• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దుస్తులంటే చిరాకు..తువ్వాలుతోనే కాలేజీకి!

    ప్యాంటు, షర్ట్‌,షూ, వాచ్‌, ఒంటికి సెంట్‌ ఇలా కాలేజీకి వెళ్లే కుర్రాళ్లు ముస్తాబవుతుంటారు. కానీ అతడికి అవన్నీ చిరాకు. అసలు బట్టలేసుకోవడమంటేనే నా వల్ల కాదంటాడు. అండర్‌వేర్‌, తువ్వాలు ఉంటే చాలు అలాగే కాలేజీకి వెళ్లిపోతాడు. అతడే మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీకి చెందిన కన్నయ్య. స్కూళ్లో వెళ్తే వెళ్లావ్‌…కనీసం కాలేజీకైనా బట్టలేసుకుని వెళ్లరా అన్నా వినకుండా అలాగే వెళ్తున్నాడు.

    “రేయ్‌ ఎవర్రా మీరంతా” కార్తీ స్పీచ్‌

    కార్తీ హీరోగా అక్టోబర్‌ 21న విడుదల కాబోతున్న సినిమా ‘సర్దార్‌’. హైదరాబాద్‌లో ఇవాళ ఘనంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా కార్తీ మాట్లాడుతూ ఈ మధ్య సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన తన యుగానికి ఒక్కడు డైలాగ్‌ ‘రేయ్‌ ఎవర్రా మీరంతా’ అంటూ స్పీచ్‌ స్టార్ట్‌ చేశాడు. దీంతో ఆడిటోరియం మోత మోగిపోయింది. పీఎస్ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అలనాటి తార లైలా నటిస్తోంది.

    జిమ్‌ ట్రైనర్‌ గుండెపోటుతో మృతి

    జిమ్‌ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఇటీవల అనేక వార్తలు చూస్తున్నాం. అయితే ఘజియాబాద్‌లో జిమ్‌ ట్రైనర్‌ ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేసింది. సాధారణంగా జిమ్‌కు వెళ్లేవారు.. తమ శక్తికి మించి కసరత్తులు చేసి గుండెపోటుకు గురవుతుంటారు. కానీ నిష్ణాతుడైన ట్రైనర్‌కు ఇలా జరగడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కుర్చీ మీద కూర్చున్న ట్రైనర్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    ఎమోషనల్‌ అయిన హీరోయిన్‌ మరియా

    “ప్రిన్స్‌” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న నటి మరియా. ఉక్రెయిన్‌కు చెందిన ఈ నటి సినిమా షూటింగ్‌ కోసం ఇండియాకు వచ్చిరెండు వారాల్లోనే అక్కడ యుద్ధం మొదలైంది. ఆ విషయాన్ని తలుచుకుని మరియా ఎమోషనల్‌ అయింది. కష్టకాలంలో చిత్రబృందం తనకు ఎంతో సాయం చేసిందని చెప్పుకొచ్చింది. అక్టోబర్‌ 21న ప్రిన్స్‌ సినిమా విడుదల కాబోతుండగా…మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

    జాంటిస్‌ GK350: నిండైన ఫీచర్ల బండి

    చైనా బైక్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ జాంటిస్‌ (Zontes) ఇండియన్‌ మార్కెట్లోకి ఎంటర్‌ అయింది. GK350 పేరిట ఓ కెఫే రేసర్‌ బైక్‌ లాంఛ్‌ చేసింది. 349cc లిక్విడ్‌ కూల్‌, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌, 38.8bhp పవర్‌, 32.8Nm టార్క్‌ ఇచ్చే ఈ బైక్‌లో మతిపోగొట్టే ఫీచర్లున్నాయి. ఈ బైక్‌ కీ లేకుండానే స్టార్ట్‌ అవుతుంది. కార్లలో మాదిరిగా జేబులో కీ నాబ్‌ పెట్టుకుని బటన్‌ నొక్కితే చాలు స్టార్ట్‌ అవుతుంది. ఫ్యూయల్‌ ట్యాంక్‌ కూడా బటన్‌ నొక్కితో ఓపెన్‌ అవుతుంది. దీని కన్సోల్‌ కూడా … Read more

