• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PAK vs BAN: పాకిస్థాన్ విజయం

    నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది. బంగ్లాపై పాక్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 205 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాక్ లక్ష్యాన్ని కేవలం 32.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. పాక్ బ్యాటర్లు అబ్దుల్లా షఫీక్‌ (68), ఫకర్‌ జమాన్‌ (81) అర్ధశతకాలతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో పాక్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.

    ‘ఓజీ’లో మరో నటుడు.. ఎవరంటే?

    పవన్‌ కళ్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’ చిత్రంపై తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. ఇందులో ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరో నటుడు భాగస్వామి అయ్యారు. ‘అన్నయ్య’, ‘శివరామరాజు’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన నటుడు వెంకట్‌ ‘ఓజీ’లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కొంతమేర చిత్రీకరణ కూడా అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

    ఇస్రో ఛైర్మన్‌కు ‘రాజ్యోత్సవ అవార్డు’

    ISRO ఛైర్మన్‌ సోమనాథ్‌కు కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించే వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. రాష్ట్రంలో విశేష సేవలందించిన 68 మందితో పాటు 10 సంస్థలకు కూడా ఈ పురస్కారాలను ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించారు. ఈ జాబితాలో 13 మంది మహిళలు, 64 మంది పురుషులు, ఒక హిజ్రా ఉన్నట్లు తెలిపింది. ఈ పౌర పురస్కారం కింద రూ.5లక్షల నగదు, 25 గ్రాముల బంగారు పతకాన్ని అందిస్తారు.

    దారుణం: పోలీసు అధికారి కాల్చివేత

    మణిపుర్ మరో ఘోరం చోటుచేసుకుంది. దండకులు ఓ పోలీసు అధికారి తుపాకీతో కాల్చి చంపారు. హెలిపాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోన్న సమయంలో చొరబాటుదారులు ఆయన్ను కాల్చివేశారు. గాయపడిన అసదరు పోలీస్ అధికారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇళ్ల మధ్య నుంచి తుపాకీ దుంగులు కాల్పులు జరిపారు. అయితే ఈ హత్యకు పాల్పడినవారి కోసం పోలీసులు ఆపరేషన్‌ మొదలు పెట్టారు.

    “మా ఊరి పొలిమేర 2” కోసం అడివి శేషు?

    సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా ఇస్తున్న ‘మా ఊరి పొలిమేర 2’, నవంబర్ 3, ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని దస్పల్లా కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నటుడు అడివి శేషు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది.

    తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి: రాహుల్

    కొల్లాపూర్‌లో సభలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ‘ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు నిలిచిపోతుదంటున్నారు. అందులో వాస్తవం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా రూ.15వేలు అందిస్తాం. ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటాం’ అని రాహుల్ హామీ ఇచ్చారు.

    ఒక్కొక్కరు రూ. 100 పంపించినా చాలు: రేణూ

    నటి రేణూ దేశాయ్‌కి పెంపుడు జంతువులు అంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే.. తాజాగా ఆమె ఓ మూడు కుక్కలకు ఆపరేషన్‌ చేయించేందుకు ఓ సంస్థకు విరాళం ఇచ్చారు. తన వంతుగా రూ.30 వేలు విరాళం ఇచ్చి.. మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరంటూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. ‘నేను రూ.30 వేలు సర్దాను. మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరు. ఒక్కొక్కరు రూ. 100 పంపించినా చాలు’ అని రేణూ దేశాయ్‌ తన ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌కి విజ్క్షప్తి చేశారు.

    వాట్సాప్ గు‌డ్‌న్యూస్.. ఆ వివరాలు ట్రాక్‌ చేయలేరు!

    ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గుర్తు తెలీని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను రింగ్‌ అవ్వకుండా సైలెన్స్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్‌ సమయంలో లొకేషన్‌, ఐపీ అడ్రస్‌ వివరాలు అవతలి వారికి తెలీకుండా చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొందరికి అందుబాటులోకి వచ్చింది.. ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేయాలంటే త్రీడాట్స్‌ మెనూలోని ప్రైవసీలోకి వెళ్లాలి. ఐపీ అడ్రస్‌ ఇన్‌ కాల్స్‌ అనే ఆప్షన్‌ ఎనేబుల్‌ చేసుకోవాలి.

    PAK vs BAN: బంగ్లాదేశ్‌ ఆలౌట్

    ప్రపంచకప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. లిట్టన్ దాస్‌ (45), మహ్మదుల్లా (56), షకీబ్ అల్ హసన్ (43), హసన్ మిరాజ్ (25) పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. పాక్‌ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, మహ్మద్‌ వసీమ్‌ 3, హారిస్ రవూఫ్‌ 2, ఉసామా మీర్, ఇఫ్తికార్ అహ్మద్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

    నా కెరీర్ ముగిసిందనుకున్నారు: బుమ్రా

    టీమిండియా బౌలర్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌ ముందు చాలా కాలం జట్టుకు దూరమైయ్యానని తెలిపాడు. ‘ఆ సమయంలో ఇక తన కెరీర్‌ ముగిసినట్లేనని పలువురు భావించారు. నా భార్య స్పోర్ట్స్‌ మీడియాలో పనిచేస్తోంది. అందువల్ల.. నా కెరీర్‌పై వ్యక్తమైన అనేక అనుమానాలు నాకు తెలిశాయి. అయితే వాటిని నేను పట్టించుకోలేదు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చినప్పుడు నాకు జట్టులో మంచి అవకాశాలు లభించాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాను’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.