• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేదికపైనే హీరోపై హీరోయిన్‌ ముద్దుల వర్షం

    త్రివిక్రమ్‌ దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ, సునీల్, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించి అలరించిన ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం సంబరాలు చేసుకుంది. ఆనాటి రోజులకు గుర్తు చేసుకుని చిత్ర యూనిట్ ఎమోషనల్‌ అయింది. హీరోయిన్ శ్రియ అయితే తరుణ్‌తో తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. త్రివిక్రమ్‌ మాటలు, సునీల్‌ కామెడీ టైమింగ్‌తో ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నలిచింది.

    రోడ్డుపై పెళ్లి చేసుకున్న స్కూల్‌ పిల్లలు

    సోషల్‌ మీడియా, ఫోన్ల వినియోగం పెరిగాక పిల్లల చేష్టలు మితిమీరుతున్నాయి. పిల్లల కదలికలను తల్లిదండ్రులు నిరంతరం కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా తమిళనాడులోని చిదంబరం జిల్లాలో ఓ ఇంటర్‌ అమ్మాయి, పాలిటెక్నిక్‌ అబ్బాయి బస్టాండులో పెళ్లి చేసుకున్నారు. స్నేహితులు ప్రోత్సహిస్తుండగా… ఆ కుర్రాడు బాలిక మెడలో తాళి కట్టాడు. ఇది సరదాగా చేశారో లేక నిజంగా పెళ్లి చేసుకోవాలని చేశారో తెలీదు గానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. காலேஜ் மாணவிகள் … Read more

    ‘కాంతార’ ఎందుకు తప్పక చూడాల్సిన సినిమా?

    ‘కాంతార’, ఓ కన్నడ సినిమా. పాన్‌ ఇండియా సినిమా అంటూ పెద్ద హంగూ ఆర్భాటాలు ఏమీ లేకుండానే రిలీజైన ఈ సినిమా పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగుతోంది. ఎందుకు ఈ సినిమాకు అంత క్రేజ్‌. ఇప్పటిదాకా ఎవరూ చెప్పని కథ చెప్పారా?, ఎవరికీ సాధ్యం కానీ కథనం ఉందా? ఏమో! కానీ ఈ సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటికి వచ్చేటపుడు మాత్రం మాములుగా రావు. నీకేదో దేవుడు ఆవహించి శివాలెత్తిన అనుభూతి కలుగుతుంది. నీ బుర్ర నిండా ఆ సినిమా చివరి అరగంటనే … Read more

    చిరంజీవి పోతరాజు డ్యాన్స్ వీడియో వైరల్

    హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్ బలయ్‌’ కార్యక్రమంలో చిరు చేసిన పోతరాజు డ్యాన్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరు పోతరాజు కొరడా పట్టుకుని చిందులేశారు. విజయ దశమి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. మరోవైపు దసరాకు విడుదలైన చిరు సినిమా గాడ్‌ ఫాదర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. వీడియో కోసం ఇన్‌స్టాగ్రాంపై క్లిక్‌ చేయండి. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

    అదిరిన ‘ఓరి దేవుడా’ ట్రైలర్‌

    అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ‘ఓరి దేవుడా’ ట్రైలర్‌ విడుదలైంది. దేవుడు, స్నేహం, ప్రేమ, పెళ్లి ఇలా ప్రతి మనిషీ రిలేట్‌ చేసుకోగలగేలా ట్రైలర్‌ ఆకట్టుకుంది. తమిళంలో ఇప్పటికే ఈ సినిమా ‘ఓహ్‌ మై కడవులే’గా విజయం సాధించింది. ఆ సినిమాలో విజయ్‌ సేతుపతి చేసిన దేవుడి పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేశ్ చేస్తున్నారు.

