• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తొలిరోజు లియో రికార్డు వసూళ్లు

    తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ తొలి రోజు రికార్డు కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల మేర గ్రాస్బ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కోలివుడ్ నుంచి విడుదలైన సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా టాప్‌లో నిలిచింది. లోకేష్ కనగరాజు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ సంపాదించింది. ఇక నార్త్ అమెరికాలోనూ ‘లియో’ రికార్డు వసూళ్లు సాధించింది. అయితే కొంతమంది యాంటీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ‘లియో డిజాస్టర్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

    కేసీఆర్‌ను ఎందుకు గద్దే దించాలి: కేటీఆర్

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ‘ఒకప్పుడు బలిదేవత అని సోనియా గాంధీని విమర్శించిన రేవంత్‌కు ఇప్పుడు ఆమె దేవత అయిందా? కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే 11 సార్లు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ ఏం చేసింది? కేసీఆర్‌ను గద్దే దించాలని అంటున్నారు. రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు గద్దే దించాలా? ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ఇచ్చినందుకు దింపాల? ఆసరా పెన్షన్లు పెంచినందుకు దించాలా? ఎందుకు దించాలి’ అని ప్రశ్నించారు.

    రేవంత్ రెడ్డిపై అధిష్ఠానానికి గొనె ప్రకాష్ ఫిర్యాదు

    కాంగ్రెస్ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాష్ పిర్యాదు చేశారు. బలహీన వర్గాలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన 12 మందికి రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చారని విమర్శించారు. సర్వే రిపోర్టులు అంటూ రేవంత్ రెడ్డి తన వర్గంవాళ్లకే టిక్కెట్లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. పార్టీకోసం పనిచేసిన వారికి అన్యాయం జరిగిందని వాపోయారు. ఐదు సార్లు చిత్తుగా ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్ రావును ఖమ్మం జిల్లాలో కీలక నేత లాగా ఎలా ప్రొజెక్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. Courtesy Twitter: … Read more

    జనసేన నేతలతో నేడు పవన్ భేటీ

    జనసేన ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్‌ నేడు సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన నేతల సమన్వయ కమిటీ సమావేశంపై చర్చ జరిపే అవకాశం ఉంది. దసరా తరువాత వారాహి యాత్ర చేపట్టే యోచనలో పవన్‌ ఉన్నారు. షెడ్యూల్ ఖరారుపై పార్టీ నేతలతో జనసేనాని మాట్లాడనున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు నేపథ్యంలో పార్టీ నాయకులు వ్యవహరించాల్సిన తీరుపై సూచనలు చేయనున్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు దిశానిర్దేశం చేయనున్నారు.

    చంద్రబాబు పిటిషన్ విచారణ వాయిదా

    ఫైబర్ నెట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు తీర్పు రిజర్వు చేయడంతో.. తీర్పు వెలవడే వరకు ఆగాలని లాయర్లకు న్యాయస్థానం సూచించింది. మరోవైపు స్కిల్ స్కాం కేసులో ఈనెల 8న తీర్పు ఇస్తామని న్యాయస్థానం పేర్కొంది.

    బీఆర్ఎస్‌కు సుప్రీం కోర్టులో షాక్

    సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని అభ్యర్థించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు ఈసీ కేటాయించడంపై సుప్రీంలో బీఆర్ఎస్ సవాలు చేసింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని పిటిషన్ దాఖలు చేసింది. రోడ్ రోలర్, చపాతి మేకర్, ట్రక్కు, టైప్ మిషిన్ వంటి గుర్తులు కారును పోలిన గుర్తులుగా బీఆర్ఎస్ పేర్కొంది. ఈ గుర్తుల వల్ల గత ఎన్నికల్లో భారీగా … Read more

    కానిస్టేబుల్‌ను తొక్కుకుంటూ వెళ్లిన కారు

    హైదరాబాద్ – రోడ్డుపై వాహనలు తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు దూసుకెళ్లిన ఘటన చిలకలగూడలో జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 18న రాత్రి వాహన తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేష్.. అటుగా వస్తున్న ఓ కారును ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా కానిస్టేబుల్‌ను గుద్ది తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. https://x.com/TeluguScribe/status/1715211924110262641?s=20

    ప్రజ్ఞాన్‌పై ఇంకా ఆశలున్నాయి: ఇస్రో

    చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రస్తుతం చందమామపై ప్రజ్ఞాన్ రోవర్ నిద్రిస్తుంది. దానిని పడుకొనిద్దాం. తనంతటే తానే క్రియాశీలం అయ్యే అవకాశాలు ఇంకా మెండుగా ఉన్నాయి. రోవర్‌ను మైనస్ 200 డిగ్రీల వద్ద పరీక్షించినప్పుడు పనిచేసింది. అందుకే ఇప్పటికీ ప్రజ్ఞాన్ రోవర్ క్రియాశీలమవుతుందనే నమ్మకం ఉందన్నారు.

    గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్ పే

    చిల్లర, చిన్న వ్యాపారులకు గూగుల్ పే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పేమెంట్ యాప్‌లో రుణాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. రూ.1000- రూ.100000 వరకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈమేరకు డీఎంఐ సంస్థతో చేతులు కలిపింది. అలాగే వ్యక్తిగత రుణాలను సైతం అందివ్వనున్నట్లు తెలిపింది. ఇందుకోసం యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. తక్కువ వడ్డీ ఈఎంఐతో రుణాలు నెల నెలా చెల్లించవచ్చిని పేర్కొంది.

    హమాస్, రష్యా విచ్ఛిన్న శక్తులు: బైడెన్

    అమయాకుల ప్రాణాలు హరిస్తున్న హమాస్, రష్యా రెండూ ఒకటేనని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని రష్యా, హమాస్ కంకణం కట్టుకున్నాయని విమర్శించారు. వాటి లక్ష్యాలను అమెరికా నెరవేరనియదని స్పష్టం చేశారు. ఇజ్యాయేల్, ఉక్రేయిన్‌కు సాయం చేసేందుకు నిధుల విడుదలకు అనుమతించాలని బైడెన్ అమెరికా కాంగ్రెస్‌ను కోరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందేందుకు బైడెన్ ఈవిధంగా చేస్తున్నాడని పలువురు విమర్శిస్తున్నారు.