• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘వ్యూహం’ ట్రైలర్‌పై ఫిర్యాదు

    దర్శకుడు రాంగోపాల్‌వర్మపై టీడీపీ నేత గంగాధర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ తీసిన వ్యూహం సినిమా ట్రైలర్‌ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లను కించపరిచేలా ఉందని తెలిపారు. ఇరు పార్టీల కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసేలా పలు అభ్యంతర వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాటల్లోని కొన్ని పదాలు కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. రాంగోపాల్‌వర్మ సహా చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌, నటీనటులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో గంగాధర్ ఫిర్యాదు చేశారు.

    ‘నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం’

    సీఎం జగన్‌పై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే జగన్‌ నైజమని విమర్శించింది. ‘ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. ఇది చేయడం చేస్తే జగన్‌లో ఓటమి భయం పట్టుకుందని టీడీపీ విమర్శించింది.

    ‘మత్తుమందు లేకుండా చిన్నారులకు చికిత్స’

    అమెరికాకు చెందిన నర్సు ఎమిలీ కల్లాహన్ గాజాలో మొన్నటివరకూ సేవలందించారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఆమె ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గాజాలో వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడంతో మత్తు మందు ఇవ్వకుండానే చిన్నారులకు చికిత్సలు చేశామని తెలిపారు. ‘గాజాలో ప్రాణాలు పోతాయని తెలిసినా పాలస్తీనా వైద్యులు, నర్సులు సేవలందిస్తున్నారు, కాలిన గాయాలు, స్వల్పంగా కాళ్లు, చేతులు విరిగిన చిన్నారులు అటూ ఇటు తిరుగుతుండటం కలచివేస్తోంది’. అని ఆమె చెప్పుకొచ్చారు.

    స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 65,101.95 దగ్గర స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. 64,851.06 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 33.21 పాయింట్ల స్వల్ప లాభంతో 64,975.61 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,449.60 దగ్గర ప్రారంభమై చివరకు 36.80 పాయింట్లు లాభపడి 19,443.50 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్ద నిలిచింది.

    వన్డే ఐసీసీ ర్యాంకులు విడుదల

    ICC వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ నంబర్‌వన్‌ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ రెండో స్థానానికి దిగజారాడు. శుభ్‌మన్‌ గిల్ 830 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్‌ అజామ్‌ 824 పాయింట్లు రెండో స్థానంలో ఉన్నాడు. క్వింటన్ డికాక్‌ (771), విరాట్ కోహ్లీ (770), డేవిడ్ వార్నర్ (743) తర్వాతి స్థానాల్లో నిలిచారు. శ్రేయస్‌ అయ్యర్ 17స్థానాలను ఎగబాకి 18వ ర్యాంక్‌ను సాధించాడు.

    ఆమిర్‌ఖాన్ కుమార్తె పెళ్లి వేడుకలు షురూ

    బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఐరా ఖాన్‌ – నుపుర్‌ వివాహం జనవరి 3న జరగనుంది. ఇందులో భాగంగా ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఐరా తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఇందులో వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇరు కుటుంబసభ్యులు విందు భోజనాలు ఏర్పాటు చేసి, కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు.

    రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టీచర్లు మృతి

    ఛత్తీస్‌గఢ్‌ తొలి విడత ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. పోలింగ్‌ విధులు ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఉపాధ్యాయులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్నవాహనం ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు.

    ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి: KCR

    ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. సేవ చేసే వ్యక్తులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికలు అవగానే ఇచ్చిన హామీని ఆ పార్టీ విస్మరించిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పోరాటానికి భయపడి కాంగ్రెస్‌ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని తెలిపారు.

    రష్మికను కించపరచడం దారుణం: KTR

    రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో అంశంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌స్పందించారు. రష్మిక మందన్నాకు ఎదురైన చేదు అనుభవం వార్తల ద్వారా నేను తెలుసుకున్నానని తెలిపారు. ‘ఒక సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం దారుణం. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకురావాలి. డీప్ ఫేక్‌పై కేంద్ర కఠిన నిబంధనలు తీసుకువస్తే మా రాష్ట్రంలో అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

    ‘గుంటూరు కారం’ నుంచి తాజా అప్‌డేట్

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ “గుంటూరు కారం” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెసిందే. త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం నుంచి ఓ సాంగ్‌పై ప్రొడ్యూసర్ మరో సాలిడ్ అప్డేట్ అందించాడు. ఎక్కడా గుంటూరు కారం అని మెన్షన్ చేయలేదు కానీ జస్ట్ డేట్ పెట్టి బ్లాస్టింగ్ సింబల్స్ వదిలేసారు. దీనితో అయితే ఇది డెఫినెట్ గా గుంటూరు కారం సాంగ్ కోసమే అని అందరికీ అర్ధం అయిపోయింది. Courtesy … Read more