• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు: పవన్

    తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీ నాయకత్వం రావాలని ఆకాంక్షించారు. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పవన్‌ పాల్గొన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే మాటకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. మోదీలాంటి ప్రధాని ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకోవడానికి ఉన్న అవకాశాలను రెండు రాష్ట్రాల నేతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ సాధనలో విజయం సాధించాం కానీ.. రాష్ట్ర అభ్యున్నతిలో సాధించాలేదని పవన్‌ అన్నారు.

    ఘాటుపుట్టిస్తోన్న ‘గుంటూరు కారం’ ప్రోమో సాంగ్

    మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తొలిపాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమోలో మహేశ్ స్టైల్‌గా కనిపించారు. ఆడియన్స్‌లో ఈ పాట జోష్ నింపేలా ఉంది. ఈ మూవీలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    సౌరజ్వాలను ఫొటో తీసిన ఆదిత్య-ఎల్‌1

    సూర్యుడిపై పరిశోధనలకు భారత్‌ ఆదిత్య-ఎల్‌1 ప్రయోగించిన విషయం తెలిసిందే.. ఈ వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన ఫొటోలను పంపించింది.ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన చేసింది. ‘సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా పేర్కొంటారు. హెచ్‌ఈల్‌1ఓఎస్‌ను గత నెల 27న ఇస్రో ఆన్‌ చేసింది. ప్రస్తుతం ఈ పరికరాన్ని పూర్తిస్థాయి పరిశీలనలకు సిద్ధం చేస్తున్నారు’. అని ఇస్రో పేర్కొంది.

    తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

    TS: తండ్రి మందలించాడని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చేటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న స్వామిగౌడ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె దివ్య డిగ్రీ పూర్తిచేసి ఓ ప్రైవేటు ఉద్యోగం చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఇంట్లో టీవీ, ఫోన్‌ చూస్తూ కాలం గడుపుతుండటంతో తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

    ఏపీలో త్వరలో జైలర్ సీన్: రఘురామ

    సీఎం నిజ స్వరూపం ఏమిటో ప్రధానికి మోదీకి తెలిసిపోయిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ‘జైలర్‌’ సినిమా సీన్‌ త్వరలో రాష్ట్రంలో కనిపించవచ్చన్నారు. ఆ సినిమాలో రజినీకాంత్‌ తన కుమారుడు దొంగతనాలు చేస్తున్న విషయం తెలిసి అతన్ని చంపాలని ఆదేశిస్తారని..అలాగే రాష్ట్రంలోనూ రేపు అటువంటి దృశ్యమే పునరావృతం కావచ్చని అన్నారు. పీఎం కిసాన్‌ పథకానికి వైఎస్సార్‌ రైతు భరోసా అని రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసిందని రఘురామ విమర్శించారు,

    ధరణి కంటే మెరుగైన వ్యవస్థను తెస్తాం: రేవంత్

    ధరణి పోర్టల్‌ కంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జోగులాంబలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇస్తున్నట్టు నిరూపించాలని సవాల్ చేశారు. అలాస్తే తాను నామినేషన్‌ వేయనన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని తెలిపారు. అలంపూర్‌‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు రేవంత్ విజ్ఞప్తి చేశారు.

    మిజోరంలో ప్రశాంతంగా పోలింగ్

    మిజోరంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 52.73 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెర్చిప్‌ జిల్లాలో 60.37శాతం పోలింగ్‌ నమోదైంది. లౌంగల్లాయ్ జిల్లాలో 59.31 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

    పిచ్చికుక్క దాడిలో చిన్నారులకు గాయాలు

    AP: చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలో ఓ పిచ్చికుక్క దాడిలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారులపై ఓ పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. బాధితులందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. కొంతమంది ఇళ్లకు వెళ్లిపోగా.. ఇషాంత్‌(8), యశశ్విని(9), ఫైజ్‌(2), అమ్ములు(11), కౌశిక్‌(8), కౌనేష్‌(7)లు ఆస్పత్రిలోనే ఉన్నారు. వీధుల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.

    కిషన్‌రెడ్డికి కవిత కౌంటర్

    తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. రాష్ట్రంలో కరెంట్‌పై బీజేపీ నేతలు అబద్దాలు చెప్పడం మానుకోవాలన్నారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలో కరెంటు సరఫరాపై కిషన్‌ రెడ్డి కట్టు కథలు చెప్పడం మానుకోండి. కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయి,’ అని కవిత పేర్కొన్నారు.

    ‘యాత్ర 2’ సోనియా గాంధీ లుక్ రిలీజ్

    పొలిటికల్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘యాత్ర 2’ చిత్రపై తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో జీవా, జగన్ పాత్రని పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ పొలిటికల్ పర్సనాలిటీ అయిన సోనియా గాంధీ పాత్రధారిణి లుక్‌ని రివీల్ చేశారు. ఈ పాత్రని ఓ ఆంగ్ల నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తుండగా సోనియా పాత్రకి ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.