• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NZ vs RSA: టాస్ నెగ్గి న్యూజిలాండ్ బౌలింగ్

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(c), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ న్గిడి. న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, … Read more

    ఒకే కుటుంబంలో 19 మంది మృతి

    ఇజ్రాయెల్ దాడిలో ఓ జర్నలిస్టు 19 మంది కుటుంబసభ్యులను కోల్పోయాడు. హమాస్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే గాజా శివార్లలోని జబాలియాలో శరణార్థ శిబిరం ఉన్న అపార్ట్‌మెంటుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రముఖ మీడియా సంస్థ చెందిన ఓ జర్నలిస్టు కుటుంబంలో 19 మంది శరణార్థ శిబిరంలో ప్రాణాలు కోల్పోయారు.

    Video: మద్యం బాటిళ్లతో జనం పరార్

    మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక కారుకు ప్రమాదానికి గురైంది. దీంతో అందులోని మద్యం సీసాలను అక్కడున్న వారంతా ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో కారు వేగంగా వెళ్తు మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో లోపల మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో అక్కడున్నవారు వాటిని తీసుకుని పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ये लूट का दृश्य शराबबंदी वाले राज्य बिहार के गया … Read more

    వాంఖడేలో సచిన్‌ విగ్రహావిష్కరణ

    వాంఖడే స్టేడియంలో దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందుల్కర్‌ విగ్రహావిష్కరణ జరగనుంది. రేపు ప్రపంచకప్‌లో భారత్‌, శ్రీలంక జరుగనుండగా.. ఒకరోజు ముందుగా నేడు సచిన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్‌ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో వాంఖడే స్టేడియంలో అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎంసీఏ నిర్ణయించింది. నిన్న ఈ విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు. సీఎం ఏక్‌నాథ్‌ షిందే, సచిన్‌, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

    ‘కలలు కన్నా..కానీ ఇది ఊహించలేదు’

    టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్‌ ప్రారంభింలో తాను ఇన్ని సెంచరీలు, పరుగులు చేస్తానని అనుకోలేదని చెప్పారు. ‘సుదీర్ఘ కెరీర్‌, ప్రదర్శనలతో ఇన్ని సాధిస్తానని అనుకోలేదు. బాగా ఆడాలని ఎప్పుడూ కలలు కన్నాను. అలాగే జరుగుతుందని ఊహించలేదు. 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇన్ని సెంచరీలు, పరుగులు సాధిస్తానని అనుకోలేదు. క్లిష్ట పరిస్థితుల్లో విజయాలు అందించాలని భావించా. అందుకోసం కమ్రశిక్షణ, జీవనశైలికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకున్నా’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

    ‘పుష్ప 2’ కొత్త షెడ్యూల్!

    ‘పుష్ప 2 ది రైజ్’ చిత్రంపై తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రంకి సంబందించిన షూటింగ్ పై క్లారిటీ వచ్చింది. రేపటి నుండి ఈ సినిమాకి సంబందించిన కొత్త షెడ్యూల్ ఒకటి స్టార్ట్ కానుందని సమాచారం. హైదరాబాద్‌లో కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. అయితే దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    నేడు హై ఓల్టేజ్ మ్యాచ్

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే.. 12 పాయింట్లతో ఆ జట్టు దాదాపుగా సెమీఫైనల్‌ చేరినట్లే. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ చాలా వరకు మెరుగైన బ్యాటింగ్‌ ప్రదర్శన చేశాయి. మొత్తం మీద పాయింట్ల పట్టికలో రెండు, మూడో స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని అంచనా. 2019 ప్రపంచకప్‌ తర్వాత ఈ రెండు జట్లు వన్డే మ్యాచ్‌లో తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం.

    బస్సు బోల్తా 22 మందికి గాయాలు

    AP: చిత్తూరు జిల్లాలో ప్రమాదం జరిగింది, ప్రైవేటు బస్సు బోల్తా 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై వద్ద అదుపుతప్పింది. ఈ క్రమంలో గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు తీవ్రంగా గాయపడ్డారు.మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ నష్టాలతోనే ప్రారంభమైయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 27 పాయింట్ల నష్టంతో 63,847 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 19,075 దగ్గర కొనసాగుతోంది. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టీసీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    ఢిల్లీకి వెళ్లిన లోకేష్

    టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులతో కేసులపై చర్చించనున్నారు. కేసుల విషయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తారు. చంద్రబాబు క్యాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.. మరోపైపు ఏపీ ప్రభుత్వం లోకేష్‌పై పలు కేసులు మోపుతోంది. .