• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BRS ఎంపీ, ఎమ్మెల్యేల భద్రత పెంపు

    బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ డీజీ ఆదేశాలు జారీ చేశారు.పెంచిన భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. తమకు కూడా భద్రత పెంచాలని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేసుకున్నారు. పోలీసులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

    మీ అభిమానం మర్చిపోలేనిది: చంద్రబాబు

    రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారని గుర్తుచేసుకున్నారు. సంఘీభావం తెలపడమే కాకుండా తాను చేసిన అభివృద్ధిని కూడా వివరించారని కొనియాడారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని తెలుగువారందరికీ పేరు పేరునా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

    తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకున్నాం: కేసీఆర్

    తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్‌ నేతలు పోరాడలేదని విమర్శించారు. ఆ పార్టీ వైఖరి, చరిత్ర, ప్రజల పట్ల వారికున్న దృక్పథం ఏంటనేది ప్రజలు ఆలోచించాలన్నారు. దళిత బిడ్డలు ఏళ్ల తరబడి వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు ప్రజల తలరాత, భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. ఏది నిజమో తెలుసుకున్న తర్వాతే ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.

    మళ్లీ నష్టాల్లోకి దేశీయ మార్కెట్‌ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికాలో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఉదయం పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు మరింత కిందకు దిగజారాయి. ఉదయం సెన్సెక్స్‌ 64,449.65 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. చివరకు 237.72 పాయింట్ల నష్టంతో 63,874.93 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,232.95 దగ్గర ప్రారంభమై చివరకు 61.30 పాయింట్లు నష్టపోయి 19,079.60 దగ్గర ముగిసింది. .

    జైలు నుంచి చంద్రబాబు విడుదల

    రాజమహేంద్రవరం జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు విడుదలతో టీడీటీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు.

    టీచర్‌తో ప్రేమ.. పదో తరగతి విద్యార్థి హత్య

    ఓ టీచర్‌ వద్ద ట్యూషన్ చదువుకుంటున్న పదోతరగతి విద్యార్థిని ఆమె ప్రియుడు హత్య చేశాడు. విద్యార్థిని కిడ్నాన్ చేసిన హత్యచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. రచిత అనే 21 ఏళ్ల యువతి కాన్పూర్‌లో ట్యూషన్‌ నడుపుతోంది. అక్కడ 17 ఏళ్ల విద్యార్థి చదువుకోవడానికి ఆమె దగ్గరకి వెళ్తుంటాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందన్న అనుమానించిన ఆమె ప్రియుడు ప్రభాత్‌ శుక్లా.. బాలుడ్నికిడ్పాప్ చేసి హత్యచేశాడు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

    జియో 5జీ టారిఫ్‌ ధరలు పెంపు.. క్లారిటీ

    జియో, 5జీ టారిఫ్‌ ధరలపై పెంపుపై క్లారిటీ ఇచ్చింది. ఎడాదిగా 5జీ సేవలను జియో ఉచితంగా అందిస్తుంది. అయితే ఇటీవల 5జీ టారిఫ్ ధరలు పెంచే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాన్‌ ధరల పెంపుపై తాజాగా జియో క్లారిటీ ఇచ్చింది. 5జీ ప్లాన్‌ల ధరలను పెంచేది లేదని స్పష్టం చేసింది. అందుబాటు ధరలో వినియోగదారులకు టెలికాం సేవలు అందించడమే తమ లక్ష్యమని జియో తెలిపింది. ప్లాన్‌ ధరలను అనూహ్య స్థాయిలో ఇప్పట్లో పెంచే ఉద్దేశమేదీ లేదని ఆ సంస్థ క్లారిటీ … Read more

    ఓటీటీకి ‘మంత్ ఆఫ్ మధు’

    నవీన్ చంద్ర, కలర్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 6 విడుదలైన ఈ సినిమా ఫీ‌ల్‌గుడ్ మూవీగా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇప్పుడు తాజాగా తెలుగులో ఓటీటీ వేదిక ఆహాలో నవంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నితెలుపుతూ ఆహా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

    సింపతీ కోసం చంద్రబాబు ప్లాన్: సజ్జల

    టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ మంజూరుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు బయటకు వచ్చారని తెలిపారు. ప్రజల్లో సింపతీ కోసమే చంద్రబాబు మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. చంద్రబాబు బయట ఉన్నా లోపల ఉన్నా పెద్ద తేడా లేదన్నారు.హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

    AFG vs SL: అఫ్గాన్ సంచలన విజయం

    శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ సంచలన విజయం నమోదుచేసింది. శ్రీలంకపై అఫ్గానిస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆఫ్గాన్ 45.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రహమత్ షా (62), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (58), అజ్మతుల్లా (73) అర్ధ శతకాలు బాదడంతో సునాయసంగా విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక 2, కాసున్ రజిత ఒక వికెట్ పడగొట్టారు.