• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వివాదంలో ఇరుక్కున్న రోహిత్ శర్మ

    బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ వేళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో ఇరుక్కున్నాడు. ముంబై- పుణే రోడ్‌ లైన్‌లో అతని కారు నిబంధనలు అతిక్రమించి 200కి.మీ వేగంతో ప్రయాణించిందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రదేశాల్లో 215 కి.మీ వేగంతో ప్రయాణించినట్లు చెప్పారు. వెర్వేరు ప్రాంతాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు ఓనర్‌ అయిన రోహిత్‌కు చలానాలు విధించారు. అయితే కారు నడిపింది రోహితా కాదా అనేది తెలియాల్సి ఉంది.

    రాహుల్ ఎందుకు నోరు మెదపలేదు: కేటీఆర్

    కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక. గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు అని విమర్శించారు.

    ఏపీకి పొంచి ఉన్న తుపాను ముప్పు

    ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వానలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే 3రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 23 వరకు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. అయితే ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

    నేడు ప్రధాని మోదీతో టీబీజేపీ నేతల కీలక భేటీ

    నేడు ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ నేతలు కీలక భేటీ కానున్నారు. ఇప్పటికే తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో రాష్ట్ర నేతల ప్రత్యేక భేటీలు నిర్వహించనున్నారు. తెలంగాణలో రూట్ మ్యాప్, అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరపనున్నారు. అన్ని కుదిరితే ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.55,460కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగి రూ. 60,500కు ఎగబాకింది. మరోవైపు కిలో వెండి ధర రూ.78,000 వద్ద కొనసాగుతోంది.

    మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది: ప్రియాంక

    ములుగు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ… ‘తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సోనియాకు తెలుసు. రాజకీయ లబ్దికోసం కాకుండా, తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాంతాచారికి నా నివాళి. ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు. మీ కలలు సాకారం అవుతాయని బీఆర్‌ఎస్‌ను నమ్మి ఓటేశారు. ఉద్యోగాలు వస్తాయని పిల్లల భవిష్యత్‌ మారుతుందని అనుకున్నారు. మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ సిద్ధాంతం’ అని చెప్పుకొచ్చారు.

    ‘లియో’ సినిమా ట్విట్టర్ రివ్యూ

    తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై ప్రేక్షకులు తమ అభిప్రాయలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘ఫస్టాప్ సూపర్‌గా ఉంది. ఎప్పటిలాగే లోకేష్ కనగరాజ్‌ టేకింగ్ బాగుంది. విజయ్ లుక్ కొత్తగా ఉంది. అనిరుధ్ బీజీఎం అదిరిపోయింది. అయితే సెకండాఫ్ తేలిపోయింది. అర్జున్, సంజయ్ దత్ క్యారెక్టర్లు ఎంటర్ అయిన తరవాత సినిమా గాడి తప్పింది. క్లైమాక్స్ మాములుగా ఉంది’ అని కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ కాసేపట్లో..

    రెండో రోజుకు రాహుల్ బస్ యాత్ర

    తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర రెండోరోజుకు చేరుకుంది. ఈరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. నిరుద్యోగుల బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాటారం పక్కనే రైతులతో సమావేశం కానున్నారు. అక్కడే వారితో కలిసి భోజనం చేయనున్నారు. మంథని బైపాస్ నుంచి నేరుగా పెద్దపల్లికి రాహుల్ చేరుకోనున్నారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి కరీంనగర్‌లో బసచేయనున్నారు.

    నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ

    వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు పూణే వేదికగా జరగనుంది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న టీమిండియా బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆడిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లపై చిత్తుగా ఓడిన బంగ్లా.. ఈమ్యాచ్‌లో గెలిచి ఇండియాకు షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. షకిబుల్ హసన్, మోహిది మిరాజ్ వంటి అల్‌రౌండర్లు, ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్‌లతో కూడిన బంగ్లా బౌలింగ్‌ విభాగం బలంగా ఉంది.

    భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ

    బాలయ్య నటించిన భగంత్ కేసరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయలను ట్వీట్ చేస్తున్నారు. ప్రతిఒక్కరు తమ కూతుళ్లతో తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. బాలకృష్ణ చాలా కొత్తగా కనిపించారు. డైలాగ్స్, యాక్షన్ సీన్లు బాగున్నాయి. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరింది. సెకండాఫ్ మాస్ ఎంటర్‌టైనర్. థమన్ బీజీఎం కాస్త నిరుత్సాహపరిచింది. కథ బాగున్నా అనిల్ రావుపూడి నరేషన్ ప్లాట్‌గా ఉంది అని చెబుతున్నారు. పూర్తి రివ్యూ కాసెపట్లో..