• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు మోహిని అవతారంలో శ్రీవారు

    నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో కనిపించనున్నారు. ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం.. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ.. గరుడ వాహన సేవ సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ప్రతి 5 నిమిషాలకు బస్టాండ్‌లో ఓ బస్సు నడపనున్నట్లు టీటీడీ తెలిపింది.

    రాహుల్ లీడర్‌ కాదు రీడర్: కేటీఆర్

    ఓటుకు నోటు కేసు గజదొంగ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను పట్టుకుని కుటుంబ పాలన అంటున్నారు… రాహుల్ ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తు లేదా అని ఎద్దేవా చేశారు. రాహుల్ లీడర్‌ కాదు.. రీడర్. కాంగ్రెస్‌ నేతలు ఏది చదివిస్తే అదే చదువుతారు. నేర్చుకునే ప్రయత్నం చేయరు. నోటికి ఎదొస్తే అది వాగి వెళ్లడం సరికాదంటూ విమర్శించారు.

    కొండా సురేఖకు ప్రమాదం

    రాహుల్ గాంధీ బస్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆయనకు మద్దతుగా చేపట్టిన బైక్‌ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు. బైక్ నడిపిన సురేఖ అదుపుతప్పి కింద పడిపోయింది. ఆమె చేతికి, ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు హుటాహుటినా సురేఖను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

    నిజమే.. నిజమే గెలుస్తుంది: అంబటి

    చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అంబటి అన్నారు. ‘నిజమే.. అందరం నిజం గెలవాలనే కోరుకుంటున్నాం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నిజం గెలుస్తుంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. గత 45 రోజుల నుంచి నిజమే గెలుస్తోంది కాబట్టే చంద్రబాబు ఇంకా జైళ్లో ఉన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు 17ఏ సాకుగా చూపి బయటపడేందుకు పాకులాడుతున్నారు అని అంబటి ఆరోపించారు.

    టాస్ ఓడిన భారత్.. టీమ్ ఇదే!

    పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: భారత్: రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, … Read more

    చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. నవంబర్ 1 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తనకు సెక్యూరిటీ విషయంలో అనుమానాలు ఉన్నాయని జడ్జికి చంద్రబాబు తెలిపారు. తనకు జెడ్‌ ప్లస్ సెక్యూరిటీ ఉందని.. జైలు లోపల బయట భద్రతా పరమైన అనుమానాలున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదని విన్నవించారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా రాతపూర్వకంగా న్యాయస్థానానికి తెలియజేయాలని జడ్జి సూచించారు. చంద్రబాబు లేఖను సీల్డ్ కవర్‌లో తనకు అందించాలని అధికారులను … Read more

    తెలంగాణ గురించి చెబుతూ రాహుల్ ఎమోషనల్

    తెలంగాణ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. ‘తెలంగాణతో మాకు ఉన్నది రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం ఉంది. తెలంగాణతో మోదీ, కేసీఆర్‌లకు కేవలం రాజకీయ సంబంధమే ఉంది. మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. మీకు మాకు మధ్య ఉంది రాజకీయ సంబంధం కాదు. మీ అభిమానం.. ఆశీర్వాదంతో కూడిన సంబంధం. అందుకే మా చెల్లె ప్రియాంకను తీసుకు వచ్చా. తెలంగాణతో మనకు రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం అని చెప్పి తీసుకు వచ్చా’ అని చెప్పుకొచ్చారు.

    గజ దొంగల ముఠా రాష్ట్రాన్ని లూటీ చేసింది: జగన్

    ఎమ్మిగనూరులో నిర్వహించిన సభలో సీఎం జగన్.. ‘జగనన్న చేదోడు’ పథకం నిధులను విడుదల చేశారు. రజకులు, నాయిబ్రహ్మణ కులాలకు చెందిన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. ఏటా వారి అవసరాల నిమిత్తం ఆర్థిక సాయంగా ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోంది. ఈసందర్భంగా సీఎం జగన్.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనకు ఇప్పటికీ తేడా చూడండి. ఇచ్చిన హామీలను నాలుగేళ్లలో నిలబెట్టుకున్నాం. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని లూటీ చేసింది. ఇప్పుడు ప్రతి పైసా ప్రజలకోసమే ఖర్చు పెడుతున్నాం అని … Read more

    దొర ఇలాకలో మనకు మంచి రోజులు: రాహుల్

    ములుగు బస్సు యాత్రలో రాహుల్ గాంధీ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణకి.. ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం. దొర ఇలాకాలో మనకీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ సంపదను లూటీ చేస్తుంది. కర్ణాటకలో మహిళలందరూ ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. నేను అబద్ధం చెప్పను. పనికి మాలిన మాటలు చెప్పను. కేసీఆర్‌లా 3 ఎకరాల భూమి ఇస్తాం లాంటి హామీలు ఇవ్వడానికి రాలేదు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.

    మణప్పురం గోల్డ్ లోన్ భారీ మోసం

    కృష్ణా జిల్లా- కంకిపాడు మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంలో భారీ మోసం వెలుగు చూసింది. అక్కడ తాకట్టు పెట్టిన 16 కేజీల బంగారంతో పావని అనే ఉద్యోగిని ఉడాయించింది. ఈ విషయం బయటకు పొక్కడంతో.. కార్యలయం ఎదుట బాధితులు ఆందోళన చేస్తున్నారు. తమ బంగారం తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు వెయ్యి మంది బాధితులు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పావన్ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తోంది.