• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సనాతనంపై నా వ్యాఖ్యలు సరైనవే: ఉదయనిధి

    తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతనం ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని సమర్థించుకున్నారు. అంబేడ్కర్‌, పెరియార్‌, తిరుమావళవన్‌లు సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడిన దానికంటే తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదన్నారు. సనాతన ధర్మంపై నిర్వహించిన సమావేశంలో మంత్రులు పాల్గొనడం తప్పని, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించినదానిపై బదులిచ్చారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నాదన్నారు.

    నేడు రైతు భరోసా నిధులు విడుదల

    నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏడాదిలో రెండో విడత పెట్టుబడి సాయం పంపిణీ చేస్తుంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందనుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ రోజు సీఎం జగన్ బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో డబ్బును జమ చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా కింద ప్రభుత్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది.

    నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 176 పాయింట్ల నష్టంతో 64,781 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు తగ్గి 19,363 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్ల నష్టానికి దారితీశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అక్రమాలపై ప్రశ్నిస్తే కోవర్టు అంటారా?: పురందేశ్వరి

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్రం బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫైరయ్యారు. వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే టీడీపీ కోవర్టు అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. కేంద్రం పథకాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందన్నారు. పొత్తు లేకుంటే 175 స్థానాలకు బీజేపీ పోటీలో ఉంటుందని పురందేశ్వరి పేర్కొన్నారు.

    అనుష్క పుట్టిన రోజు గిఫ్ట్ ఇదే!

    ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంలో హీరోయిన్ అనుష్క కీలక పాత్ర పోషించి మంచి హిట్‌ను అందుకుంది. అయితే గతంలో అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ రానున్నట్లు తెలుస్తోంది. నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా భాగమతి 2 చిత్రం గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అనుష్క తన కెరియర్‌లో 49 చిత్రాల్లో నటించింది.

    ‘కేంద్ర పథకాలకు మీ పేర్లు ఉంటే ఊరుకోం’

    ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్‌ ముద్ర వేయడంపై మండిపడింది. తమ పథకాలకు వైసీపీ పేర్లు పెట్టుకుంటే అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని లేఖ రాసింది. కేంద్రం నిర్దేశించిన పేరు, లోగోలో ఎటువంటి మార్పులు చేయకూడదని స్ఫష్టం చేసింది. తమ పథకాలకు వైఎస్సార్‌, జగనన్న, నవరత్నాల లోగో వంటివి జత చేయకూడదని తెలిపింది.

    రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

    ఛత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17 పోలింగ్‌ జరగనుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3కు పోలింగ్‌ ముగియనుంది.

    ఓటర్లు పరిణతితో ఆలోచించాలి: కేసీఆర్

    ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజలు తమ ఓటు హక్కును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుంది. వలసలు వెళ్లి చాలా బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు. గతంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులకు కాంగ్రెస్‌ కారణం వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.’ అని కేసీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

    ‘గేమ్‌ ఛేంజర్‌’ సాంగ్ లీక్‌.. ఇద్దరి అరెస్టు

    రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. అయితే కొద్ది రోజుల క్రితం ఈ చిత్రంలోని ‘జరగండి జరగండి’ అనే పాట సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. మేకర్స్ ఫిద్యాదుతో దీనిపై విచారణ జరిపిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇద్దరి నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    మరోసారి ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.. వైద్య నిపుణుల సూచన మేరకు ఏఐజీ ఆస్పత్రిలో అవసరమైన పరీక్షలు చేయించుకోనున్నారు. శనివారం ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకున్నారు.