• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పార్టీలో అవమానాలు జరిగాయి: బాబూమోహన్

    బీజేపీ నేత బాబూ‌మోహన్ ఆ పార్టీపై తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని చెప్పారు. ‘అధిష్ఠానం నిర్ణయం మేరకు బీజేపీకి రాజీనామా చేస్తా. అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. పార్టీలో అవమానాలు జరిగాయి. నా ఆత్మాభిమానం దెబ్బతింది. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. కావాలనే నన్ను పార్టీకి దూరం పెట్టారు’. అని బాబూమోహన్ తెలిపారు.

    నా జీవితంలో అదే టర్నింగ్ పాయింట్: చిరు

    ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా హీరో చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. ”ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంట, ఆ చిత్ర దర్శకులు, నిర్మాతలు. సంయుక్తా మూవీస్ టీమ్‌ని, అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని చిరు ట్వీట్ … Read more

    PAK vs SA: దక్షిణాఫ్రికా విజయం

    వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా నేడు పాకిస్తాన్‌‌తో దక్షిణాఫ్రికా తలపడింది. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 46.4 ఓవర్లకు పాక్ ఆలౌటైంది. 270 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 9 వికెట్లను కోల్పోయి 271 పరుగుల విజయ లక్ష్యాన్ని చెరుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డి కాక్ (24), టెంబా బావుమా (28), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (21), హెన్రిచ్ క్లాసెన్ (12), డేవిడ్ … Read more

    ఇంగ్లాండ్ ఆటగాళ్లపై గంభీర్ విమర్శలు

    ఇంగ్లండ్‌ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శల చేశారు. జట్టులో చాలా మంది ఆటగాళ్లు తమ పరువు కోసం ఆడుతున్నారని అభిప్రాయపడ్డారు. జో రూట్ అవుట్ అయిన తర్వాత చాలా చెత్త షాట్లు ఆడి వికెట్‌ను పారేసుకున్నారని తెలిపారు. శ్రీలంక మాత్రం అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. అందుకే వారు విజయం సాధించారు” అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో గంభీర్‌ పేర్కొన్నాడు.

    UGC NET దరఖాస్తుల గడువు పొడిగింపు

    UGC-NET పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించారు. తొలుత నిర్ణయించిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా గడువు పెంచుతూ ఎన్‌టీఏ-యూజీసీ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అభ్యర్థులు అక్టోబర్‌ 31వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో https://ugcnet.ntaonline.in/ దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే, దరఖాస్తు రుసుం చెల్లింపు గడువును సైతం అక్టోబర్‌ 31వరకు వరకూ పొడిగించారు.

    ఘనంగా అర్జున్‌ కుమార్తె నిశ్చితార్థం

    సినీ నటుడు అర్జున్‌ పెద్ద కుమార్తె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కోలీవుడ్‌ దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, హీరో ఉమాపతితో ఐశ్వర్య ఏడడుగులు వేయనున్నారు. చెన్నైలో వారి నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. కొద్దిమంది బంధువులు, పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. సంబంధిత ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

    అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం

    తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాలో రికార్డయింది. దీంతో నడక దారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గుంపులు గంపులుగా వెళ్లాలని తెలిపింది. మరో వైపు చిరుత, ఎలుగబంటిని బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.

    ‘అలా జరిగితే చంద్రబాబు చావు ఖాయం’

    వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ సీఎం అయితే చంద్రబాబు చావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో మళ్లీ జగన్ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి మళ్లీ వైసీపీనే విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కళ్యాణ్‌పై ఎన్ని పోరాటాలు చేసినా లాభం లేదని మాధవ్ పేర్కొన్నారు.

    45 మంది పేర్లతో కాంగ్రెస్ రెండో జాబితా

    తెలంగాణలో అంబ్లీ ఎన్నికల సంబంధించి కాంగ్రెస్ రెండో విడతా జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. గద్దర్ కూతురికి సికింద్రాబాద్ కంటోన్నెంట్ సీటు ఖరారు చేసింది, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేష్, హుస్నాబాద్ నుంచి పొన్నం సుధాకర్, జూబ్లీహిల్స్ నుంచి హజారుద్ధిన్‌ను భరిలో నిలవనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

    టీడీపీ, జనసేన విజయం ఖాయం: భువనేశ్వరి

    2024లో టీడీపీ-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘దివంగత నేత ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొస్తే.. చంద్రబాబు వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. అలాంటి వ్యక్తిని 49 రోజులుగా జైల్లో పెట్టారు. ఆయన చేసిన నేరం ఏమిటో ఆధారాలు ,చూపించండి’. అని భువనేశ్వరి ప్రశ్నించారు.