• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కూలీ అకౌంట్లో రూ.200 కోట్లు జమ

    యూపీలోని బతానియా గ్రామానికి చెందిన దినసరి కూలి శివప్రసాద్ ఉన్నట్టుండి కోటీశ్వరుడయ్యాడు. అతని ఖాతాలో ఏకంగా రూ.200కోట్లు జమ అయ్యాయి. ఇటీవల తన పాన్ కార్డు పొగొట్టుకున్నట్లు చెప్పిన ఆయన.. డబ్బులు ఎవరు జమ చేశారో తనకు తెలియదన్నారు. అయితే భారీ డబ్బు జమ కావడంతో ఇన్‌కం ట్యాక్స్ కట్టాలని శివప్రసాద్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయన ఖాతా నుంచి పన్ను కింద రూ.4.58 లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో శివప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    సిద్ధాంతాల మీద ఓట్టు అడుగుదాం: రేవంత్

    పక్క రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌కు భారీగా నిధులు సమకూరుతున్నాయన్న వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు. కావాలనే బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో మీరు మద్యం, డబ్బు పంచడం వల్ల బీఆర్ఎస్ గెలిచిందని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు చెబుతున్నా.. డబ్బు, మద్యం పక్కన పెడుదాం. ఈ ఎన్నికల్లో కేవలం సిద్ధాంతాల మీద ప్రజలను ఓట్లు అడుగుదాం. మాతో కలిసొచ్చే దమ్ము బీఆర్‌ఎస్‌కు ఉందా అని ప్రశ్నించారు.

    సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదు: రోహత్గీ

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదు. స్కాం జరిగిన టైంలో సెక్షన్ 17ఏ లేదు. అవినీతిపరులకు సెక్షన్ 17ఏ రక్షణకవచం కాకుడదు. సెక్షన్ 17ఏ కేవలం నీతిమంతమైన ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే వర్తిస్తుంది’ అని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో చివరగా చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించాల్సి ఉంది.

    ఎల్లుండి జగనన్న చేదోడు నిధులు రిలీజ్

    సీఎం జగన్ మరో సంక్షేమ పథకం ద్వారా నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. అక్టోబర్ 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద నాయి బ్రహ్మాణులు, రజకులు, దర్జీలకు ఏడాదికి రూ.10 వేల చొప్పున అందిస్తోంది. గత 3 ఏళ్ల నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈసారి నాలుగో విడతగా వారి ఖాతాల్లో జగన్ డబ్బులు జమచేయనున్నారు.

    పాట బిడ్డను టార్గెట్ చేసిన హౌస్‌మెట్స్

    తెలంగాణ పాట బిడ్డగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన భోలే షావలిని హౌస్ మెట్స్ టార్గెట్ చేశారు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ ప్రియాంక జైన్, శోభా శెట్టి మాటాల దాడి చేశారు. హౌస్‌లో నువ్వు నటిస్తున్నావని మండిపడ్డారు. ప్రియాంక ‘థూ’ అంటూ అసభ్యంగా మాట్లాడింది. దీనిపై భోలే గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. అదే పని తాను చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోమ్మని షాకిచ్చాడు. ఏడోవారం నామినేషన్ ప్రక్రియాలో భాగంగా పల్లవి ప్రశాంత్, భోలేషావలి, శివాజి, తేజ ఇతరులు నామినేట్ అయ్యారు. https://x.com/TeluguBigg/status/1713970900507476260?s=20

    ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న చంద్రముఖి 2

    రాఘవా లారెన్స్- కంగనా రనౌత్ నటించిన చంద్రముఖి 2 చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ఈ సినిమా అక్టోబర్ 27నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని చంద్రముఖి 2 ఓటీటీలో ఏమేరకు ఆదరణ పొందుతుందో చూడాలి. పసలేని స్క్రీన్ ప్లే, కథతో చంద్రముఖి 2 ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కంగనా నటన బాగున్నా జ్యోతిక మేర భయపెట్టలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చింది.

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

    గన్ పార్క్‌ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేసేందుకు వచ్చిన ఆయన్ను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందునా అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో ఉద్రిక్తతలు పెరగడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    తల్లిని కూడా కలవనివ్వరా?: భువనేశ్వరి

    ఏపీ పోలీసులు తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. రాజమండ్రిలో చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారు. తల్లిని కలిసేందుకు వస్తే తప్పేంటి అని ధ్వజమెత్తారు.

    సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఛాలెంజ్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ఈమేరకు మధ్యాహ్నం తాను అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనున్నట్లు చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

    రేపు ఇజ్రాయేల్‌లో జోబైడెన్ పర్యటన

    రేపు ఇజ్రాయేల్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పర్యటించనున్నారు. హమాస్ ఉగ్రదాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయేల్‌కు అండగా నిలిచేందుకే బైడెన్ అక్కడ పర్యటిస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతారు. అనంతరం ఇజ్రాయేల్ నుంచి జోర్డాన్ రాజధాని అమ్మన్‌కు వెళ్తారు. అక్కడ ఆ దేశ రాజు అబ్దుల్లా, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమవుతారు. పాలస్తీన ప్రజల ప్రతినిధులుగా హమాస్‌ను గుర్తించమని ఈ భేటీలో ఆయన ప్రకటించనున్నారు.