• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళలకు సీఎం క్షమాపణలు

    జనాభా నియంత్రణ అంశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన మహిళలకు క్షమాపణలు చెప్పారు. సెంబ్లీలో నితీష్ మాట్లాడుతూ.. ‘స్త్రీలు చదువుకుంటే భర్తలను కంట్రోల్‌లో పెట్టి జనాభాను తగ్గిస్తారు. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారు, తద్వారా జనాభా తగ్గుతుందని నితీష్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన మాటలు మహిళల హక్కులను భంగపరిచేవిలా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

    Diwali: భారతీయులకు ఇజ్రాయెల్ విన్నపం

    దీపావళి పండుగ రోజు భారత్‌కు ఇజ్రాయెల్‌ ఓ విన్నపం చేసింది. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదల కోసం భారతీయులంతా దీపాలు వెలిగించాలని అభ్యర్థించింది. తమ దేశం చేస్తున్న పోరును.. చెడుపై శ్రీరాముడు చేసిన యుద్ధంతో అభివర్ణించింది. ‘చెడును గెలిచి అయోధ్యకు తిరిగొచ్చిన ఆ శ్రీరాముడి విజయానికి గుర్తుగా దీపావళి పండగ చేసుకుంటున్నాం. అలాగే బందీలుగా ఉన్న తమ వాళ్లు క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుకుంటారనే ఆశతో మనం దీపాలు వెలిగిద్దాం.’ఇజ్రాయెల్‌ రాయబారి గిలాన్‌ భారతీయులను అభ్యర్థించారు. 240 of our … Read more

    దీపావళి పండుగ 12,13.. ఎప్పుడు జరుపుకోవాలి?

    దీపావళి రెండు రోజులు రావడంతో 12, 13 ఏ తేదీల్లో జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది. దీనిపై వేద పండితులు ఏం చేబుతున్నారో చూద్దాం.. కార్తీక మాస అమావాస్య నవంబర్ 12 మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని. అందుకే నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని’.పండితులు చెబుతున్నారు.

    శ్రీవల్లీ పాటపై అమితాబ్‌ ఆసక్తికర కామెంట్స్‌

    ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లీ పాట గురించి బాలీవుడ్‌ స్టార్ హీరో అమితాబ్‌ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పుష్ప నిజంగా అద్భుతమైన సినిమా అని కొనియాడారు. అందులో శ్రీవల్లీ పాట ప్రభంజనం సృష్టించిందని చెప్పారు. చెప్పు వదిలేసినా.. వైరల్‌ కావడం తన జీవితంలో మొదటిసారి చూశానన్నారు. ఆ పాట వచ్చాక చాలా మంది అదే స్టెపును వేశారని. ప్రతి ఒక్కరూ వారి చెప్పులను వదిలేసి మళ్లీ వేసుకునే వారని అమితాబ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Screengrab … Read more

    సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

    ఏపీ సీఎం జగన్‌‌కి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జగన్‌ అక్రమాస్తు కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈమేరకు సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్‌ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

    బాలయ్య ‘109’ పై సాలిడ్ అప్డేట్?

    బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “భగవంత్ కేసరి” చిత్రం భారీ విజయం సాధించింది. బాలయ్య తన 109 వ చిత్రాన్ని యంగ్ దర్శకుడు బాబీ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని గ్రాండ్ గా మేకర్స్ తీసుకెళ్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ ని అందించారు. తాగాజా మేకర్స్ ఓ పవర్ఫుల్ పోస్టర్‌తో సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు తెలియజేశారు. తాజా ఫోస్ట్‌లో గొడ్డలి, రేబాన్ కళ్లజోడుతో యాక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో … Read more

    ‘వార్‌ 2’ సెట్లోకి ఎన్టీఆర్?

    హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రాన్ని అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా.. వచ్చే నెలాఖరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ జనవరి నుంచి డేట్లు కేటాయించారని టాక్. ‘దేవర’ తొలి భాగం చిత్రీకరణ డిసెంబరు చివరి నాటికి పూర్తి కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే తారక్‌ జనవరి నుంచి ‘వార్‌ 2’ సెట్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    నటులైన మేము మనుషులమే కదా: మృణాల్

    రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోపై హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ స్పందించింది.. ఇలాంటి సంఘటనలు బాధాకరమంటూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. ‘అసలు సమాజం ఎటు వెళ్తుంది? మార్ఫింగ్‌ వీడియోలు చేసే వారికి సిగ్గుగా అనిపించట్లేదా. ఈ విషయంపై స్పందించినందుకు రష్మికకు ధన్యవాదాలు. స్పందించకుండా ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మేము వృత్తి పరంగా నటులం. కానీ మేము మనుషులమే కదా. మనం మౌనంగా ఉండే సమయం కాదిది’ అని మృణాల్ పేర్కొంది.

    అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

    అమెరికాలో కత్తిపోట్లకు గురై చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి మృతి చెందాడు. అమెరికాలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్‌(29) ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. గత నెల 31న జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతిచెందాడు.

    దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది: లోకేష్

    జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోంది. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి’. … Read more