• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తమిళనాడులో భారీ వర్షాలు

    తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించింది. మరోవైపు.. 12 జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కోయంబ‌త్తూరు, తిరువూర్, మ‌ధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండ‌పోత వాన కురిసింది.

    శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం

    తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు.. అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

    రష్మికపై మరో డీప్‌ ఫేక్‌ వీడియో!

    స్టార్‌ హీరోయిన్‌ రష్మికపై మరో మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆమెపై ఓ మార్ఫింగ్‌ వీడియోను చేసి ఇబ్బందిపెట్టగా.. తాజాగా మరో డీప్‌ ఫేక్‌ వీడియోను సృష్టించారు. ఇందులో ఆమె జిమ్ సూట్‌ ధరించి డ్యాన్స్‌ చేస్తున్నట్లు చూపించారు. ఈ వీడియోపై రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. దీనిని ఎవరూ నమ్మొద్దని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

    చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

    స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసినబెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 15కి వాయిదా చేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. విచారణకు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ కోర్టుకు తెలిపింది. తమకు తగిన సమయం కావాలని కోరింది. దీంతో న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చిచెప్పింది.

    చెత్తకుప్పలో రూ.25 కోట్లు..!

    బెంగళూరులో చెత్త ఏరుకునే వ్యక్తికి రూ.25 కోట్లు దొరికాయి. అయితే అది భారతీయ కరెన్సీ కాదు. అమెరికా డాలర్లు. నగర శివారులో చెత్త ఏరుకుంటుండగా 23 కట్టల అమెరికన్‌ డాలర్లు అతడికి కనిపించాయి. ఆ మొత్తాన్ని సదరు వ్యక్తి తన ఇంటి యజమాని అప్పగించాడు. అతను ఈ విషయాన్ని పోలీసులకు వివరించారు. దొరికిన కరెన్నీ విలువ రూ.25 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అవి ఒరిజినల్‌ డాలర్లేనా?లేదంటే నకిలీవా? అని గుర్తించేందుకు వాటిని పోలీసులు ఆర్బీఐకి పంపించారు.

    కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌హాసన్‌

    సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయవాడ గురునానక్‌ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని హీరో కమల్‌హాసన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత దేవినేని అవినాష్‌, పెద్ద ఎత్తున కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పాల్గొన్నారు. ‘ఇండియన్‌-2’ సినిమా చిత్రీకరణ కోసం కమల్‌హాసన్‌ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 188 పాయింట్ల నష్టంతో 64,643 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 19,348 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఒక్క టాటా మోటార్స్‌ తప్ప మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌ నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

    రోడ్డు ప్రమాదం.. ముగ్గరు మృతి

    మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. టోల్‌ప్లాజా వద్ద క్యూ లైన్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉంది.

    ఈ సమయంలో ఆయన ఉంటే బాగుండేది: బాలకృష్ణ

    ‘భగవంత్‌ కేసరి’విజయోత్సవ వేడుకలో దివంగత నటుడు దాసరి నారాయణరావును బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఇటువంటి సమయంలో దాసరి ఉంటే బాగుండేదని భావోద్వేగానికి గురయ్యారు. ‘దాసరి లేరనే లోటు ఉంది. ఆయన కూడా ఉండి ఉంటే ఎంతో బాగుండేది! ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా, తలలో నాలుకగా ఉండేవారు. ఓ సినిమా విషయంలో ప్రేక్షకాదరణను మించింది మరేదీలేదు. ఆడియన్స్‌ అడగకముందే మంచి కథలను పరిచయం చేస్తే విజయం తప్పక వరిస్తుంది’. అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

    9 పిల్లలకు జన్మనిచ్చిన కుక్క.. యజమాని విందు

    పెంపుకుడు కక్కు 9 పిల్లలకు జన్మనివ్వడంతో యజమాని ఆనందానికి అవదులు లేకుండా పోయింది. ఆ సంతోషంలో 400 మందికి విందు ఇచ్చింది. హామిర్‌పుర్‌లోని మేరాపుర్‌కు చెందిన రాజ్‌కాళి అనే మహిళ తన పెంపుడు కుక్క ఇటీవలే 9 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో గ్రామస్థులు, బంధువులను ఇంటికి పలిచి విందును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కుక్క పిల్లలను అందంగా అలకరించింది.