• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు సుప్రీంలో బీఆర్ఎస్ పిటిషన్ విచారణ

    నేడు సుప్రీంలో బీఆర్ఎస్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను మరో పార్టీకి కేటాయించడంపై సుప్రీంను బీఆర్ఎస్‌ ఆశ్రయించింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని పిటిషన్ దాఖలు చేసింది. రోడ్ రోలర్, చపాతి మేకర్, ట్రక్కు, టైప్ మిషిన్ వంటి గుర్తులు కారును పోలిన గుర్తులుగా బీఆర్ఎస్ పేర్కొంది. ఈ గుర్తుల వల్ల గత ఎన్నికల్లో భారీగా నష్టపోయినట్లు విన్నవించింది.

    నేడు బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

    అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు స్టార్ అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు.. రెండుసార్లు వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణ రెడ్డి సైతం ఈరోజు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గతంలో ఆయన బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు.. కాంగ్రెస్ నుంచి బీజేపీకి మళ్లీ ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. మరోవైపు నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందిన బీసీ నాయకుడు, ఉద్యమకారుడు … Read more

    నేడు HCA ఎన్నికలు

    నేడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో రిటర్నింగ్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ సమక్షంలో హెచ్‌సీఎ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 173 మంది ఓటు వేయనున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌లను ఎన్నుకోనున్నారు. ఫలితాలు సాయంత్రం 4 తర్వాత వెలువడనున్నాయి.

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.55,700కు చేరింది. అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ. 60,760కి ఎగబాకింది. మరోవైపు కేజీ వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో కిలో వెండి రూ. 77,500కు చేరుకుంది.

    సచిన్ రికార్డు బ్రేక్ కానుందా?

    వన్డేల్లో విరాట్‌ కోహ్లీ మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్‌ రికార్డు బ్రేక్‌ కానుంది. మరో సెంచరీ చేస్తే సచిన్‌ సెంచరీ(49)లను కోహ్లీ సమం చేయనున్నాడు. 463 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలు చేసిన సచిన్… కేవలం 285 మ్యాచుల్లోనే కోహ్లీ 48 శతకాలు చేశాడు. ఈ వరల్డ్‌ కప్‌లోనే కోహ్లీ ఆ ఫీట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అటు కోహ్లీ టెస్టులు, వన్డేలు కలిపి మొత్తం 78 సెంచరీలతో సచిన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.

    నేటితో ముగియనున్న రాహుల్ బస్సు యాత్ర

    నేటితో మొదటి దశ కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ముగియనుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర నుంచి రాహుల్ గాంధీ బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. 9.30కి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్, 12 గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో సమావేశం. మధ్యాహ్నం 1 గంటకు కోరుట్లలో సమావేశం, 1.30కి భోజన విరామం, 2.30 గంటలకు ఆర్మూర్‌లో సభ, ఆర్మూర్ నుండి హైదరాబాద్ … Read more

    టైగర్ నాగేశ్వరరావు ట్విట్టర్ రివ్యూ

    మాస్ మహారాజ రవితేజ నటించిన టైగర్‌నాగేశ్వరరావు మూవీ నేడు విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ కామెంట్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘రవితేజ మాస్ యాక్షన్ అదిరిపోయింది. ఫస్టాఫ్ విజువల్ ఫీస్ట్. హీరో ఇంట్రడక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. లవ్‌ ట్రాక్ బాలేదు. సెకండాఫ్ సాగదీసినట్లు ఉంది. పాటలు మెప్పించవు. లెంగ్తీ రన్‌ టైం సినిమాకు మైనస్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. పూర్తి రివ్యూ మరికాసేపట్లో..

    కోహ్లీకి సెంచరీ చేయలనే లేదు: కేఎల్ రాహుల్

    బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తొలుత సెంచరీ చేయలని అనుకోలేదని కేఎల్ రాహుల్ మ్యాచ్‌ అనంతరం వెళ్లడించాడు. ‘అసలు కోహ్లీకి సెంచరీ మీద దృష్టి లేదు. మ్యాచ్ ఫినిష్ చేయమని అడిగాడు. కానీ నేనే సెంచరీ చేయాలని పట్టుబట్టా. సింగిల్స్ తీయకుంటే పర్సనల్ రికార్డుల కోసం ఆడుతారని జనాలు భావిస్తారని చెప్పాడు. కానీ మనం ఎలాగో గెలుస్తాం కాబట్టి సెంచరీ కోసం ట్రై చేయడంలో తప్పు లేదు అని చెప్పా. అప్పుడు సెంచరీ చేసేందుకు ఒప్పుకున్నాడు’ అని చెప్పుకొచ్చాడు. Courtesy Twitter: Courtesy Twitter: … Read more

    నేడు బీజేపీ తొలి జాబితా?

    తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై ఇంకా తర్జన భర్జనలు కొనసాగుతునే ఉన్నాయి. గురువారం రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ జావ్‌డేకర్ నివాసంలో టీబీజేపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తొలి జాబితాపై కసరత్తు చేశారు. సామాజిక వర్గాల వారిగా టికెట్ల కేటాయింపు, ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్న స్థానాలపై తుది జాబితా ఖరారు చేశారు. ఈరోజు 11 గంటలకు జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమై అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

    ఆస్కార్ మెంబర్‌గా జూ. ఎన్టీఆర్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్కార్ అకడామీ మెంబర్‌గా సెలెక్ట్ అయ్యాడు. తాజాగా అకాడమీ కొత్త మెంబర్స్ లిస్ట్‌ని ఆస్కార్ అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ ఆస్కార్ మెంబర్‌గా సెలెక్ట్ కావడంతో సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెంబర్ షిప్‌ వల్ల ఆస్కార్ నామినేడ్ చేసే చిత్రాలకు ఓటింగ్ చేసే అవకాశం ఎన్టీఆర్‌కు లభిస్తుంది.