• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రషీద్‌కు రూ.10 కోట్లు రివార్డు.. రతన్ టాటా క్లారిటీ

    అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్‌కు ఖాన్‌కు పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ప్రకటించారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై టాటా స్పందిస్తూ ట్వీట్ చేశారు. తాను ఏ క్రికెటర్ రివార్డు ప్రకటించలేదన్నారు.ఇలాంటి ఫార్వార్డ్ మెసేజ్‌లను నమ్మెద్దన్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ భారత జెండా పట్టుకుని కన్పించాడు. దీంతో అతడికి ఐసీపీ రూ.55 లక్షలు జరిమాన విధించిందని వార్తలు వైరల్ అయింది. ఇది చూసిన రతన్ టాటా రషీద్‌కు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారని వార్తలు వైరల్ అయ్యాయి.

    మేం దాడులు చేస్తే ఎవరూ మిగలరు: కేసీఆర్

    బీఆర్‌ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి‌పై దాడిని సీఎం కేసీఆర్ ఖండించారు. రాష్ట్రంలో చేతగాని ప్రతిపక్ష దద్ధమ్మ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. ప్రజా సేవ చేస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ‘చేతగాని దద్ధమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారు. కత్తి పొటు పొడవాలంటే మాకు చేతులు లేవా..? మొండి కత్తి మాకూ దొరకదా..? మాకూ దమ్ముంది మేం దాడులు చేస్తే ఎవరూ మిగలరు. ఎన్నికలు ఎదుర్కోలేక హింసకు పాల్పడుతున్నారు’. కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    చంద్రబాబు బెయిల్ పిటిషన్ రిజర్వ్

    చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఆరోగ్య రిత్యా బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 50 రోజులకు పైగా చంద్రబాబు జైలులో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో తమ వాదలు వినిపించేందుకు తగిన సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.

    ‘ప్రజలు చనిపోతున్నారు.. చర్చలు జరపండి’

    రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్దంలో ఏ దేశానికి విజయం దక్కదన్నారు. యుద్ధం కాణంగా ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధం ఫలితంపై ప్రతిష్టంభన నెలకొంది. ఎవరూ పూర్తి స్థాయిలో పుంజుకోలేక పోతున్నారు. కాబట్టి ఇరు దేశాలు చర్చలు జరుపుకొని ఓ నిర్ణయానికి రండి’. అని అలెగ్జాండర్ పిలుపునిచ్చారు.

    ఆగమాగం కావద్దు ఆలోచించి ఓటేయండి: కేసీఆర్

    తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. జుక్కల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షాల మాటలు విని ఆగమాగం కాకుండా విచక్షణతో ప్రజలు ఓటు వేయండి. తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో కరెంటులేని పరిస్థితులు చూశాం. ఇప్పుడు తెలంగాణలో తప్పా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి … Read more

    ఉల్లి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

    ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరలను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. దేశంలో ఉల్లి అందుబాటులో ఉంచేందుకు అలాగే ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

    AUS vs NZ: ఉత్కంఠ పోరులో ఆసీస్‌ విజయం..

    న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధింరింది. కివీస్ బ్యాటర్లు రచిన్‌ రవీంద్ర (108) డారిల్‌ మిచెల్ (54) జేమ్స్ నీషమ్ (58) దూకుడుగా ఆడినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్‌ జంపా 3, హేజిల్‌వుడ్ 2, కమిన్స్‌ 2, … Read more

    ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు?

    వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈరోజు లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. హార్దిక్‌ స్ధానంలో సూర్యకుమార్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా లక్నో వికెట్‌కు స్పిన్‌కు అనుకూలించే అవకామున్నందున మహ్మద్‌ సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చి రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

    వాళ్లు సర్వేల్లో గెలిస్తే.. మేం ఎన్నికల్లో గెలుస్తాం: కవిత

    బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తానని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం ఎలక్షన్‌ స్టంట్‌ అని ఆరోపించారు. బీజేపీతో తమకు ఎలాంటి డీల్‌ లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కచ్చితంగా 95-105 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల్లో కాంగ్రెస్ గెలిస్తే.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్నారు. ఓబీసీల కుల గణన చేయడాన్ని కేంద్రం నిరాకరిస్తోందిని మండిపడ్డారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదని కవిత పేర్కొన్నారు.

    NED vs BAN: నెదర్లాండ్స్ ఘన విజయం

    నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఘన విజయం సాధించింది. 87 పరుగుల తేడాతో బంగ్లాను నెదర్లాండ్స్‌ ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 142 పరుగులకే ఆలౌట్ అయింది. మెహదీ హసన్ మిరాజ్ (35) తప్పా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ 4, బాస్‌ డీ లీడే 2, ఆర్యన్ దత్‌, వాన్‌ బీక్, అకెర్మాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.