• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ‘వైఎస్సార్‌’ అవార్డుల ప్రదానోత్సవం

    నేడు ఏపీప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులు అందజేయనుంది. ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. దీనికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా, సీఎం జగన్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లంభించనున్నాయి.

    నేడు రాష్ట్ర ఉత్సవంగా అవతరణ దినోత్సవం

    ఆంధ్ర రాష్ట్ర అవత­రణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యా­లయంలో సీఎం జగన్ ఉదయం 10.15 గంటలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జాతీయ పతా­కాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తర్వాత తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తారు.

    బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్‌

    ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ కాలం బంగారం కొనుగోళ్లు 10 శాతం పెరిగి 191.7 టన్నుల నుంచి 210.2 టన్నులకు చేరింది. ధరలు కొంత తగ్గడం, పండుగల డిమాండ్‌ దీనికి కారణమని నివేదికలు పేర్కొంటున్నాయి. 10 గ్రాముల ధర రూ.60,000 వరకూ ఉండటం ఆమోదయోగ్యమైనదిగా వినియోగదారులు భావిస్తున్నారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్‌ 7 శాతం పెరిగి 146.2 టన్నుల నుంచి 155.7 టన్నులకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 184.5 టన్నుల నుంచి 220 టన్నులకు పెరిగింది.

    ఓటీటీకి రూ.1000 కోట్ల సినిమా

    షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘జవాన్‌’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. షారుక్‌ పుట్టిన రోజు సందర్భంగా నవంబరు 2వ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘జవాన్’ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జవాన్ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది.

    93 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా

    93 ఏళ్ల ఓ వృద్ధ వయస్కురాలు ఆంగ్ల భాషలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన 83వ స్నాతకోత్సవంలో రేవతి తంగవేలు పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఆమె 1990లో అధ్యాపకురాలిగా పదవీ విరమణ చేశారు. తర్వాత నుంచి సికింద్రాబాద్‌లోని కీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంగ్లభాషలో వ్యాకరణం, వర్ణమాలతో పాటు పదాల కూర్పు వంటి అంశాలపై ఆమె పరిశోధనలు చేశారు.

    వచ్చే 25 ఏళ్లు చాలా ముఖ్యమైనవ: మోదీ

    వచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యమైనవని ప్రధాని మోదీ తెలిపారు. సర్దార్‌ పటేల్‌ స్పూర్తితో మన లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. దూరదృష్టితో కూడిన రాజ నీతిజ్ఞతను దేశ ప్రజలు ఎప్పటికీ స్మరించుకుంటారని తెలిపారు. దేశ అభివృద్ధికి బుజ్జగింపు రాజకీయాలే అడ్డంకిగా నిలుస్తున్నాయన్నారు. సానుకూల రాజకీయాలు చేయలేని కూటమి పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ చూచించారు. వారు సొంత ప్రయోజనాల కోసం దేశ ఐక్యతపైనా రాజీ పడతారని పేర్కొన్నారు.

    సీఎం కేసీఆర్‌ నేటి నుంచి రాజశ్యామల యాగం

    సీఎం కేసీఆర్‌ మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరగనుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరత రాష్ట్రాలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గోననున్నారు. మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పం, రెండోరోజు వేదపారాయణలు, చివరిరోజు పూర్ణాహుతి ఉంటుంది.

    ఓటర్ల జాబితాలో మీ పేరుందా?

    ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.. అయితే అందులో మీపేరు ఉందో లేదో పరిశీలించేందుకు ఉన్న మార్గాలివి. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు కాల్‌ చేస్తే వారు లైన్‌లో ఉంచి జాబితాలో పేరు ఉన్నదీ లేనిదీ చెప్తారు. 1950కి కాల్‌ చేస్తే జిల్లాలోని ఎన్నికల విభాగంలోని కాల్‌ సెంటర్‌కు వెళుతుంది. వారికి పేరు, నియోజకవర్గం చెబితే చాలు జాబితాలో పేరు ఉన్నదీ, లేనిదీ తెలుపుతారు. అలాగే ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, బూత్‌ నంబరు కూడా తెలియజేస్తారు.

    ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

    దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబర్‌ 7 నుంచి మొదలుకొని నవంబర్‌ 30 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించడం, ప్రచారం చేయడం, ఫలితాలు ప్రచురించడం వంటివి చేయరాదని హెచ్చరిచింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది.

    అఫ్గాన్‌కు సెమీస్‌ ఆశలు సజీవం.. ఎలాగంటే?

    ఈ వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ మూడు విజయాలు సాధించింది. అఫ్గాన్‌, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకను ఓడించింది. ఒకప్పుడు ఛాంపియన్‌గా నిలిచిన జట్టపై ఆఫ్గాన్ సంచలన విజయాలను నమోదు చేసింది. నిన్న లంకపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అఫ్గాన్ ఐదో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో అఫ్గాన్‌ ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు భారీ తేడాతో విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచినా అఫ్గాన్‌ సెమీస్‌కు చేరే అవకాశం ఉంది.