    ‘ఎందుకో అర్థం కావట్లేదు’: సురేఖ వాణి

    ప్రముఖ టాలివుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి ఎమోషనల్‌ అయ్యారు. ఇటీవల సినిమాల కన్నా సోషల్‌ మీడియాలోనే కనిపిస్తున్న సురేఖ…. తనకు సినిమాలు రావట్లేదని భావోద్వేగానికి లోనయ్యారు. ‘స్వాతిముత్యం’ సక్సెస్‌ మీట్‌లో ఆమె మాట్లాడారు. ‘ఇటీవల చాలా మంది నేను సినిమాలు మానేశాను అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. నేను సినిమా పిల్లను, సినిమాతోనే ఉంటా. ఇటీవల అవకాశాలు రావట్లేదు. అది ఎందుకో కూడా అర్థం కావట్లేదు’ అని సురేఖ చెప్పుకొచ్చారు.

    విజయ్‌, రష్మిక మాల్దీవ్స్‌ టూర్‌

    వెండితెర జోడీ విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమపై నిరంతరం వార్తలు వస్తూనే ఉంటాయి. వారు మాత్రం దీనిపై ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇవాళ మరోసారి వీరి ప్రేమ వ్యవహారం వార్తల్లోకెక్కింది. వీరిద్దరూ కలిసి మాల్దీవులు టూర్‌ వెళ్తున్నారంటూ ప్రచారం సాగుతోంది.ఇవాళ ఉదయం రష్మిక ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఫోటోగ్రాఫర్లకు హాయ్‌ చెప్పి లోపలికి వెళ్లిపోయారు. కాసేపటికే విజయ్‌ కూడా ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి మాల్దీవుల టూర్‌ వెళ్తున్నారంటూ గుసగుసలు మొదలయ్యాయి.

    హీలియం ట్యాంక్‌ పేలి ఒకరు మృతి

    హీలియం ట్యాంక్‌ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది. తిరుచ్చిలో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మార్కెట్లో హీలియం బలూన్లు అమ్ముతుండగా ప్రమాదం జరిగింది. అయితే హీలియం బలూన్లు అమ్మిన వ్యక్తిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. అందువల్ల ఇది ప్రమాదమా, లేదా కావాలని చేసిందా అని పరిశీలిస్తున్నారు.

    నవ్వుతూనే సల్మాన్‌ ఖాన్‌ మనసులో మాట!

    ఇటీవల హిందీలో సౌత్‌ సినిమాలో హవా పెరిగింది. దీంతో బాలివుడ్‌ కూడా మార్కెట్‌ కోసం మనవైపు చూస్తోంది. కానీ ఈ మధ్య ఒక్క బాలివుడ్‌ డబ్బింగ్‌ సినిమా కూడా ఇక్కడ ఆడలేదు. అయితే దీనిపై ‘గాడ్‌ఫాదర్‌’లో చిరుతో పాటు నటిస్తున్న సల్మాన్‌ ఖాన్‌ నవ్వుతూనే పంచ్‌ వేశాడు. చిరు మనమంతా ఇండియన్‌ యాక్టర్స్‌ అని చెబుతుండగా సల్మాన్‌ కలగజేసుకుంటూ ‘చిరు సర్‌ మీ సినిమాలు మేం యాక్సెప్ట్‌ చేస్తున్నాం. కానీ మా సినిమాలే మీరు యాక్సెప్ట్‌ చేయట్లేదంటూ’ ఒకింత ఆవేదన వెళ్లగక్కారు. దీనిపై చిరు … Read more

    లెజెండ్స్‌ మ్యాచ్‌లో యూసుఫ్‌ పఠాన్‌, జాన్సన్‌ ఫైట్‌

    రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా లెజెండ్స్‌ మ్యాచ్‌లో ఓ గొడవ తలెత్తింది. భారత జట్టులోని యూసుఫ్‌ పఠాన్‌, ఆస్ట్రేలియాలోని జాన్సన్‌ మాటల యుద్ధానికి దిగారు. పరస్పరం తోసుకున్నారు. మిగతా ఆటగాళ్లు కలుగజేసుకుని వారి గొడవను సద్దుమణిగించారు. ఈ ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌ అంటే కవ్వింపులతో వాడీవేడిగా సాగేది. ఆటగాళ్లు వయసు పెరిగి నిష్క్రమించినా వారిలో జోరు మాత్రం తగ్గలేదంటూ పలువురు ఈ వీడియోలకు కామెంట్లు చేస్తున్నారు. https://youtube.com/watch?v=MkkWgIDWhd4