• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఇదే కేసుపై చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగనుంది. సుదీర్ఘ వాదనల అనంతరం ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

    ఎమర్జెన్సీ విడుదలపై కంగనా కీలక ప్రకటన

    కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ విడుదల గురించి ఆమె అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాను మందుగా అనుకున్న సమయానికి నవంబర్ 24న విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఇటీవల చంద్రముఖి 2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులు అయితే పడ్డాయి.

    మెగాస్టార్ అభిమానిగా పుష్ప రాజ్

    పుష్ప-2 మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. పుష్ప-2లో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కనిపించనున్నాడని తెలిసింది. 2000 దశకంలో టాలలీవుడ్‌ను మెగాస్టార్ రూల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ టైంలో జరిగిన స్టోరీ కావడంతో పుష్ప రాజ్ మెగాస్టార్‌కు పెద్ద ఫ్యాన్‌గా తెరకెక్కిస్తున్నారంట. ప్రస్తుతం ఆ సీన్లకు సంబంధించి షూట్ చేస్తున్నారు. ‘ఇంద్ర’ రిలీజ్ టైంలో పుష్పరాజ్ గెటప్‌, చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని తెరకెక్కిస్తున్నారు.

    కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌కు చెందిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో నల్గొండ మున్సిపల్‌ వైస్ చైర్మన్‌ రమేష్‌తో పాటు 10 మంది బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్‌లో పదవులు ఆశించి భంగపడ్డవారు కాంగ్రెస్‌ బాట పడుతున్నారు.

    స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు తీర్పు

    స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు పాఠం చదివింది. ‘హోమోసెక్సువల్టీ కేవలం నగరాలు, ఉన్నత వర్గాలకు సంబంధించిన అంశం కాదు. ప్రాథమిక హక్కుల పరిరరక్షణ కోసం సుప్రీం ఇచ్చే ఆదేశాలు అధికార విభజనకు అడ్డంకి కాదు. స్వలింగ వివాహాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స్వలింగ వివాహాలు స్పెషల్ మ్యారెజెస్ యాక్ట్‌లోని సెక్షన్‌ 4 రాజ్యాంగ విరుద్ధం అని చెప్పవచ్చు. ఈ వివాహాలపై పార్లమెంటే ఓ నిర్ణయం తీసుకోవాలి. అది కూడా న్యాయ … Read more

    నేడు సిరిసిల్ల, సిద్దిపేటలో కేసీఆర్ సభలు

    నేడు సిరిసిల్ల, సిద్దిపేటలో జరగనున్న బీఆర్ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. తొలుత సిరిసిల్ల ఆ తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొంటా రు. ఈమేరకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్ష మందితో జరిగే సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సిద్ధిపేటలో సుమారు 20 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సిరిసిల్ల, సిద్ధిపేట పట్టణాలు గులాబీమయం అయ్యాయి.

    ఏసీ బస్సుల్లో టికెట్ ధర రూ.30 పెంపు

    దసరా పండుగ వేళ.. తెలంగాణ ఆర్టీసీ, ఏసీ బస్సుల్లో టికెట్ ధర రూ.30 పెంచేసింది. ప్రయాణికులు ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా టికెట్ ధర రూ.30 పెంచింది. లహరీ, గరుడ, గరుడ ప్లస్, రాజధాని బస్సులో ధరల పెంపు వర్తిస్తుంది. అయితే టికెట్ తీసుకున్న ప్రయాణికుడికి తృణ ధాన్యాలతో కూడిన స్నాక్ ప్యాకెట్ అందిస్తారు. దీనిని వద్దనేందుకు ప్రయాణికులకు ఛాయిస్ లేదు. టికెట్ ధరలో స్నాక్ పాకెట్ ధరను చేర్చారు. అందువల్ల టికెట్ రేటు రూ.30కి పెరిగింది.

    తెలంగాణ ఏమైనా పాకిస్తానా?: కోమటి రెడ్డి

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్దతు తెలిపారు. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? హైదరాబాద్లో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంది. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి జరిగింది. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కమ్మవారే కాదు అన్ని కులాల వాళ్లు బాబు కోసం ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. వారిని అడ్డుకోవడం అన్యాయం. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అని ప్రభుత్వంపై కోమటిరెడ్డి మండిపడ్డారు.

    రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నాడు: నాగం

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్‌ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తా. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తుండు. రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాకుండా ఎన్నికల కోసం పారాషూట్ లో వచ్చిన నాయకులకు టికెట్లు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు. తండ్రి బీఆర్ఎస్ పార్టీలో … Read more

    పెళ్లిన తర్వాత మరొకరితో పరిణీతి ఎంజాయ్

    ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పెళ్లి తర్వాత హీరోయిన్ పరిణీతి చోప్రా సోషల్‌ మీడియాలో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మ్యారేజ్ తర్వాత వీరిద్దరూ రెస్టారెంట్లు హోటళ్లలో తెగ ఎంజాయ్ చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేశారు. అయితే తాజాగా పరిణీతి వెరొకరితో వెకెషన్‌కు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మల్దీవ్స్ బీచ్‌లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. అయితే ఇది గర్ల్స్ వెకేషన్ అని.. రాఘవ్ ఈ టూర్‌కు రాలేదని పేర్కొంది. తన మరదలితో ప్రకృతి అందాలు … Read more