• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బండి సంజయ్‌ మండిపడ్డ కేటీఆర్

    కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై మండిపడ్డారు. ‘హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టే సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారు. కమలాకర్ చేతిలో చావు దెబ్బతిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడు. ఎంపీ అయ్యాక ఏం చేశారు. ఓ బడి తేలేదు. కనీసం గుడి అయినా తేలేదు. మోడీ దేవుడని అంటున్న బండి సంజయ్ చెప్పాలి గ్యాస్ ధర ఎంత పెరిగిందో.. గంగుల కమలాకర్‌ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే’ అని … Read more

    ICC: టాప్‌ 10లో ముగ్గురు మనోళ్లే

    ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌ టాప్ 10లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు చోటు సంపాదించారు. శుభమన్ గిల్ 2 ర్యాంకు సాధించగా, రోహిత్ శర్మ 6, విరాట్ కోహ్లీ 8 స్థానం దక్కించుకున్నారు. ఇక టాప్ ర్యాంక్‌లో పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ కొనసాగుతున్నాడు. అటు అన్ని టీమ్స్ విభాగాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

    తెలంగాణలో పోటీపై 2 రోజుల్లో చెప్తా: పవన్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈసారి పోటీ చేయకపోతే.. క్యాడర్ బలహీనమయ్యే ప్రమాదం ఉందని పవన్‌కు నేతలు వివరించారు. అయితే కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తానన్న పవన్, రెండు మూడు రోజుల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్.. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికల్లో కలిసి వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్

    ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. జట్లు: అఫ్గాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(C), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(w), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీ న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w/c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

    ఎన్నికల్లో గెలిస్తే కానుకగా ఐపీఎల్ టీమ్!

    మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రానికి ఐపీఎల్ టీమ్ తీసుకొస్తామని పేర్కొంది. ఈ వింత హామీపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ టీమ్ తీసుకొస్తే ప్రజలకు కలిగే ఉపయోగం ఏమిటో చెప్పాలని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తామని చెప్పక ఇలా ఐపీఎల్‌ను మేనిఫెస్టోలో చేర్చడం ఎమిట్రా బాబు అని అవాక్కవుతున్నారు.

    చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి: సజ్జల

    రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ‘ఆయన ఆరోగ్యం పేరుతో టీడీపీ నేతలు బయట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసుల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలోని కొన్ని పత్రికలు అదే పనిగా ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తున్నాయి’ అని ఆరోపించారు.

    టైగర్ నాగేశ్వరరావు రన్ టైం ఫిక్స్

    దసరా బరిలో నిలవనున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి U/A క్లీన్ సర్టిఫికెట్ పొందింది. ఇక సినిమా టోటల్ రన్‌ టైం 2 గంటల 52 నిమిషాలకు కుదించారు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని డెరెక్టర్ వంశీ తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వజ హీరోయిన్లుగా నటించారు. రేణుదేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

    సెక్స్ సీన్లలో నటించడం తప్పేకాదు: స్టార్ హీరోయిన్

    సెక్స్ సీన్లలో నటించడం కూడా నటనలో ఓ భాగం మాత్రమేనని హీరోయిన్ మెహ్రీన్ అన్నారు. తాజాగా ఆమె నటించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఓటీటీలో విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌లో మెహ్రీన్‌ శృంగార సన్నివేశాల్లో నటించింది. దీనిపై ట్రోల్స్ రాగా తనను తాను సమర్థించుకుంది. ఇండియాలో వైవాహిక అత్యాచారం తీవ్రంగా ఉంది. ఇష్టం లేకుండా భార్యను అనుభవించడం భర్త తన హక్కుగా భావిస్తున్నాడు. ఇది చిన్నవిషయం కాదు, చాలా తీవ్రమైనది. దీనిని బయట పెట్టేందుకే తనకు ఇష్టం లేకున్నా కొన్ని సీన్లలో నటించాల్సి వచ్చిందని … Read more

    ఇజ్రాయేల్‌కు ‘హమాస్’ ఆఫర్

    గాజాపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు ఆపితే తమ చెరలో ఉన్న ఇజ్రాయేల్, ఇతర దేశాల పౌరులను విడిచి పెడతామని ఉగ్రసంస్థ హమాస్ తాజా ప్రతిపాదన చేసింది. గాజాలో ఇజ్రాయేల్ ఆక్రమించిన ప్రాంతాలను వదిలి వెళ్లాలి. వైమానిక దాడులను నిలిపివేయాలి. ఎలాంటి బాంబు దాడులు చేయకూడదు. బాంబు దాడులు ఆపితే గంటలోనే వారిని విడిచిపెడతామని ఆఫర్ ఇచ్చింది. హమాస్ బందీలుగా దాదాపు 200 మంది ఇజ్రాయేల్, ఇతర దేశాల పౌరులు ఉన్నట్లు సమాచారం.

    తెలంగాణలో బీజేపీ సీఎం అభ్యర్థిగా బీసీ నేత?

    ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులను రేపు ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించనుంది. 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి, కేసీఆర్‌కు పోటీగా గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, అలాగే కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీ చేయాలని చూస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంగా చేస్తానని ప్రకటించనుంది.