• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాగబాబు ఎమోషనల్ పోస్ట్

    నటులు వరుణ్‌- లావణ్య పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహంలో మెగా బ్రదర్స్‌ నాగబాబు, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లు దిగిన ఫొటో వైరల్‌గా మారింది. నాగబాబు ఈ ఫొటోను షేర్‌ చేస్తూ ఓ ఎమోషనల్‌ నోట్‌ రాశారు. ‘మా మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా.. మా అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ప్రత్యేకం. ఈ ఫొటో ఓ జ్ఞాపకం మాత్రమే కాదు అంతకు మించింది.. ఇది ఎప్పటికీ విడదీయరానిది. బలమైనది. దీనికి నేనెంతో విలువనిస్తాను’’ అంటూ ఇన్‌స్టాలో నాగబాబు రాసుకొచ్చారు.

    ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

    ఏపీ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినెట్‌ చర్చించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానం, కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

    ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జి కానున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఆయన్ను డిశ్చార్జి చేయనున్నారు. ఏఐజీ నుంచి ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లనున్నారు. చంద్రబాబు కంటి సమస్యకు వైద్యులు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంది. చంద్రబాబు వైద్య పరీక్షల కోసం నిన్న ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే..

    TS: ఎన్నికల్లో పోటీకి షర్మిల దూరం

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్ధేశం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడటం సరికాదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్ధతిస్తామని షర్మిల పేర్కొన్నారు.

    జియో వరల్డ్‌ ఈవెంట్‌.. మెరిసిన బాలీవుడ్‌ తారలు

    ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన జియో వరల్డ్ గార్డెన్ పక్కన జియో వరల్డ్‌ ప్లాజా రిటైల్‌ మాల్‌ను ముంబయిలో ప్రారంభించారు. ఈ మాల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో నిర్మించారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మాల్‌ను ప్రత్యేక కేంద్రంగా రూపొందించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు డిజైనర్లు రూపొందించిన డిజైనర్‌ వస్త్రాల్లో మెరిశారు. Screengrab Instagram: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter: Courtesy Twitter:

    డెంగీ తర్వాత నాలుగు కేజీలు తగ్గా: గిల్

    టీమిండియా స్టార్ బ్యాటర్ శుభమన్‌గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను డెంగీ నుంచి కోలుకుని వచ్చాక పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేనని తెలిపాడు. డెంగీ తర్వాత నాలుగు కేజీల బరువు తగ్గినట్లు తెలిపాడు. ‘వరల్డ్‌కప్‌లో మా బౌలర్లు బౌలింగ్‌ చేస్తున్న తీరు అద్భుతం. బుమ్రా, షమీ దెబ్బకు మా విజయం సులభం అవుతోంది. నేను మొదట్లో ఆచితూచి ఆడాల్సి వచ్చింది. బౌలర్లపై ఒత్తిడి తీసుకు రావాల్సి వచ్చింది. అందుకే, స్ట్రైక్‌ను రొటేట్‌ చేయడంపై దృష్టిసారించాం’. అని గిల్ చెప్పుకొచ్చాడు.

    ముందే సెమీస్‌కు చేరడం ఆనందం: రోహిత్

    వన్డే ప్రపంచకప్‌లో ముందే సెమీస్‌కు చేరడం ఆనందంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తమ తొలి లక్ష్యం పూర్తయిందని తెలిపాడు.. ‘ఇక ముందున్న సవాళ్లకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జట్టులో ప్రతి ఒక్కరూ తమ పాత్రను గొప్పగా పోషిస్తున్నారు. వరల్డ్‌ కప్‌లో మా ఆటతీరు పట్ల గర్వంగా ఉంది. ఇప్పుడు అధికారికంగా సెమీస్‌కు చేరుకోవడం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ఇక ఫైనల్స్‌పైనే గురి పెడతాం’. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    జగన్ కేసు విచారణ ఎందుకు ఆలస్యం: సుప్రీం

    ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని సీబీఐని ప్రశ్నించింది.ఈ మేరకు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రాఘురామ పిటిషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

    సూది అవసరం లేకుండా ఇన్సులిన్‌

    ఓ వ్యక్తి ఇన్సులిన్‌ తీసుకోవాలంటే సూది ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. అయితే హైదరాబాద్‌కు చెందిన నీడిల్‌ఫ్రీ టెక్నాలజీస్‌ ‘సూది అవసరం లేని, నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్‌ స్ప్రే ‘ఓజులిన్‌’ను’ అభివృద్ధి చేసింది. దీని ద్వారా మధుమేహ చికిత్సలో సూది నొప్పిలేండా ఉపశమనం పొందవచ్చు. ఇప్పటికే 40కి పైగా దేశాల్లో ఓజులిన్‌కు అంతర్జాతీయ పేటెంట్లను సంపాదించింది. ఇపుడు ఓజులిన్‌పై భద్రతా పరీక్షలను నిర్వహించడానికి సీడీఎస్‌సీఓకు కంపెనీ దరఖాస్తు చేసింది.

    లాభాలల్లో ట్రేడవుతున్న దేశీయ మార్కెట్లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 378 పాయింట్ల లాభంతో 64,459 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 19,245 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉండడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌టీ, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.