• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు బెయిల్‌పై విచారణ వాయిదా

    IRR కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది. రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

    ఏపీని అమ్మేద్దామని చూస్తున్నారు: కన్నా

    ఏపీని కేసీఆర్‌కు జగన్ అమ్మేద్దామకుంన్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 2019 ఎన్నికల్లో జగన్‌ ప్రజల్ని మోసం చేసి గెలిచారని ఆరోపించారు. ప్రజలు మోసాన్ని గమనించారనే ఓటర్ల జాబితాలో మార్పులు చేసి గెలవాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపీ ఆస్తులు పోగొట్టారని చెప్పారు.. ఈ సారి రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అమ్మేద్దామని చూస్తున్నారని కన్నా విమర్శించారు.

    రష్మిక వీడియోపై నాగచైతన్య స్పందన

    హీరోయిన్ రష్మిక మార్ఫింగ్ వీడియోపై హీరో నాగ చైతన్య స్పందించాడు. తాజాగా ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ.. ‘టెక్నాలజీని దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధకలుగుతుంది. భవిష్యత్తులో రాబోయే మార్పులను తలచుకుంటే భయమేస్తోంది. బాధితులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలి’.అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు రష్మిక స్పందిస్తూ థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చింది.

    ‘బేబి’ హిందీ రీమేక్

    ఆనంద్ దేవరకొండ, విరాజ్ ఆనంద్ అలాగే నటి వైష్ణవి చైతన్య లు నటించిన చిత్రం “బేబి” భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ సినిమా తమిళ డబ్బింగ్, హిందీ రీమేక్ కానుంది. తాజాగా హిందీ రీమేక్ పై మాత్రం లేటెస్ట్‌‌గా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి హిందీలో పెద్ద సక్సెస్ చూసింది. ఇప్పుడు విజయ్ తమ్ముడు ఆనంద్ నటించిన ఈ సినిమా వెళ్లి ఎలాంటి సక్సెస్ చూస్తుందో చూడాలి.

    చంద్రబాబుకు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌

    చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చంద్రబాబుకు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరగనుంది. ఇప్పటికే రెండు సార్లు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కూడా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. తాజాగా మళ్లీ క్యాటరాక్ట్‌ చికిత్స కోసం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి వచ్చారు.

    బీజేపీ నాలుగో జాబితా విడుదల

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 12 మందితో జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు బీజేపీ 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ప్రటించిన స్థానాల్లో చెన్నూరు-దుర్గం అశోక్‌, ఎల్లారెడ్డి-సుభాష్‌రెడ్డి, మిర్యాలగూడ-సాధినేని శ్రీనివాస్‌, మునుగోడు-కృష్ణారెడ్డి, నకిరేకల్‌-మొగులయ్యతో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

    Poco C65 Mobile: ఫీచర్లు చూస్తే షాకే!

    ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ పోకో నుంచి సరికొత్త మెుబైల్ లాంచ్‌ అయ్యింది. ‘Poco C65’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచానికి పరిచయం అయ్యింది. మెుత్తం రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి గ్లోబల్‌ ముందుకు వచ్చింది. ‘Poco C55’ మెుబైల్‌కు అప్‌డేట్‌ వెర్షన్‌గా ‘Poco C65’ రూపొందించినట్లు తయారీ సంస్థ వెల్లడించింది. గత ఫోన్‌తో పోలిస్తే దీనిలో ఎన్నో అడ్వాన్స్డ్‌ ఫీచర్లను అమర్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ‘పోకో సీ65’ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను తెలుసునేందుకు YouSay Webపై క్లిక్ … Read more

    ‘గిల్‌తో డేటింగ్‌లో ఉన్న సారా నేను కాదు’

    భారత క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌పై నటి సారా అలీఖాన్ స్పందించారు. గిల్‌లో డేటింగ్‌లో ఉన్న ఆ సారాను నేను కాదని క్లారిటీ ఇచ్చారు. ‘సారా అనగానే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సచిన్ కుమార్తె సారా – గిల్‌ రిలేషన్‌లో ఉన్నారంటూ ఆమె హింట్ ఇచ్చినట్లు అయ్యింది. ఇక, శుభ్‌మన్‌ గిల్‌, సారా అలీఖాన్‌ విషయానికి వస్తే.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వార్తలు వచ్చాయన్ని విషయం తెలిసిందే..

    పెళ్లి చేసుకుని పిల్లలను కనండి: జిన్‌పింగ్

    చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండంతో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌లో భయం నెలకొంది. ఈ నేపధ్యంలోనే దేశంలోని యువతులంతా పెళ్లి చేసుకోవాలని మరోమారు ఆయన పిలుపునిచ్చారు. తాజాగా ఓ సమావేశానికి హాజరైన జిన్‌పింగ్‌ యువతులు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. 2022లో చైనా సంతానోత్పత్తి రేటు చారిత్రాత్మకంగా పడిపోయి 1.09కి చేరుకుంది. దేశంలో పిల్లలు లేని జంటల సంఖ్య రెండింతలు పెరిగింది.

    BRS బీసీని సీఎం చేయగలదా?: సంజయ్

    తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేయగలరా అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని దుయబట్టారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్‌ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం గెలిస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించామని గుర్తుచేశారు. కేవలం బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా మంచి జరగాలని చెప్పారు.