• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పలు మెము రైళ్లు రద్దు

    విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. అభివృద్ధి పనుల కారణంగా పలు మెము రైళ్లను రద్దయ్యాయి. ఇప్పటికే బిట్రగుంట-విజయవాడ మధ్య నడిచే రైళ్లను బిట్రగుంట-గూడూరు మధ్య నడిచే రైలును రద్దు చేశారు. తాజాగా బిట్రగుంట నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్లే 17237ను, చెన్నై సెంట్రల్‌ నుంచి బిట్రగుంటకు వెళ్లే 17238ను 13వ తేదీ నుంచి 17 వరకు రద్దు చేశారు, గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 07458 మెము రైలు 14 నుంచి 20వ తేదీ వరకు రద్దు … Read more

    సినీ దర్శకుడికి హైకోర్టు నోటీసులు

    సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్‌ షేక్‌పేటలో రెండెకరాల భూకేటాయింపుపై మెదక్‌కు చెందిన బాలకిషన్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాయితీ ధరతో ప్రభుత్వం భూమిని కేటాయించగా వారు దాన్ని షరతులకు విరుద్ధంగా బార్‌లు, పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపి రాఘవేంద్రరావుతో పాటు కృష్ణమోహన్‌‌కు నోటీసులు జారీ చేసింది.

    నేడు చంద్రబాబు బెయిలు పిటిషన్‌ విచారణ

    స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు బెయిలు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో 37వ నిందితులు బెయిల్‌పై బయటే ఉన్నారు. చంద్రబాబుకు మాత్రం బెయిలు దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు ఒక్కరికే బెయిలు రావాలి. ఇదే కేసులో ఏపీఎస్‌ఎస్‌డీసీ పూర్వ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిలు పొందారు. సీమెన్స్‌ సంస్థ, డిజైన్‌టెక్‌కు చెందిన ఎండీ, సీఎండీలు బెయిలు పొందిన వారిలో ఉన్నారు.

    Amazon: కంపెనీ ఛార్జర్లపై బిగ్ డిస్కౌంట్స్..

    చాలా స్మార్ట్‌ ఫోన్ కంపెనీలు ఛార్జింగ్ అడాప్టర్‌లను నిలిపివేశాయి. దీంతో పోర్టబుల్ ఛార్జర్లకు డిమాండ్ పెరిగింది. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలతో వస్తున్నాయి. ఇవి ఛార్జింగ్ టైంను ఆదా చేస్తాయి. ఈ ఛార్జర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, స్పీకర్‌లు, ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌బ్యాండ్‌లు, పవర్ బ్యాంక్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఛార్జ్ చేస్తాయి. కంపెనీ ఛార్జర్ల మాదిరి హై-స్పీడ్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ వాటేజ్ రేటింగ్‌తో ఛార్జర్ల జాబితాను అందించాం. YouSay Webపై వాటిపై మీరూ ఓ లుక్ వేయండి. Best Deals On Popular … Read more

    ‘డీప్‌ఫేక్‌ వీడియో చూస్తుంటే భయం వేస్తోంది’

    రష్మిక డీప్‌ ఫేక్ వీడియో ఘటనపై నటి కీర్తిసురేశ్‌ స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘ఇలాంటి చెత్త వీడియోలను సృష్టించే బదులు.. అందరికీ ఉపయోగపడే పని చేసి ఉండాల్సింది. ఇటువంటి డీప్‌ఫేక్‌ వీడియో చూస్తుంటే భయం వేస్తోంది. టెక్నాలజీని దుర్వినియోగం చేసి ఎదుటి వ్యక్తులను ఇబ్బందిపెట్టే బదులు.. విలువైన సమయాన్ని ఏదైనా మంచి పనికి ఉపయోగించాల్సింది. ఇప్పుడున్న టెక్నాలజీ మనకు వరమో శాపమో అర్థం కావడం లేదు. మంచి విషయాలకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిద్దాం. అంతేకానీ చెత్తను పంచుకోవడం కోసం కాదు’. … Read more

    కుప్పకూలిన శ్రీలంక టాప్‌ ఆర్డర్

    ప్రపంచకప్‌ భాగంగా నేడు శ్రీలంకతో న్యూజిలాండ్ ఆఖరి లీగ్ మ్యాచ్‌ ఆడుతోంది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న శ్రీలంక తడబడుతోంది. ఇప్పటికే శ్రీలంక టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు మాత్రమే చేసింది. పాథుమ్ నిశాంక (2), కుశాల్ మెండిస్ (6), సదీరా సమరవిక్రమ (1), చరిత్ అసలంక (8) పరుగులు చేసిన ఔటయ్యారు.

    కేటీఆర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

    మంత్రి కేటీఆర్‌కు తృటిలోొ ప్రమాదం తప్పింది. కేటీఆర్ ప్రచార వాహనంలో ఉండగా డైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ప్రచారరథం రెయిలింగ్ విరగడంతో మంత్రి ముందుకు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్‌ను పట్టకున్నారు. ఈ ప్రమాదంలో ఎంపీ సురేష్ రెడ్డి వాహనంపై నుంచి జారి కిందపడటంతో స్వల్ఫ గాయాలయ్యాయి. ఆర్మూరు ర్యాలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    నాకు సొంతిల్లు కూడా లేదు: మోదీ

    పేదల సొంతింటి కళను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనకు మాత్రం సొంతిల్లు లేదన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతే కనిపించేది. పేదల కోసం మా ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విధ్వంసమే ఉంటుంది. కాంగ్రెస్ నకిలీ లబ్ధిదారుల ముసుగులో తమ అనుచరుల జేబులను నింపేసింది. మా ప్రభుత్వం వచ్చాక వారిని ఏరివేశాం. తద్వారా రూ.2.75లక్షల కోట్లను ఆదా చేశాం’ అని మోదీ పేర్కొన్నారు.

    ‘మా దేశానికొస్తే అతడికి రాళ్ల దెబ్బలు తప్పవు’

    శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ‘టైమ్‌డ్‌ ఔట్’ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. బంగ్లా కెప్టెన్ షకిబ్ తీరుపై శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ మ్యాచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన సోదరుడు ట్రెవిస్ కూడా షకిబ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘గేమ్‌లో షకిబ్ క్రీడా స్ఫూర్తి, మానవీయ విలువలు కూడా పాటించకపోవడం దారుణం. షకిబ్‌ను శ్రీలంకలోకి రానివ్వకూడదు. ఒకవేళ అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ లేదా ఎల్‌పీఎల్‌లో పాల్గొంటే మాత్రం రాళ్ల దెబ్బలకు సిద్ధంగా ఉండాలి’. అని ట్రెవిస్‌ పేర్కొన్నాడు.

    విద్యార్థితో టీచర్ శృంగారం

    ఓ టీచరే వికృత చేష్టలకు పాల్పడి జైలుపాలైంది. విద్యార్థితో టీచర్‌ శృంగారంలో పాల్గొందని ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. మాంట్‌గోమెరి విలేజ్‌ మిడిల్‌ స్కూల్‌లో మెలిసా మేరి కర్టిస్‌ టీచర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో 14 ఏళ్ల విద్యార్థితో కర్టిస్‌ (22) శృంగారంలో పాల్గొంది. బాధిత విద్యార్థికి పలుమార్లు మద్యం తాగించి, గంజాయి ఇచ్చి టీచర్‌ శృంగారంలో పాల్గొన్నట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.