• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిమా కంపెనీలకు IRDAI కీలక ఆదేశాలు

    పాలసీకి సంబంధించిన బీమా కంపెనీలకు ఇన్సురెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ IRDAI కీలక సూచనలు చేసింది. పాలసీహోల్డర్లకు ప్రాథమిక సమాచారాన్ని అర్థమయ్యేలా ఇవ్వాలని తెలిపింది. పాలసీ హామీ మొత్తం, పాలసీలో కవరయ్యేవి, కవర్‌ కానివి వంటి సమాచారాన్ని అందులో పేర్కొనాలని సూచించింది. కొత్త నిబంధనలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నానందని పేర్కొంది. ఈ మేరకు అన్ని బీమా కంపెనీలకు సర్క్యులర్‌ జారీ చేసింది.

    బాల‌య్య‌తో.. సుకుమార్ సినిమా?

    భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్‌తో నటుడు బాలకృష్ణ మంచి జోరుమీదున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, తర్వాత భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్‌తో మూడోసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. అయితే బాలయ్య తన తదుపరి సినిమా బాబీ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర కాంబినేషన్ వినిపిస్తుంది. సుకుమార్‌తో కూడా మరో సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నారని తెలుస్తోంది.

    టీటీడీపీకి కాసాని రాజీనామా

    తెలంగాణలో టీడీపీకి బిగ్‌షాక్ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో టీడీపీ పోటీ చేయకపోవడంపై కాసాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాల్సిందేనని కొందరు నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే కాసాని భావోద్వేగానికి గురయ్యారు.

    ‘దేవర’ నుంచి తాజా అప్‌డేట్

    ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా నుంచి తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో గోవాలో ప్రస్తుతం ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ ల పై ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ఫుల్ మాస్ బీట్స్ తో సాగుంతుందని సమాచారం. సినిమాలో ఈ మాస్ సాంగ్ చాలా థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుందట. Courtesy Instagram:JanhviKapoor

    పడవ బోల్తా.. 70 మంది గల్లంతు

    ఆఫ్రికాలోని ఘోర విషాదం చోటుచేసుకుంది. నదిలో ఓ పడవ బోల్తా పడి 17 మంది మృతి చెందారు.. మరో 70 మందికి పైగా గల్లంతయ్యారు. దేశంలోనే అతిపెద్దదైన బెన్యూ నదిలో ఈ విషాదం జరిగింది. స్థానికులు చేపల మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న వ్యాపారులతో కూడిన పడవ నదిలో బోల్తా కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

    పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డులో కీలక పరిణామం

    పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీసీబీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ తన పదవికి రాజీనామా చేశాడు. ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేశారు, ఇంజమామ్‌కు చెందిన ఏజెన్సీ తరఫున ఆటగాళ్లనే జట్టులోకి తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టడానికి పీసీబీ ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

    తక్కువ ధరకే 4జీ ఫోన్

    రిలయన్స్ సంస్థ జియో ప్రైమో 4జీ ఫోన్లను లాంచ్ చేస్తుంది. తక్కువ ధరలో ఆకర్షణీయపైన ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీపావళికి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 2.4 అంగుళాల డిస్‌ప్లేతో పనిచేస్తుంది. దీనికి బ్లూటూత్ 5.0, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఎఫ్ ఎం రేడియో సదుపాయం ఇస్తున్నారు. ఇందులో వాట్సాప్, యూట్యూబ్ సదుపాయం ఉంది. తక్కువ ధరకే ఈ ఫోన్ అందించనున్నారని సమాచారం.

    Video: ఆస్ట్రేలియా మాతాకి జై నినాదాలు వైరల్

    వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 28 న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాలో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆసీస్ అభిమానులు చేసిన నినాదాలు వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా మాతా కీ జై అంటూ స్టేడియంలో అరుస్తూ కనిపించారు. మొదట ఒక కుర్రాడు జై సియా రామ్, జై సియా రామ్ అని పలికాడు. ఇంతలో ఆసీస్ అభిమానులు ఆస్ట్రేలియా మాతా కీ జై అంటూ స్టేడియం అంతా దద్దరిల్లేలా అరవసాగారు. దీనికి సంబంధించిన … Read more

    భారీ అగ్ని ప్రమాదం.. 22 బస్సులు దగ్థం

    బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్యారేజీలో మంటలు చెలరేగడంతో 22 బస్సులు దగ్థమయ్యాయి. బస్సులకు వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పార్కింగ్‌లో ఉన్న బస్సుకు వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. అవి మిగతా వాహనాలకు వ్యాపించడంతో భారీ నష్టానికి దారి తీసింది. ప్రమాద సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. #BreakingNews Massive fire near a garage in Bengaluru, fire-fighting teams on spot #Bengaluru #BengaluruFire … Read more

    చంద్రబాబుపై మరో కేసు

    టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేశారు.