• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్… కాంగ్రెస్‌లోకి మరో నేత

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ బీఆర్ఎస్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. నిన్న బోథ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరగా తాజాగా .. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. 2014లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు 2018లో టికెట్ లభించలేదు. ఆ టికెట్‌ను మల్లారెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

    నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 102 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 66,325 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 18 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 19,792 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, విప్రో, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, HDFC బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.22 వద్ద ప్రారంభమైంది.

    భారీగా పెరుగుతున్న ఉల్లి ధరలు

    సామాన్యులకు షాక్ ఇస్తూ ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం వరకు రూ.100 కు 6 కేజీలు లభించిన ఉల్లి.. ఉప్పుడు 3 కేజీలు కూడా రావడం లేదు. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.40 దాటింది. మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఉల్లి తెలంగాణకు సరఫరా అవుతుంది. ఈ మధ్య ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉల్లి లేకపోతే ఏ కూర ఉండలేము. వంటగదిలో ఇది నిత్యవసరం. దీంతో ఉల్లి … Read more

    బన్నీ బ్యూటీపుల్ మూమెంట్స్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న సంగతి తెలిసిందే. పుష్పలో తన మెస్మరైజ్ యాక్టింగ్‌తో బన్నీ .. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లోకి తీసుకెళ్లాడు. ఆయన నటనకు గాను భారత ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించింది. ఈక్రమంలో అక్కడి బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను అల్లు అర్జున్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    శిశు సంక్షేమ శాఖపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

    మహిళా, శిశు సంక్షేమ శాఖపై నేడు సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష చేపట్టనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌లో బోధన, వైఎస్సార్ పోషణ ప్లస్, గర్భిణీలు, బాలింతలకు డ్రై రేషన్, మాంటిస్సోరి విద్యా విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు. దీనితో పాటు ఇతర పథకాల అమలుకు సీఎం జగన్ సూచనలు చేయనున్నారు.

    నేడు తెలంగాణకు రాహుల్, ప్రియాంక

    నేడు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. సాయంత్రం 3:30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్న రాహుల్‌, ప్రియాంక.. బేగంపేట్‌ నుంచి హెలికాప్టర్‌లో రామప్ప టెంపుల్‌కు చేరుకోనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల తర్వాత సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రామప్ప గుడి నుంచి బయల్దేరనున్న బస్సు యాత్ర ములుగు చేరుకోనుంది. ములుగులో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్, ప్రియాంకలు ప్రసంగిస్తారు.

    భగవత్ కేసరి రికార్డు బుకింగ్స్

    భగవంత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతోంది. నిన్న టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవగా హాట్‌ కేక్‌ల్లాగా అమ్ముడు పోతున్నాయి. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కాగా ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీలీల బాలకృష్ణ కూతురుగా నటించింది. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

    అరవింద్ చౌకబారు మాటలొద్దు: కవిత

    నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ‘ఎంపీ అరవింద్ నన్ను అన్న మాటలను మీ ఇంట్లో ఆడబిడ్డలను అంటే ఊరుకుంటారా ప్రజలారా ? వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషించే రాజకీయాలను అనుమతిద్దామా ? వ్యక్తిగత కక్ష్యలకు తెలంగాణలో తావులేదు. అంశాల వారీగా మాట్లాడితే ధీటుగా సమాధానం చెప్పే ధైర్యం నాకుంది. చౌకబారు మాటలు మాట్లాడితే ప్రజలకు చులకన అవుతారు. ఇకనైన అరవింద్ తన పద్దతి మార్చుకోవాలి’ అని సూచించారు.

    చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌ చేసింది. సీఐడీ తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరుఫున సీనియర్ లాయర్ హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. 17A చంద్రబాబుకు వర్తించదని ముకుల్‌ రోహత్గీ వాదించారు. 17A ప్రకారం గవర్నర్‌ అనుమతి కచ్చితంగా తీసుకోవాలని లాయర్‌ సాల్వే వాదించారు.

    నేడు మేడ్చల్, జడ్చర్లలో కేసీఆర్ సభ

    నేడు పాలమూరులో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. జడ్చర్ల, మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రజలకు వివరిస్తారు. ఈ రెండు సభలకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. జడ్చర్లలో ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు.