• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా విడుదల

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్‌ పెట్టుకున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. రేపు రెండో జాబితా విడుదల చేస్తామని తెలిపారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు కేఏ పాల్‌ వెల్లడించారు.

    దీపావళి పండుగ సెలవులో మార్పు

    ఏపీ ప్రభుత్వం దీపావళి పండుగ సెలవును మార్పు చేసింది. ఈ నెల 12 నుంచి 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 13న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ అధిెకారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం సెలవుల జాబితా ప్రకారం ఈ నెల 12న దీపావళి సెలవుగా ఉంది. ఈ క్రమంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేశారు. 13వ తేదీని ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రకటించారు..

    ‘సలార్’ ట్రైలర్ విడుదల డేట్ ఫిక్స్?

    ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సలార్‌ ట్రైలర్‌ నవంబర్‌ చివరి వారం లేదా డిసెంబర్‌ మొదట్లో రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సలార్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    తిరుమలలో భారీ వర్షం

    తిరుమలలో భారీ వర్షం కురిసింది.దీంతో దర్శనానికి క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. భక్తులు అతిథిగృహాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత కాస్తా పెరిగింది.

    ఎయిరిండియాకు ఖలిస్థానీ బెదిరింపులు

    భారత్‌-కెనడా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిరిండియా ప్రయాణికులను హెచ్చరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాదులు చేసిన హెచ్చరికలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై స్పందిస్తూ ఈ విషయాన్ని కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎయిరిండియా విమానాలకు భద్రత పెంచాలని కోరింది. నవంబరు 19న ఎయిరిండియా విమానంలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందని ఉగ్రవాదులు హెచ్చరించారు.

    సజ్జల వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ‘తన పార్టీతో సంబంధం లేదని గతంలో రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పుడు ఏ సంబంధం ఉందని తనపై ఆయన మాట్లాడుతున్నారు. తాము మాత్రం సంబంధం లేదనే అనుకుంటున్నాము. మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలి. ఏపీలో రోడ్లు, విద్యుత్‌పై కేసీఆర్‌ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెప్పాలి’. అని షర్మిల వ్యాఖ్యానించారు.

    కేసీఆర్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య

    సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆయన దేవరకద్రకు వెళ్తుండగా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వ్యవసాయ క్షేత్రంలో హెలికాప్టర్‌ను అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. దీంతో కేసీఆర్ దేవరకద్రకు వెళ్లేందుకు ఏవియేషన్‌ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయనుంది.

    అందుకే కేసీఆర్‌‌పై పోటీ: ఈటల

    బీఆర్‌ఎస్ నేతలకే ‘బీసీ బంధు’ దక్కిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందన్నారు. ‘కేసీఆర్‌ పాలనలో దళితులు, బీసీలు, సంతోషంగా లేరు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అంటున్నారు. అయితే తానుందుకు సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేస్తాను. బీఆర్‌ఎస్‌ను గద్దె దించడం బీజేపీకే సాధ్యం. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీ అధికారంలోకి రావాలి’. అని ఈటల పేర్కొన్నారు.

    దీపావళికి రాబోతున్న హాలీవుడ్‌ మూవీ..

    అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమా.‘ది మార్వెల్స్‌’ దీపావళి విడుదలకు సిద్ధమైంది. మార్వెల్‌ కామిక్స్‌ ఆధారంగా రానున్న ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇమాన్‌ వెల్లని, టోయోనా ప్యారిస్‌, సియో-జున్‌ పార్క్‌, శామ్యూల్‌ ఎల్‌. జాకన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    ఆ రాష్ట్రల్లో రేపు తొలి విడత పోలింగ్

    ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. రేపు మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో పోలింగ్‌ జరుగనుంది. మిజోరంలో 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి నిన్న సాయంత్రంతో తెరపడింది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.