• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఈగల్‌’.. టీజర్‌ విడుదల

    రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ‘ఈగల్‌’ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో రవితేజ కొత్త గెటప్‌లో కనిపించాడు. డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల, కావ్య థాపర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. What If #Anirudh Scores BGM For #EAGLE 🦅💥 #EAGLETeaser pic.twitter.com/4Rr3AsD9tC — Vardhan 3.0 (@vardhanEdits) November 6, 2023

    ఆ ఇద్దరే తెలంగాణ ద్రోహులు: షర్మిల

    సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై వైఎస్సార్‌టీపీఅధ్యక్షురాలు షర్మిల ఫైరయ్యారు. అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్‌లకు మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరని విమర్శించారు. ప్రజలు నమ్మి రెండు సార్లు అధికారమిస్తే రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా మని హామీనిచ్చి 10 ఏళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని షర్మిల విమర్శించారు.

    ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు: జడ్డూ

    టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా. ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు. మ్యాచ్‌పై నా ప్రదర్శనతో ప్రభావం చూపించడానికే ప్రయత్నిస్తా. ఒక క్యాచ్‌ పట్టగానే.. మైదానంలో రిలాక్స్‌ అయిపోను. మెరుగ్గా ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. కొన్ని సార్లు మిస్‌ఫీల్డ్ కావచ్చు.. కానీ చివరి వరకు ప్రయత్నించడం మాత్రం ఆపను’. అని జడ్డూ చెప్పుకొచ్చాడు.

    ఆర్టీసీ బస్టాండ్‌లో విషాదం

    AP: విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్‌లో విషాదం చోటుచేసుకుంది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో 112 నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. బస్సు కండెక్టర్‌, మరో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో 10 నెలల చిన్నారి కూడా ఉంది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    అతడి వల్లే భారీ స్కోరు సాధించాం: రోహిత్

    దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీతో భారీ స్కోరు సాధించగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఎంతో కీలక పాత్ర పోషించారని తెలిపాడు. అందుకే దక్షిణాఫ్రికాపై భారత్ 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిందన్నాడు. ఇంగ్లాండ్‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని మరీ విజయం సాధించామని చెప్పాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా ఆడాడని రోహిత్ కొనియాడాడు.

    లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు నేటి ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 395 పాయింట్ల లాభంతో 64,759 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 19,352 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రెడవుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ లాభాల్లో ఉన్నాయి.

    హోర్డింగ్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

    రూ.1000 కోసం ఓ యువకుడు హోర్డింగ్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రవీందర్‌ అనే వ్యక్తి పెయింటింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ వ్యక్తి అతడికి రూ.వెయ్యి ఇవ్వాల్సి ఉంది. కానీ అతడు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. దీంతో రవీందర్ హోర్ఢింగ్ ఎక్కి డబ్బు ఇప్పించాలంటూ హల్‌చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సిబ్బంది ద్వారా అతడిని కిందకు దింపారు. యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

    రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు.. నలుగురి మృతి

    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 28 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు.

    భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా కుప్పకూలిందిలా?

    వన్డే ప్రపంచకప్‌ భాగంగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 326 పరుగులు చేసింది. కోహ్లీ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా భారత బౌలర్లు మరోసారి విజృంభనతో సఫారీ జట్టును 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్‌ అయింది. జడేజా 5 వికెట్లు తీశాడు.. షమీ, కుల్‌దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌ ఒక వికెట్ తీశాడు. దీంతో టీమిండియా 243 పరుగుల తేడాతో భారీ విజయం … Read more

    చంద్రబాబును పరామర్శించిన పవన్‌

    టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.