• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నామినేషన్‌ పత్రాలతో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

    సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి గ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్‌ తాను దాఖలు చేయనున్న నామినేషన్‌ పత్రాలకు పూజలు చేశారు. నామపత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 9న ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

    BRS గెలవకపోతే అభివృద్ది ఆగిపోతుంది: KTR

    కేసీఆర్‌ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్ర అభివృద్ది ఆగిపోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన హైదరాబాద్‌లో అభివృద్ధి అందరికీ కనిపిస్తోందన్నారు. కానీ విపక్షాలకు అది కనిపించట్లేదని విమర్శించారు. కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలని తెలిపారు. ఈ పోరాటం దిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.

    కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు

    ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోది కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఖజానాను నింపుకోంటుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘మహాదేవ్’ పేరును కూడా వదిలిపెట్టలేదని విమర్శించారు. మహాదేవ్ బెట్టింగ్ నుంచి భారీగా డబ్బులు తీసుకుంటుందని ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలు కొత్త కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కులతత్వ విషాన్ని వ్యాపింపజేస్తున్నాయని మోదీ ఆరోపించారు.

    జగన్ సిగ్గుతో తలదించుకోవాలి: లోకేష్

    జగన్‌ అసమర్థ పాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. చెట్ల కింద రోగుల దుస్థితి.. జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందన్నారు. గిరిజన తండాల ప్రజలకు అండగా ఉన్న ధర్మాస్పత్రిలో మూడేళ్లుగా చెట్లకిందే వైద్యసేవలు అందిస్తున్నారంటే జగన్ సిగ్గుతో తలదించుకోవాలంటూ మండిపడ్డారు. జగన్ దివాలా కోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనాస్పత్రుల్లోనే దూది సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొందని లోకేష్ విమర్శించారు.

    NZ vs PAK: న్యూజిలాండ్ భారీ స్కోరు

    వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం న్యూజిలాండ్-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత టాస్‌ నెగ్గిన పాకిస్థాన్‌ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి. 401 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ బ్యాటర్లు డేవన్ కాన్వే (35), రచిన్ రవీంద్ర(108), కేన్ విలియమ్సన్ (95), డారిల్ మిచెల్ (29), గ్లెన్ ఫిలిప్స్‌ (41) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు, పాక్ బౌలర్లు, , షహీన్‌ అఫ్రిది … Read more

    ముకేశ్‌ అంబానీకి మళ్లీ బెదిరింపు మెయిల్స్‌

    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి మళ్లీ బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు పేర్కొన్నాడు. అక్టోబర్‌ 31, నవంబర్‌ 1న ఈ రెండు మెయిల్స్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకపోతే ముకేశ్‌ అంబానీని చంపేస్తామని మెయిల్‌లో నిందితుడు పేర్కొన్నాడు. ముకేశ్ మెయిల్స్‌కు స్పందించకపోవడంతో దుండగుడు అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడని పోలీసులు తెలిపారు. © ANI Photo © ANI Photo © ANI Photo

    గాజాలో ఆసుపత్రిపై మరో దాడి

    గాజాపై ఇజ్రాయెల్‌ మరో భారీ దాడికి పాల్పడింది. తాజాగా ఆసుపత్రిపై దాడి ఘటనలో భారీ సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్సు వాహనశ్రేణి ద్వంసమయ్యాయి. అంబులెన్సుల బయట చాలా మృత దేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. చనిపోయిన వారిలో చిన్నారులు ఉన్నారు. మానవతా సాయం అందించేందుకు వీలుగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని అమెరికా చేసిన అభ్యర్థనను ఇజ్రాయెల్‌ తిరస్కరించింది.

    నా మనసంతా అక్కడే ఉంటుంది: హార్థిక్

    గాయం కారణంగా టీమిండియా జట్టు నుంచి వైదొలగడంపై ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘వరల్డ్‌కప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని జీర్ణించుకోవడం లేకపోతున్నా? జట్టుకు దూరంగా ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది. కష్టకాలంలో నాపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హార్థిక్ ఆవేదనను వ్యక్తం చేశారు. వన్డే వరల్డ్‌కప్‌ నుంచి ఇలా అర్ధంతరంగా నిష్క్రమించడం బాధగా ఉందని ఉద్వేగానికి గురయ్యాడు.

    ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

    ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘సలార్’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం విడుదలను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ దీపావళి కానుకగా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ దీపావళికి టపాసుల బ్లాస్ట్ తో పాటుగా సలార్ బ్లాస్ట్ తో కూడా ఆరోజు మరో రీసౌండ్ తో మోత మోగనుంది అని చెప్పాలి.

    ‘హాయ్‌ నాన్న’ నుంచి ఫీల్‌గుడ్ సాంగ్‌

    నాని కథానాయకుడిగా ‘హాయ్‌ నాన్న’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా.. డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘ప్రాణం అల్లాడి పోదా.. అమ్మాడి’ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబి కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు