• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉల్లి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

    ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరలను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. దేశంలో ఉల్లి అందుబాటులో ఉంచేందుకు అలాగే ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

    ఆసక్తికగా ‘విక్రమ్62’ వీడియో

    విక్రమ్ హీరోగా ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాను ప్రకటిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృంద విడుదల చేసింది. అందులో విక్రమ్ పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చి మరీ ఇద్దరు వ్యక్తుల్ని కొడుతూ కనిపించాడు. తానెవరో అక్కడున్న పోలీస్‌కు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరిగా సరకులు మోసుకుంటూ బైక్‌లో వెళ్తూ విక్రమ్‌ కనిపించారు. Nostalgic @chiyaan 🔥🔥 Bring it up 🔜 #Chiyaan62 pic.twitter.com/C2y6Pu45dL — Manoj Maddy (@edits_manoj) October 28, 2023

    ఆహాలో ‘కృష్ణగాడి’ హవా

    రిష్వి తిమ్మరాజు హీరోగా, విస్మయశ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అలాగే ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. మంచి లవ్ స్టోరీ, విలేజ్ డ్రామాతో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. స్వచ్చమైన ప్రేమ కథకు ట్విస్టులు, ఎమోషన్‌ను జోడించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది అలరిస్తోంది. అయితే ఈ స్వచ్చమైన ప్రేమకథను మీరు చూసేయండి.

    నిలిచిన రైలు.. ప్రయాణికులు ఆగ్రహం

    సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 4 గంటలుగా రైలు నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ధర్మవరం-నర్సాపూర్ ఎక్క్‌ప్రెస్ పట్టాలపై నిలిచిపోయింది. రైలు 4 గంటలకు పైగా నిలిచిపోయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    40 ప్లస్ హీరోయిన్‌లకు ఛాన్స్ ఇవ్వట్లేదు: నటి

    సీనియర్ నటి, హీరోయిన్ రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను 35 ఏళ్లుగా నటిస్తున్నా మొదట్లో హీరోయిన్‌గా నటించాను. ఆ తర్వాత క్యారెక్టర్ అర్టిస్ట్‌గా రకరకాల పాత్రలు చేశాను. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో 40 ఏళ్లు దాటిన లేడీ యాక్టర్స్‌ని దర్శకులు పక్కన పెట్టేస్తున్నారు. కానీ నాలాంటి చాలా మందికి మంచి పాత్రల్లో నటించాలనే కోరిక ఉంటుంది. నేను మాత్రం బతికున్నంత వరకు నటిస్తూనే ఉంటా ఇప్పుడు కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ల‌కు అసలు ప్రాధాన్యం లేకుండా పోయింది’. అని రేఖ చెప్పుకొచ్చారు.

    ఢీకొన్న కార్లు, బస్సులు.. 32 మంది మృతి

    ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. అలెగ్జాండ్రియాలోని హైవేపై కార్లు, బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 32 మంది మృతిచెందారు మరో 63 మంది తీవ్రంగా గాయపడారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు ప్యాసింజర్‌ బస్సులు, 10 కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీంతో ఓ కారు నుంచి ఆయిల్‌ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనున్న మిగతా వాహనాలకు అంటుకున్నాయి. దీంతో కొందరు వాహనాల్లోనే సజీవదహనమైయ్యారు.

    ఒకే ఇంట్లో ఏడుగురి మృతి

    గుజరాత్‌ దారుణ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతిచెంది ఉన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఆర్థిక లావాదేవీల కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడుగురు విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో విషపదార్థంతో కూడిన ఓ సీసాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

    AUS vs NZ: ఉత్కంఠ పోరులో ఆసీస్‌ విజయం..

    న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధింరింది. కివీస్ బ్యాటర్లు రచిన్‌ రవీంద్ర (108) డారిల్‌ మిచెల్ (54) జేమ్స్ నీషమ్ (58) దూకుడుగా ఆడినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్‌ జంపా 3, హేజిల్‌వుడ్ 2, కమిన్స్‌ 2, … Read more

    BAN vs NED: నెదర్లాండ్స్ ఆలౌట్

    ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాక్ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లు స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (68), వెస్లీ బరేసి (41) సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (35) మిగిలిన బ్యార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిపుల్ ఇస్లామ్ 2, ముస్తాఫిజుర్ రహ్మన్‌ 2, మెహదీ హసన్ 2, షకీబ్‌ అల్ హసన్‌ ఒక వికెట్ పడగొట్టారు

    ఇంట్లోకి చొరబడి యువతిపై కాల్పులు

    రాజధాని ఢిల్లీలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కొందరు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి తుపాకీతో కాల్పులు జరిపారు. జైత్‌పుర్ ప్రాంతంలో 24 ఏళ్ల యువతి నివాసముంటోంది. రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు యువతి ఇంట్లోకి చొరబటి ఆమెపై వరస కాల్పులు జరిపారు. దీంతో సదరు యువతి ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఇరుగు పోరుగు వారు తుపాకీ శబ్ధం విని యువతి ఇంటికి వచ్చారు. హత్య చేసి పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకున్నారు.