• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

    హైదరాబాద్- ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మ పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ కమిషనర్ సుధీర్‌ బాబు తెలిపారు. రేపు అప్పర్ ట్యాంక్ బండ్, లుంబినీ పార్క్ వద్ద సద్దుల బతుకమ్మ సంబురాలు జరుగుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్క్, అప్పర్ ట్యాంక్ బండ్ మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

    ఈరోజు వరల్డ్‌ కప్‌లో రెండు మ్యాచ్‌లు

    వరల్డ్‌ కప్‌లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లక్నో వేదికగా శ్రీలంక, నెదర్లాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే టోర్నీలో బలమైన సౌతాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్ శ్రీలంకకు అదే రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ముంబై వేదికగా జరగనున్న మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. Courtesy Twitter: icc Courtesy Twitter: icc

    గగన్‌యాన్‌ ప్రయోగం నిలిపివేత

    ఈరోజు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ ప్రయోగం నిలిచిపోయింది. గగన్‌యాన్ TV-D1 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కౌంట్‌ డౌన్‌కు 4 సెకన్ల ముందు సాంకేతిక లోపం గుర్తించినట్లు వెల్లడించారు. మరో ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

    HCA ప్రెసిడెంట్‌గా జగన్ మోహన్‌రావు

    హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో రెండు ఓట్లతో అర్శనపల్లి జగన్ మోహన్ రావు విజయం సాధించారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్ తరఫున ఆయన ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఇక HCA వైస్ ప్రెసిడెంట్‌గా దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), సెక్రెటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), జాయింట్ సెక్రెటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), ట్రెజరర్‌గా సిజే శ్రీనివాస్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్), కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) ఎన్నికయ్యారు.

    ఐమాక్స్ థియేటర్‌లో అర్ధరాత్రి రచ్చ

    హైదరాబాద్ – ఐమాక్స్‌ థియేటర్‌లో అర్ధరాత్రి ప్రేక్షకులు రచ్చ చేశారు. టైగర్ ష్రాప్ నటించిన గణపత్ సినిమా నిన్న రాత్రి 11.15 గంటలకు చివరి షోగా ప్రారంభమైంది. షో స్టార్ట్ అయిన కొద్దిసేపటికే.. హాలులో భరించలేని దుర్గందం వ్యాపించింది. దుర్వాసన ఎంతకీ తగ్గకపోవడంతో బయటకు వచ్చిన ప్రేక్షకులు మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ప్రేలు కొట్టిన దుర్వాసన తగ్గకపోవడంతో హాలులో రచ్చ రచ్చ చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పడంతో ప్రేక్షకులు శాంతించారు.

    నటి జయప్రదకు హైకోర్టులో ఎదురు దెబ్బ

    సినీ నటి జయప్రదకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నైలోని అన్నాపాలైలో జయప్రద ఓ సినిమా థియేటర్ నడిపారు. తమ ఈఎస్‌ఐ చెల్లింపుల్లో( రూ.37లక్షలు) మోసం చేశారని థియేటర్ సిబ్బంది ఆమెపై ఎగ్మూరు కోర్టులో కేసు నమోదు చేశారు. విచారించిన కోర్టు జయప్రదకు 6 నెలలు జైలు, రూ.5 వేల జరిమానా విధించింది. అప్పీలుకు వెళ్లిన జయప్రద రూ.20 లక్షలు చెల్లిస్తానని కోర్టుకు చెప్పగా.. సిబ్బంది వ్యతిరేకించారు.

    నేడు హైకోర్టు జడ్జిల ప్రమాణం

    నేడు హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం జరగనుంది. ఉదయం 11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలుగురు అడిషనల్ జడ్జిలు హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌తో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.

    టీడీపీ- జనసేన తొలి భేటీ డేట్ ఖరారు

    టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 23న రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి సమావేశం జరగనుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లోకేశ్- పవన్ కళ్యాణ్‌ల అధ్యక్షతన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు ప్రకటించాయి.

    ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర

    వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.56,400కు చేరింది. అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.770 పెరిగి రూ. 61,530కి ఎగబాకింది. మరోవైపు కేజీ వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో కిలో వెండి రూ. 77,500 వద్ద కొనసాగుతోంది.

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్

    వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(C), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(C), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్