• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓపిక పట్టండి మనమేంటో చూపిద్దాం: విజయ్

    ‘లియో’ విజయోత్సవ వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ఏదైనా తప్పకుండా చేయాలనుందన్నారు. ‘మీ కాలు చెప్పులా ఉండటానికి కూడా వెనుకాడను. అందరూ ఓపిక పట్టండి. విజయాన్ని అందుకోవచ్చు, భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అంటూ విజయ్‌ తన అభిమానులను ఉద్దేశించి చెప్పుకొచ్చారు.

    శ్రీలంక అత్యంత చెత్త రికార్డు

    వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో శ్రీలంక క్రికెట్‌ జట్టు అత్యంత చెత్త రికార్డును నమోదుచేసింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలింది.. దీంతో వరల్డ్‌కప్‌లో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ చెత్త రికార్డు గతంలో బంగ్లాదేశ్‌ పేరిట ఉండేది. 2011 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 58 పరుగులకే ఆలౌటైంది. దీనికి ముందు 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 74 పరుగులు మాత్రమే చేసింది .

    TS: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు

    చంద్రబాబుపై సీఐడీ మరోకేసు

    చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదుచేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని ఎపీఎండీసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబును ఏ2గా, మాజీ మంత్రి పీతల సుజాతను ఏ1గా, చింతమనేని ప్రభాకర్‌ను ఏ3గా, దేవినేని ఉమాను ఏ4 నిందితులుగా చేర్చింది. వీరు టీడీపీ హయాంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా చేశారని సీఐడీ ఫిర్యాదులో పేర్కొంది.

    కర్ణాటకలో జికా వైరస్ కలకలం

    కర్ణాటకలో జికా వైరస్‌ కలకలం రేపుతోంది. చిక్కబళ్లాపుర్‌ జిల్లాలో కొత్త కేసు నమోదైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిలో వంద మంది నుంచి శాంపిళ్లను సేకరించింది. వీటిని పరీక్షించగా ఒకరికి జికా పాజిటివ్‌ వచ్చింది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి నివాసప్రాంతం చిక్కబళ్లాపుర్‌ కావడంతో వైద్యవర్గాలు అప్రమత్తమయ్యాయి. రాయచూర్‌ జిల్లాలో 5 ఏళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు.

    కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

    టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు కోహ్లీ 8 క్యాలండర్ ఇయర్లలో 1000పైగా పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో సచిన్ (7), గంగూలీ (6), సంగర్కర (6), రికీ పాంటింగ్ (6), రోహిత్ (4) ఉన్నారు.

    ప్రజల హక్కుల కోసమే BRS పుట్టింది: KCR

    ప్రజల హక్కుల కోసమే బీఆర్‌ఎస్ పెట్టిందని సీఎం కేటీఆర్ అన్నారు. 15 ఏళ్ల పోరాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. నిర్మల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ‘రైతులకు మేలు చేసే ఉద్దేశంతో రైతుబంధు తీసుకొచ్చాం. దాన్ని కాంగ్రెస్ దుబారా ఖర్చు అని అంటుంది. ఇప్పటికే చాలా మంది రైతుల రుణమాఫీ చేశాం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో మరి కొందరికి పూర్తి చేయలేక పోయాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు. ధరణి తస్తుంది. అప్పుడు అవి రెండూ కూడా ఆగిపోతాయి’ అని … Read more

    JEE Main 2024 నోటిఫికేషన్ విడుదల

    జేఈఈ మెయిన్స్-2024 పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. సెషన్ 1 పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. జనవరిలో మొదటి విడత, ఏప్రిల్‌లో రెండో విడత మెయిన్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఈ నెల 30 వరకు విద్యార్థుల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. సెషన్ 1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య తేదీల్లో జరుగుతాయని వెల్లడించింది. పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను పరీక్ష జరగడానికి మూడు రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్‌టీఏ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

    ఆసీస్‌కు బిక్ షాక్.. కీలక ప్లేయర్ దూరం

    ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనింగ్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లకు మిచెల్ అందుబాటులో ఉండడని తెలుస్తుంది. ప్రపంచకప్‌ కోసం అతడు మళ్లీ తిరిగి రాబోడని ఆసీస్‌ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తలకు తీవ్ర గాయం కావడం గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సేవలను సైతం ఆసీస్ కోల్పోనుంది.

    సీఎంను చంపేస్తామని బెదిరింపు కాల్

    కేరళ సీఎం పినరయి విజయన్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. సీఎంను చంపేస్తామని దుండగులు ఆ రాష్ట్ర పోలీసు కార్యాలయానికి ఫోన్ చేశారు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే ఈ ఫోన్ కాల్ చేసింది మైనర్ బాలుడని సమాచారం. గతంలో కూడా విజయన్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.