    HEAD BUSH సూపర్ ట్రైలర్

    కేజీఎఫ్‌తో మొదలైన కన్నడ సినిమాల హవా ‘కాంతార’తో నెక్స్ట్‌ లెవెల్‌కి వెళ్లింది. ఈ ఏడాది KGF2, విక్రాంత్‌ రోణ, 777చార్లీ, కాంతార ఇలా సూపర్ హిట్ల తర్వాత… ఇప్పుడు ‘హెడ్‌ బుష్‌’ అంటూ మరో సినిమా రాబోతోంది. అగ్ని శ్రీధర్ రచన, శూన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. వయొలెంట్‌గా ఉన్న ట్రైలర్‌ చూస్తుంటే మరో మాస్‌ సినిమా లోడ్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. పుష్పలో జాలి రెడ్డిగా ధనంజయ ఇందులో హీరోగా కనిపిస్తున్నారు. అక్టోబర్‌ 21న ఈ సినిమా రిలీజ్‌ … Read more

    కార్పొరేటర్‌ భర్తను చితకబాదిన కార్మికులు

    బీజేపీ కార్పొరేటర్ భర్తను కార్మికులు చితకబాదిన ఘటన ఇండోర్‌లోని రవ్‌ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కార్పొరేటర్‌ భర్త మున్సిపాలిటీ కార్మికులలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. దీంతో నిందితుడు చోహన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ ఇరు పక్షాల మధ్య తలెత్తిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. కార్మిక సిబ్బంది వారి బంధువులు కలిసి కార్పొరేటర్‌ భర్తపై దాడికి దిగారు. వాచ్‌ ఆన్‌ ట్విట్టర్‌పై వీడియో చూడండి. … Read more

    F1 రేసులో డేవిడ్‌ షుమాకర్‌కు ప్రమాదం

    ఫార్ములా వన్‌ దిగ్గజం మైఖేల్‌ షుమాకర్‌ అల్లుడు డేవిడ్‌ షుమాకర్‌ వెన్నెముక విరిగింది. హాకెన్‌హీమ్‌ DTM రేసులో ఈ దుర్ఘటన జరిగింది. రేసులో లాప్‌-6 జరుగుతున్న వేళ…..షుమాకర్‌ కారు మరో కారును ఢీకొంది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రస్తుతానికి షుమాకర్‌కు సర్జరీ అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. కోలుకోవడానికి 6 వారాల సమయం పట్టొచ్చని తెలిపారు. గతంలో మైఖేల్‌ షుమాకర్‌ కూడా 2013లో యాక్సిడెంట్‌తో కోమాలోకి వెళ్లాడు. 2014లో కోలుకుని ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉంటున్నాడు.

    ప్రియురాలితో షాపింగ్‌..చితకబాదిన భార్య

    పండుగ షాపింగ్ చేయిస్తున్న ఓ భర్తను భార్య చితకబాదిన ఘటన ఘజియాబాద్‌లో వెలుగుచూసింది. ఎందుకంటే ఆ భర్త షాపింగ్‌ చేస్తుంది భార్యతో కాదు ప్రియురాలితో.! ఉత్తర భారతంలో ఘనంగా నిర్వహించుకునే పండుగ కర్వాచౌత్‌. ఈ పండగ వేళ భార్యలు తమ భర్తల ఆరోగ్యం కోసం ఉపవాసం ఉంటూ వ్రతాలు చేస్తారు. అలాంటి పండుగ వేళ తనతో కాకుండా మరో మహిళతో భర్త షాపింగ్‌కు వెళ్తే భార్య ఊరుకుంటుందా? అందుకే చితకబాదింది. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. करवा चौथ के दिन … Read more

    ‘అజయంతె రందమ్ మోషాణమ్‌’ గ్లింప్స్‌

    మళయాల స్టార్‌ టోవినో థామస్‌ హీరోగా పాన్‌ ఇండియా సినిమా‘అజంయతే రందమ్ మోషాణమ్‌’ ,షూటింగ్‌ ప్రారంభమైంది. మూడు యుగాల్లో జరిగే కథతో 3Dలో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. టొవినో థామస్‌ ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. టొవినో థామస్‌ సరసన కృతి శెట్టి, ఐశ్వర్య రాజేశ్‌, సురభి లక్ష్మి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అంచనాలు పెంచేలా ఈ గ్లింప్స్‌ అద్భుతంగా ఉంది.