒప్పించానని గంగూలీ చెప్పుకొచ్చారు.

    కాంగ్రెస్ ప్రచారకురాలిగా మాజీ బీజేపీ నేత

    బీజేపీ టికెట్ ఆశించిన సాధ్వి అనాది సరస్వతికి ఆ పార్టీ షాకిచ్చింది. చివరి నిమిషంలో రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ ఉత్తర నియోజకవర్గం టికెట్ ఇతరులకు కేటాయించారు. దీంతో ఆమె తీవ్ర నిరాసకు గురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన సరస్వతికి రాష్ట్ర ప్రచారకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పార్టీ ఆదేశానుసారం ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు.

    ఆర్టీసీ బస్సుల రద్దు.. నేతలు ఆగ్రహం

    ఎమ్మార్పీఎస్‌ నేతలు బుక్‌ చేసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు. దీనిపై ఎమ్మర్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం బస్సులు బుక్‌ చేసుకోగా నేటి సాయంత్రం అవి బయలుదేరాల్సి ఉంది. ఇంతలో వీటిని రద్దుచేసినట్లు నేతలకు ఆర్టీసీ సమాచారం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఆఖరి క్షణాల్లో బస్సులను రద్దు చేయడంపై డిపోల అధికారులతో వాగ్వాదం కూడా జరిగింది.

    ‘సత్యభామ’ టీజర్‌ రిలీజ్‌

    హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సత్యభామ’ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేసింది. ఇందులో ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించే క్రమంలో సత్యభామ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అనే ఆసక్తికర కోణంలో టీజర్‌ ఉంది. ఈ సినిమాకు సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు. What if Anirudh scores BGM for Satyabhama teaser..@MsKajalAggarwal Screen Presence 🥵🔥#SatyabhamaTeaser #KajalAggarwal pic.twitter.com/MsSzZhE3GF — Nani45 (@NaniTarak45) November 10, 2023

    సినీ ప్రేక్షకులకు కార్తీ విన్నపం

    హీరో కార్తీ సినీ ప్రేక్షకులకు ఓ విన్నపం చేశారు. ‘జపాన్‌’చిత్రానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని పోస్ట్‌ చేయొద్దన్నారు. సినిమా పట్ల నేను సంతృప్తిగా ఉన్నా. అభిమానులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిపారు. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సోషల్‌ మీడియాలో చెప్పవద్దని కార్తీ సూచించారు. బంగారం దోపిడీ చేసే దొంగ పాత్రలో కార్తి జపాన్ చిత్రంలో నటించారు.

    చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థులు మార్పు

    తెలంగాణలో ఎన్నిక నామినేషన్ చివరి రోజు రెండు చోట్ల అభ్యర్థులను బీజేపీ మార్చింది. వేములవాడ, సంగారెడ్డి అభ్యర్థులను మార్పు చేసింది. అప్పటికి ప్రకటించి ఉన్న వారిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశమిచ్చింది. వేములవాడ అభ్యర్థిగా వికాస్‌రావు, సంగారెడ్డి అభ్యర్థిగా పులిమామిడి రాజును బీజేపీ ప్రకటించింది. టికెట్‌ ప్రకటించి బీఫామ్‌ ఇవ్వకపోవడంపై సంగారెడ్డి బీజేపీ నేత దేశ్‌పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఫామ్‌ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి హెచ్చరించారు.

    ముగిసిన నామినేషన్ల పర్వం

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. నిర్ణీత సమయంలోగా మిగిలి ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది.

    AFG vs RSA: టాస్ గెలిచి ఆఫ్గాన్ బ్యాటింగ్

    వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్‌: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్‌కీపర్‌), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), టెంబా బవుమా (కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ … Read more

    ‘కాల్పుల విరమణ అంటే లొంగిపోవడమే’

    హమాస్‌‌ మిలిటెంట్‌లపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో కాల్పుల విరమణ అంటే హమాస్‌కు లొంగిపోవడమే అవుతుందన్నారు. యుద్ధంలో మానవతా విరామం ఇచ్చేందుకు అనుకున్నదానికంటే ఆలస్యమైందన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి, బందీల విడుదలకు ఉత్తరగాజాలో జరుపుతోన్న పోరుకు రోజూ నాలుగు గంటలు విరామం ఇవ్వడానికి ఇజ్రాయెల్‌ అంగీకరించిందని తెలిపారు.

    యూట్యూబ్‌లో “హుకుం” సాంగ్ హవా

    సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం లోని పాటలు అన్నీ కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. అయితే హుకుమ్ లిరికల్ వీడియో యూ ట్యూబ్ లో మరొక సెన్సేషన్ క్రియేట్ చేయసింది. ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను రాబట్టడం జరిగింది.