• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీల్‌చైర్‌లో వచ్చి ఎంపీ నామినేషన్‌

    మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. దుబ్బాకలో అంబులెన్స్‌ దిగి వీల్‌చైర్‌లో రిటర్నింగ్‌ కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అయితే ఇటీవల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ యువకుడి చేతిలో కత్తిపోటుకు గురైన ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి: షమీ

    పాక్‌ మాజీ ఆటగాడు హసన్‌ రజా టీమిండియాపై ఆరోపణలు గుప్పించాడు. భారత్ ఆడే మ్యాచ్‌ల కోసం విభిన్న బంతులను వాడుతున్నారని విమర్శలు చేశాడు. దీంతో అతడి నోటిదురుసుపై భారత పేసర్ మహమ్మద్‌ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి. మీ గేమ్‌ మీద దృష్టిపెట్టాలి. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం కాదు. ఇప్పటికీ అదే ధోరణిలో ఉండటం హాస్యాస్పదం. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు.’ అని షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ పెట్టాడు. ఇప్పుడదీ వైరల్‌గా మారింది.

    ఆ సమయంలో ఎంతో బాధపడ్డా: సమంత

    స్టార్‌ హీరోయిన్‌ సమంత ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలతో కుంగిపోయినట్లు తెలిపింది. ‘ నా ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు నా వైవాహిక బంధం కూడా ముగిసింది. దీంతో ఎంతో బాధపడ్డాను. గత రెండు సంవత్సరాలుగా నేనెంతో బాధకు గురయ్యాను. ఆ సమయంలో ఇతర నటీనటుల గురించి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ట్రోలింగ్‌లను ఎలా తట్టుకున్నారో తెలుసుకున్నా. వాళ్ల గురించి చదవడం నాకెంతో సహాయపడింది’. అని సమంత తెలిపారు.

    గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్

    సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఆయన సమర్పించారు.

    రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమార్తెలు మృతి

    TS: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంnలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి తన ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తుండగా ఓ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మేడ్చల్‌ నుంచి తూప్రాన్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

    జగన్‌పై లోకేష్ విమర్శలు

    టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘వాహ్.. ఒక్క యూనిట్ కూడా వాడని ఇంటికి రూ.295 కరెంట్ బిల్లు బాదుడు. సొంత పేపర్, ఛానెల్, సిమెంట్, విద్యుత్ కంపెనీలు, ఊరికో ప్యాలెస్ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్ పేదలకి రూపాయి స్కీం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కాం. జనాన్ని క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు బిడ్డ ఎలా అవుతావు జగన్?’ అని లోకేష్ విమర్శించారు.

    ‘జపాన్‌’ నుంచి జోష్‌ఫుల్‌ వీడియో సాంగ్‌

    కార్తి హీరోగా రాజు మురుగన్‌ దర్శకత్వంలో ‘జపాన్‌’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే..ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించింది. నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘టచ్చింగ్ టచ్చింగ్‌’ అంటూ సాగే జోష్‌ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు.

    సిరియాలో అమెరికా దాడులు

    సిరియాలో ఇరాన్‌ మద్దతు దళాలపై అమెరికా దాడులు చేసింది. ఆయుధ నిల్వ కేంద్రంపై యుఎస్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఇరాన్‌ మద్దతిస్తున్న కొన్ని సాయుధ దళాలు ఇరాక్‌, సిరియాల్లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసింది. పశ్చిమాసియాలో అమెరికా దళాలపై దాడులు మాత్రం సహించబోమని తెలిపేందుకే ఈ చర్యకు దిగినట్లు అమెరికా పేర్కొంది.

    షమీకి ఆఫర్‌ ఇచ్చిన హీరోయిన్‌..

    టీమిండియా బౌలర్ షమీకి ఓ హీరోయిన్ ఆఫర్ ఇచ్చింది. షమీని పెళ్లి చేసుకుంటానని పాయల్ ఘోష్ నేరుగా కోరింది. తన సోషల్‌ మీడియా ఖాతా నుంచి షమీకి ప్రపోజ్ చేసింది. కానీ షమీని పెళ్లి చేసుకోవడానికి ప్రత్యేక షరతు ఇలా పెట్టింది. ‘షమీ.. నువ్వు ఇంగ్లిష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.’ అంటూ ఒక కండీషన్‌ పెట్టి ట్వీట్ చేసింది. ‘మహ్మద్ షమీ.. సెమీ-ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నా నుంచి మీకు ఏ సహాయం కావాలి చెప్పాలని కోరింది’. … Read more

    మారువేషంలో జనం మధ్యలోకి సీఎం

    హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారు. సాధారణ వ్యక్తిలా కాసేపు ప్రజల మధ్యలో తిరిగారు. టోపీ పెట్టుకుని, మాస్క్‌ ధరించి.. ముఖానికి తువ్వాలు చుట్టుకుని ఫోన్‌ చూసుకుంటూ నిలబడ్డారు. రోడ్డుపై సమోసాలు తిని ప్రజలలో మమేకమై ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. ఆ సమయంలో కట్టర్ చుట్టూ భద్రతా సిబ్బంది లేరు.