• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ప్రమాద ఘటనపై జగన్ ఆరా

    రైలు ప్రమాద ఘటనలో సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేస్తూ.. ‘విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’.అని జగన్ పేర్కొన్నారు.

    ఏపీ రైలు ప్రమాదం.. పట్టాలు పునరుద్ధరణ

    ఏపీ విశాఖ: రైలు ప్రమాద ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు అనుగుణంగా పట్టాలను పునరుద్ధరించారు. 19 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ చేశామని అధికారులు వెల్లడించారు. రైలు ప్రమాద ఘటనలో 13 మంది మరణించారని తెలిపారు. మరో 30 మంది గాయపడ్డారని వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

    AFG vs SL: శ్రీలంక ఆలౌట్

    నేడు ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ ఓడి శ్రీలంక బ్యాటింగ్‌ చేసింది. శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లు ఓపెనర్ పాథుమ్ నిశాంక (46) దిముత్ కరుణరత్నె (15), కుశాల్ మెండిస్ (39), సదీర సమరవిక్రమార్క (36) ఎంజొలో మాథ్యూస్‌ (23), చరిత్ అసలంక (22), ధనంజయ డి సిల్వా (14) పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లు ఫజల్ హక్‌ ఫారూఖీ 4, ముజిబుర్ రహ్మన్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్ … Read more

    BSP రెండో జాబితా.. ట్రాన్స్‌జెండర్‌కు టికెట్

    తెలంగాణ అసెంబ్లీ నేపథ్యంలో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను BSP విడుదల చేసింది. 43 మందిలో 26 మంది బీసీలు, ఏడుగురు ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఓసీలకు సీట్లు కేటాయించినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇందులో ట్రాన్స్‌జెండర్‌కు వరంగల్‌ తూర్పు టికెట్‌ కేటాయించింది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీఎస్పీ ప్రకటించింది. తాజాగా మరో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది.

    ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్

    బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో TSPSCని ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఎందుకు ప్రక్షాళన చేయలేదని నిలదీశారు. నిరుద్యోగులకు మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పేపర్లు లీక్‌ అయ్యమని కిషన్ రెడ్డి ఆరోపించారు.

    Stock Market: రెండో రోజు లాభాల్లో మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,885.56 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 329.85 పాయింట్ల లాభంతో 64,112.65 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,053.40 దగ్గర ప్రారంభమై 93.65 పాయింట్లు లాభపడి 19,140.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది.

    ‘భగవంత్ కేసరి లేటెస్ట్’ వసూళ్లు ఇవే!

    నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకులను, అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటి వరకూ 130 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబ్టట్టినట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయి‌న్‌గా నటించిన ఈ చిత్రం లో శ్రీ లీల, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రల్లో నటించారు.

    నానితో మృణాల్‌ ఫన్నీ ఇంటర్వ్యూ

    శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘హాయ్‌ నాన్న’ చిత్రం డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రశ్నలకు నాని, మృణాల్‌ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి. You wouldn't want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗Check out the promo and stay tuned for the Part 1 … Read more

    ‘కొవిడ్‌ రోగులు ఎక్కువగా శ్రమించొద్దు’

    దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలపై కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారు రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. దీనివల్ల కార్డియాక్‌ అరెస్ట్‌ ముప్పు నుంచి బయటపడొచ్చని సూచించారు. ఈ మేరకు ICMR అధ్యయనం పేర్కొందని తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారు ఒత్తిడితో కూడిన పనులు, పరిగెత్తడం, కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలని అని మాండవీయ సూచించారు.

    భార్యపై అనుమానంతో భర్త హత్య

    హైదరాబాద్‌ చంపాపేట్‌లో జరిగిన స్వప్న (20) హత్యకేసులో మిస్టరీ వీడింది. భర్త ప్రేమ్‌కుమార్‌ ఆమెను హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారించారు. భార్య మరోకరితో చనువుగా ఉండటం చూసి కోపంతో భార్త వారిద్దరిపై దాడి చేశాడు. ఇంట్లోని కత్తితో భార్య గొంతుకోశాడు. కళ్లెదుట స్నేహితురాలు రక్తపుమడుగులో పడిపోవడంతో యువకుడు ప్రేమ్‌కుమార్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ప్రేమ్‌కుమార్‌ను మేడమీద నుంచి కిందకు తోశాడు. అనంతరం ఆ యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన నింధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.