• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎంపీగా స్టార్ హీరోయిన్ పోటీ?

    రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ క్లారిటీ ఇచ్చారు. నిన్న గుజరాత్‌లోని ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కంగనా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించింది. శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కంగనా చెప్పుకొచ్చింది.

    ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

    దేశంలో ప్రస్తుతం ఉల్లి ధరల మోత మోగుతోంది. కొద్ది రోజుల క్రితం ఉల్లి రూ.30-రూ.40 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో బఫర్ స్టాక్ నుంచి రిటైల్ మార్కెట్లలోకి లక్ష టన్నుల ఉల్లిని విడుదల చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఉల్లిని సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.25 కే విక్రయిస్తోంది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత తగ్గనున్నాయని.. దీంతో సామాన్యుడికి … Read more

    అందుకే హీరోయిన్ అవకాశాలు కోల్పోయా: అనసూయ

    నటి అనసూయ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది ‘‘అత్తారింటికి దారేది’ సినిమాలో చాలా మంది హీరోయాన్స్‌ ఉన్నారని అందుకే తాను ఆ సినిమాలో నటించలేదని చెప్పింది. ‘గుంపులో ఒకరిగా నటించడం నాకు నచ్చదు. నాకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకున్నా. అప్పుడు నేను నో చెప్పడం తప్పు కాదు.. కానీ, నో చెప్పే విధానం తప్పేమో అని నాకు అనిపించింది. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటా. ఈ కారణంగానే హీరోయిన్ అవకాశాలను కూడా కోల్పోయాను’ అని అనసూయ చెప్పుకొచ్చారు.

    ఆ స్టార్ హీరో సినిమాలో విలన్‌గా సునీల్!

    తాజాగా శాండల్‌వుడ్‌ ఎంట్రీకి సునీల్ సిద్ధమయ్యాడు. స్టార్ హీరో కిచ్చా సుదీప్ సినిమాలో సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు. సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహాబలిపురంలో జరుగుతోంది. ఇటీవలే సునీల్ ఈ మూవీలో నటిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ప్రకటించారు.

    ఆ విషయంలో కార్తి జాగ్రత్త పడతాడు: నాని

    తమిళ నటుడు కార్తి హీరోగా, రాజు మురుగన్‌ దర్శకత్వంలో ‘జపాన్‌’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఈ సినిమా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హీరో నాని హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..’నా కెరీర్‌ ప్రారంభంలో నేను, కార్తి ఓ ఈవెంట్‌లో కలుసుకున్నాం. అప్పటి నుంచి అతడు నా సినిమాలు చూస్తుంటాడు. నచ్చితే ఫోన్‌ చేసి మాట్లాడతాడు. కార్తి ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా … Read more

    NZ vs PAK: పాక్ బౌలింగ్

    వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం న్యూజిలాండ్-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన పాకిస్థాన్‌ బౌలింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: న్యూజిలాండ్‌: డేవన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ పాకిస్థాన్‌: అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికార్ అహ్మద్, సౌద్ … Read more

    టీమిండియాకు బిగ్‌ షాక్‌

    టీమిండియాకు బిక్ షాక్ తిగిలింది. గాయం కారణంగా హార్దిక్‌ పాండ్య టోర్నీకి దూరమయ్యాడు. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో హార్దిక్ గాయపడ్డాడు. చీలమండ గాయం కావడంతో అతడు NCAకి వెళ్లిపోయాడు. గాయం తీవ్రత కారణంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు హార్దిక్‌ దూరమైనట్లు ఐసీసీ ధ్రువీకరించింది. అతడి స్థానంలో యువ పేసర్ ప్రసిధ్‌ కృష్ణను తీసుకుంది.

    సరికొత్త లుక్‌తో బాలయ్య

    భగవంత్‌ కేసరి’తో దసరా విజయాన్ని అందుకున్నారు హీరో బాలకృష్ణ మరో మూవీకి రెడీ అయ్యారు. తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 6నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుందని సమాచారం. 1980ల నేపథ్యం ఉన్న మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో.. సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు.

    నేడు ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌ మ్యాచ్

    వన్డే వరల్డ్‌కప్‌లో కీలక జట్లు పోరాటాలకు సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతుండగా, ఉదయం న్యూజిలాండ్‌.. పాకిస్థాన్‌తో తలపడబోతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి తర్వాత బలంగా పుంజుకుని ఆసీస్ వరుసగా నాలుగు విజయాలు సాధించింది. అయితే గాయంతో మ్యాక్స్‌వెల్‌, వ్యక్తిగత కారణాలతో మిచెల్‌ మార్ష్‌ దూరం కావడం ఆ జట్టును దెబ్బ తీసేదే. మరోవైపు 6 మ్యాచ్‌ల్లో 5 ఓడి దాదాపుగా సెమీస్‌కు దూరమైన ఇంగ్లాండ్‌ పరువు కోసం పోరాడనుంది.

    శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

    తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి నేరుగా భక్తుల్ని అనుమతిస్తున్నారు. దీంతో ఎనిమిది గంటల్లో సర్వదర్శం చేసుకోవచ్చు. నిన్న 66,048 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లుగా తేలింది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను నవంబర్‌ 10న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.