• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కల్వకుంట్ల ‘స్కా.. మేశ్వరం: రేవంత్ విమర్శ

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలు రాయి. నిన్న మేడిగడ్డ.. నేడు అన్నారం..అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు..రూ.లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగుకోట్ల జనం నోట్లో మట్టిగొట్టావు.. ఇలా కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణం..మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు.. రూ. లక్ష కోట్ల అవినీతి’. అని రేవంత్ ఆరోపించారు.

    మనవరాలితో చిరు దంపతులు

    వరుణ్‌ – లావణ్యల జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇటలీలోని టస్కానీ వేదికగా వీరి వివాహం జరిగింది. ఈ వేడుకలో రామ్‌చరణ్-ఉపాసనల కుమార్తె క్లీంకారను ఎత్తుకొని తాతయ్య, నానమ్మలు అయిన చిరంజీవి, సురేఖ దంపతులు ఆనందపడిపోతూ కనిపించారు. మనవరాలిని ఒళ్లో కూర్చొబెట్టుకుని ఆడిస్తూ కనిపించారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌-లావణ్య

    నటుటు వరుణ్‌ తేజ్‌ -లావణ్య త్రిపాఠిల వివాహం ఘనంగా జరిగింది. ఇటలీలోని టస్కానీ వేదికగా నిన్న రాత్రి వీరి వివాహం జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్‌ మూడుముళ్లు వేశారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి నితిన్‌, ఆయన సతీమణి షాలినీతో హాజరయ్యారు, ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు.

    నేడు శ్రీలంకతో భారత్‌ పోరు

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి లేకుండా టీమిండియా దాదాపుగా సెమీస్‌ చేరింది. కానీ అధికారికంగా బెర్తు సొంతం కావాలంటే నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో టీమిండియా గెలవాలి. శ్రీలంకతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మరో ఘనవిజయం, దాంతో పాటు సెమీస్‌ బెర్తు సొంతమైనట్లే. ఇకపోతే ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఓడి సెమీస్‌ రేసులో శ్రీలంక వెనుకబడింది.

    టీడీపీ మాజీ అధ్యక్షుడిపై కేసు

    తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకొని దాడికి పాల్పడ్డారంటూ టీడీపీ నేత డాక్టర్‌ ఏ.ఎస్‌.రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యాలయంలోనికి వెళ్లకుండా కాసాని జ్ఞానేశ్వర్, సభ్యులు ప్రకాశ్‌ ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్, ప్రశాంత్‌ యాదవ్‌ తదితరులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో కుడికంటిపై గాయమైందని తెలిపారు.

    అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి

    అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్‌రాజ్‌(29) ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడిచేశాడు. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వరుణ్‌కు శస్త్రచికిత్స చేశారు. వరుణ్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిని పోలీసులు అందుపులోకి తీసుకున్నారు.

    ‘డెవిల్’ విడుదల వాయిదా పడినట్లేనా?

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘డెవిల్’ చిత్రంపై లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 24, వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే పలు సాంకేతిక కారణాల వలన, సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మేకర్స్ సరికొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నారు.

    ‘తంగలాన్‌’ టీజర్ రిలీజ్

    విక్రమ్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో ‘తంగలాన్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఇందులో పార్వతి, మాళవిక మోహన్‌, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ఎలాంటి డైలాగ్స్‌ లేకున్నా విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో భయంకరంగా టీజర్‌ను చూపించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

    అయోధ్య రాముడి కోసం 8 అడుగుల సింహాసనం

    అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తులను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మందిరంలోని గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉన్న పాలరాతి సింహాసనంపై ఏర్పాటు చేయనున్నారు. ఇది డిసెంబరు 15 నాటికి ఇది అయోధ్యకు చేరుకుంటుంది.

    థాయ్‌లాండ్‌ వెళ్లేందుకు వీసా అక్కర్లేదు

    థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో విసా లేకుండా 30 రోజులపాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. తాగాగా భారత్‌, తైవాన్‌ దేశాలకు ఈ అవకాశం కల్పించింది. పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో థాయ్‌లాండ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. గత నెలలో చైనా నుంచి వచ్చే పర్యాటకులకు థాయ్‌లాండ్‌ వీసా మినహాయింపును ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం శ్రీలంక భారత్‌ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించింది.