• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ యుద్దానికి విరామం అవసరం: బైడెన్

    ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సూచించారు. మిన్నియాపొలిస్‌లో నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్‌ పాల్గొని మాట్లాడారు. ఇజ్రాయెల్ యుద్ధానికి విరామం అవసరమని భావిస్తున్నాను. బందీలను బయటకు తీసుకురావడానికి సమయం ఇవ్వాలి’. అని బైడెన్ పేర్కొన్నారు.

    ఏఐజీ ఆస్ఫత్రిలో చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నిన్న జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన ఏఐజీ వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. వారి సూచన మేరకు చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.

    దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు

    నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. క్వింటన్ డికాక్, వాన్‌డర్‌ డసెన్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటి దక్షిణాఫ్రికా బ్యాటర్లు 82 సిక్స్‌లు కొట్టారు. దీంతో 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేరిట ఉన్న 76 సిక్స్‌ల రికార్డును దక్షిణాఫ్రికా అధిగమించింది. డికాక్‌ 18, క్లాసెన్ 17, మిల్లర్ 14, మార్కో జాన్‌సెన్ 9, మార్‌క్రమ్ 8, వాన్‌డర్‌ డసెన్ 7 చొప్పున … Read more

    అది కేవలం నా ఒక్కడి ఆలోచన కాదు: రోహిత్

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మ్యాచ్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. ‘విశ్లేషణ చేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలి. జట్టు నిర్ణయాలకు కట్టుబడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లేది వారే. ఇది కేవలం కెప్టెన్‌గా నా ఒక్కడి ఆలోచనే కాదు. ఎల్లవేళలా నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తా అయితే, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరమూ ఉంది. అంతేకానీ, ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్‌ చేయలేను’. రోహిత్ చెప్పుకొచ్చాడు.

    రామ్‌ చరణ్‌కు అరుదైన గుర్తింపు

    టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. ఆస్కార్‌ కమిటీ తాజాగా వెల్లడించిన మెంబర్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌ జాబితాలో రామ్‌ చరణ్‌కు చోటు దక్కింది. రామ్ చరణ్‌ను ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆస్కార్ అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ఈ లిస్ట్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే జూ. ఎన్టీఆర్‌కు అందులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

    విలాసవంతమైన భవనాల్లో టాప్‌ నగరాలు ఇవే!

    ప్రపంచంలోనే విలాసవంతమైన నివాస భవనాల ధరలు పెరుగుదల జాబితాలో గ్లోబల్‌గా ముంబయి నాలుగోస్థానంలో నిలిచింది. ఈ మేరకు ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్‌ క్యూ3 2023’ నివేదికలను విడుదల చేసింది. అందులో దేశంలోని ముంబయి నాలుగోస్థానం, దిల్లీ పదో స్థానం, బెంగళూరు 17వ స్థానంలో నిలిచాయి. గతేడాది ముంబయి 22వ స్థానం ఉంది. దిల్లీ, బెంగళూరు సైతం వాటి ఇండెక్స్‌ను మెరుగుపరుచుకున్నాయి. తొలి మూడు స్థానాల్లో ఫిలిప్పీన్స్‌, దుబాయ్‌, షాంఘై, నిలిచాయి.

    ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం రామ్ సిక్స్ ప్యాక్

    రామ్‌ పోతినేని హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా కోసం రామ్ తన లుక్‌ మార్చారు. బరువు తగ్గి సిక్స్ ప్యాక్ దేహంతో సిద్ధం అయ్యారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి కొనసాగింపుగా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ముంబయిలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 8న పాన్ఇండియా సినిమాగా విడుదల కానుంది. ——–

    ప్రియుడిపై కోపంతో ప్రేయసి ఆత్మహత్య

    ప్రియుడిపై కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జైపూర్‌కు చెందిన ఖుష్బు శర్మ(32) హైదరాబాద్‌లోని గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఆమెకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో నెల్లూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో మనోజ్‌ను తన ఇంటి వద్దకు రమ్మని చెప్పింది, రాకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అతడు రాకపోవడంతో ఖుష్భు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

    అర్థరాత్రి షారుక్‌ ఇంటికి ఫ్యాన్స్‌

    నేడు షారుక్‌ ఖాన్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటికి వస్తుంటారు. ఎప్పటిలాగే నిన్న అర్ధరాత్రి 12 షారుక్ అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. బాణసంచా పేలుస్తూ పండుగలా జరుపుకుంటారు. ఇంటి బాల్కనీ వద్దకు చేరుకుని షారుక్ అభివాదంతో చేతులు ఊపుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపాడు. https://www.instagram.com/reel/CzHYwbyMRy1/?utm_source=ig_embed&ig_rid=2cc7cacb-363d-4528-a88d-e4ecbb82e1d4

    భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 501 పాయింట్ల లాభంతో 64,092 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 19,142 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 83.20 దగ్గర ప్రారంభమైంది.