• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేపాల్‌లో భారీ భూకంపం.. 128 మంది మృతి

    నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 128 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 9వేల మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే.

    భార్యపై అనుమానంతో దారుణ హత్య

    భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా అనంత నగరంలో చోటు చేసుకుంది. స్థానికంగా దంపతులు నారాయణమ్మ(38), AP: నాగరాజులు నివాసం ఉంటున్నారు. నాగరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా భార్యపై అనుమానంతో భర్త తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న భార్యపై రోకలితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గాలిస్తున్నారు.

    టాలీవుడ్‌లో విషాదం.. నటుడు మృతి

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వరరావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగన్‌లో తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఈశ్వరరావు అక్టోబరు 31న అక్కడే తుది శ్వాస విడిచారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    అబద్ధాలు నమ్మి.. ఓటు వేయొద్దు: KCR

    ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎవరో వచ్చి చెప్పిన అబద్ధాలు నమ్మి.. ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రైతుబంధును కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తెస్తుందన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా వెనకబడి ఉన్న ఎస్సీలు బాగుపడాలనే దళితబంధు తీసుకొచ్చానని’. కేసీఆర్‌ తెలిపారు.

    నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో నోటిఫికేషన్

    నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఈ నెలాఖరులోగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. ఈ మేరకు ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి డిసెంబరులో రాత పరీక్షలు ఉంటాయి’ అని కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ పేర్కొన్నారు.

    ‘ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు భారత్‌ సిద్ధం’

    2036లో ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు భారత్‌ సిద్ధంగా ఉంది ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో క్రీడా నైపుణ్యాలకు కొదవ లేదన్నారు, దేశం అనేక మంది ఛాంపియన్లను సృష్టించిందని చెప్పారు. నేడు గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల మోదీ ప్రారంభించారు. ఈ ఏడాది క్రీడలకు కేటాయించిన బడ్జెట్‌.. తొమ్మిదేళ్ల క్రితంనాటి బడ్జెట్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువని చెప్పారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్‌ గొప్ప ఆసక్తి కనబరుస్తోందని మోదీ పేర్కొన్నారు.

    రేవంత్‌ తెలంగాణ వ్యతిరేకి: హరీష్‌రావు

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ వ్యతిరేకని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ప్రజలు తెలంగాణకు మద్ధతు ఇస్తే రేవంత్ తుపాకీ పట్టుకుని బయటికొచ్చి బెదిరించాడన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా రేవంత్‌ రెడ్డి పదవిని పట్టుకుని పాకులాడిండని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఇప్పుడు ఒక్కటవుతున్నారన్నారు. ఇలాంటి తెలంగాణ ద్రోహులకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.

    జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదు: లోకేష్

    ఏపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా, బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం… జగన్ జమానాలో దళితులపై అణచివేత … Read more

    97 వేల మంది భారతీయులు అరెస్టు?

    గత ఏడాదిలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 97 వేల మంది భారతీయులను అరెస్టు చేసినట్లు UCBP అధికారులు తెలిపారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. 2019-20లో 19,883 మంది, 2020-21లో 30,662 మంది, 2021-22 మధ్య 63,927 మంది అరెస్టు కాగా, 2022 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు వరకు 96,917 మంది భారతీయులు అరెస్టయినట్లు యూసీబీపీ తెలిపింది.

    సచిన్‌ విగ్రహంపై అభిమానులు అసంతృప్తి

    వాంఖడే స్టేడియంలో నిన్న సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే.. అయితే దీనిపై భారత క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ విగ్రహం ఆసీస్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను పోలి ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ విగ్రహాన్ని సరిగ్గా రూపొందింలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు స్టీవ్‌ స్మిత్‌ విగ్రహం భారత్‌లో ఉందేందంటూ వ్యంగ్యమైన కామెంట్స్‌ చేస్తున్నారు.