• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు?

    వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. రేపు లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే రేపటి మ్యాచ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. హార్దిక్‌ స్ధానంలో సూర్యకుమార్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా లక్నో వికెట్‌కు స్పిన్‌కు అనుకూలించే అవకామున్నందున మహ్మద్‌ సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చి రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

    మరో వినూత్న నిరసనకు లోకేష్ పిలుపు

    టీడీపీ నేత నారా లోకేష్ మరో వినూత్ననిరసనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక, చీకటి పాలన సాగిస్తోన్న జగనాసురుడి కళ్లు తెరిపిద్దాం పేరిటి మరో నిరసనకు లోకేష్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గంటల నుంచి 7:05 మధ్యలో కళ్లకు గంతలు కట్టుకుని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్ధతుగా నిజం గెలవాలి అని గట్టిగా నినదించాలని కోరారు. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేష్ సూచించారు.

    కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్‌ టికెట్‌ పంచాయితీ

    తెలంగాణ కాంగ్రెస్‌ రెండో జాబితా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.. జూబ్లీహిల్స్‌ టికెట్‌‌ను అజహరుద్ధీన్‌కు కేటాయించారు. తనకే టికెట్ వస్తుందని భావించిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విష్ణు తన వర్గీయులతో సమావేశమై చర్చించి గాంధీ భవన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. వారిని గాంధీభవన్‌ లోపలికి వెళ్లకుండా ప్రధాన ద్వారానికి తాళం చేశారు. దీంతో గాంధీ భవన్‌ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

    ‘ఐదు నెలలుగా పాక్‌ ఆటగాళ్లకు జీతాలు లేవు’

    పాక్‌ ఆటగాళ్ల వేతనాలపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్‌ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆటగాళ్లకు పీసీబీ బోర్డు నుంచి సరైన సహకారం లేదని చెప్పారు. గత ఐదు నెలలుగా క్రికెటర్లకు జీతాలు చెల్లించడం లేదన్నారు. తమ జీతాల గురించి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ పీసీబీ ఛైర్మన్‌కు లేఖలు రాసినా స్పందన లేదని చెప్పారు. ఆటగాళ్లకు జీతాలు అందించనప్పుడు. వారు ఎలా ఆడతారని లతీఫ్ ప్రశ్నించారు. వారి పట్ల పీసీబీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని పేర్కొన్నారు.

    దగా, మోసాలకు మారు పేరు కాంగ్రెస్: హరీష్‌రావు

    కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. దగా, మోసాలకు మారు పేరు కాంగ్రెస్ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ గిరిజన తండాలు, గూడేలకు పలు హామీలు ఇచ్చి మోసం చేసింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్నాం. రైతు బీమా మాదిరిగానే భూమిలేని పేదలకు రూ.5 లక్షల బీమా వర్తింప చేస్తాము. రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ అంటుంది. 24 గంటల కరెంట్ కావాలనుకునే వాళ్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలి’ అని … Read more

    ఓటీటీలో స్కంద.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

    హీరో రామ్ పోతినేని శ్రీలీల జంటగా నటించిన ‘స్కంద; చిత్రం థియోటర్లలో విడుదలై మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదట అక్టోబర్‌ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. స్కంద స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల కొత్త తేదీని హాట్‌స్టార్ ప్రకటించింది. నవంబర్‌ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది.

    బాలీవుడ్ స్టార్ నటులతో చిరు, వెంకీ

    ఇటీవల హీరో వెంకటేష్ ఇంట ఓ శుభకార్యం జరిగిన విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమానికి బాలీవుడు, టాలీవుడ్ నటులు హాజరయ్యారు. అయితే దీనికి సంబధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. చిరు, వెంకటేష్ యంగ్ ఏజ్‌లో బాలీవుడ్ లో స్టార్స్ అయినటువంటి ప్రముఖ నటులు అనీల్ కపూర్, నటుడు అనుపమ్ ఖేర్ లాంటి నటులు కూడా కలిసి ఓ ఫోటోకి పోజ్ ఇవ్వడం బ్యూటిఫుల్ థింగ్ గా మారింది. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

    బ్యాంకు ఉద్యోగులకు త్వరలో గుడ్‌న్యూస్

    బ్యాంకు ఉద్యోగులు తర్వలో గుడ్‌న్యూస్ వినబోతున్నారు. వారానికి ఐదు రోజుల పని విధానం త్వరలో అమలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రవేటు రంగ బ్యాంకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే ఉద్యోగులకు జీతాల పెంపునకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవల కాలంలో బ్యాంకు లాభాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు మెరుగైన వేతనం కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

    చంద్రబాబును చంపేస్తామంటున్నారు: నారా లోకేష్

    జైలులో ఉన్న చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. ‘ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్ష్యతోనే ఆయనను అరెస్టు చేశారు. కేసులతో సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారు. ఒక్క ఆధారం కూడా ప్రజల ముందుకు తీసుకురాలేక పోయారు. మా ఆస్తుల వివరాలు ఐటీ రిటర్న్‌లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం’. అని లోకేష్ పేర్కొన్నారు.

    త్వరలో దేశ వ్యాప్తంగా BSNL 4జీ సేవలు

    BSNL 4జీ సేవలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని bsnl అధికారులు తెలిపారు. ముందుగా పంజాబ్ నుంచి ఈ సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు. bsnl 4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రదేశాల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా పంజాబ్‌లో ప్రారంభించి దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని స్పష్టం చేశారు. 2024 జూన్ నాటికి దేశ వ్యాప్తంగా bsnl 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.