Best Deals On Popular Chargers: అమెజాన్‌లో కంపెనీ ఛార్జర్లపై బిగ్ డిస్కౌంట్స్.. వివరాలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Deals On Popular Chargers: అమెజాన్‌లో కంపెనీ ఛార్జర్లపై బిగ్ డిస్కౌంట్స్.. వివరాలు ఇవే!

    Best Deals On Popular Chargers: అమెజాన్‌లో కంపెనీ ఛార్జర్లపై బిగ్ డిస్కౌంట్స్.. వివరాలు ఇవే!

    November 6, 2023

    చాలా స్మార్ట్‌ ఫోన్ కంపెనీలు ఛార్జింగ్ అడాప్టర్‌లను నిలిపివేశాయి. దీంతో పోర్టబుల్ ఛార్జర్లకు డిమాండ్ పెరిగింది. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలతో వస్తున్నాయి. ఇవి ఛార్జింగ్ టైంను ఆదా చేస్తాయి. ఈ ఛార్జర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, స్పీకర్‌లు, ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌బ్యాండ్‌లు, పవర్ బ్యాంక్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఛార్జ్ చేస్తాయి. కంపెనీ ఛార్జర్ల మాదిరి హై-స్పీడ్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ వాటేజ్ రేటింగ్‌తో ఛార్జర్ల జాబితాను అందించాం. వాటిపై ఓ లుక్ వేయండి.

    ఒరైమో ఎలైట్

    ఒరైమో ఎలైట్ 12W రేటింగ్‌తో డ్యూయల్-పోర్ట్ వాల్ ఛార్జర్. ఇది హై-వోల్టేజ్ కరెంట్, షార్ట్-సర్క్యూట్ ప్రొటెక్షన్‌ కోసం స్మార్ట్ చిఫ్‌తో రూపొందింది. ఛార్జింగ్ స్థితిని సూచించడానికి దీని అడాప్టర్ LED లైట్‌తో అమర్చబడి ఉంటుంది. దీని ధర రూ. 249

    Mi వాల్ ఛార్జర్

    Mi వాల్ ఛార్జర్ 1.2-మీటర్ పొడవుతో ఉంటుంది. USB టైప్-A సాకెట్ నుంచి మైక్రో-USB కేబుల్‌తో వస్తుంది. ఇది 10W ఛార్జింగ్‌ అవుట్‌పుట్ అందిస్తుంది. అలాగే, దీని కేబుల్ 480MBps వేగంతో డేటా ట్రాన్సఫర్ చేస్తుంది. ఇది హీట్, షాక్ ప్రొటెక్షన్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. దీని ధర రూ. 499

    Mi సూపర్‌ఫాస్ట్ ఛార్జర్

    ఈ Mi సూపర్‌ఫాస్ట్ ఛార్జర్ 27W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. Qualcomm Quick Charge 3.0 టెక్నాలజీకి అనుకూలంగా ఉంటుంది. ఈ అడాప్టర్ ప్రీమియం బిల్డప్‌తో మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది వోల్టేజ్‌ సర్జ్‌లు, హైహీట్, షార్ట్ సర్క్యూట్ నుంచి రక్షణ కల్పిస్తుంది. దీని ధర రూ.772

    4. ఒరైమో వాల్ ఛార్జర్

    ఒరైమో నుంచి వచ్చిన ఈ ఛార్జర్ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. USB టైప్-A , USB టైప్-C పోర్ట్‌లతో డిజైన్‌తో తయారైంది. ఇది పవర్ డెలివరీ (PD) ఫాస్ట్ ఛార్జ్, డాష్ ఛార్జ్, QC3.0 వంటి అనేక ఇతర ప్రోటోకాల్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ అడాప్టర్ హై-వోల్టేజ్, షార్ట్-సర్క్యూట్ నుంచి రక్షిస్తుంది. దీని ధర రూ. 899

    పోర్ట్రోనిక్స్ అడాప్టర్ వన్

    పోర్ట్రోనిక్స్ అడాప్టో వన్.. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. 1-మీటర్ USB టైప్-సి కేబుల్‌తో వస్తుంది. ఈ ఛార్జర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)చే ధృవీకరించబడింది. ఇది ఓవర్‌కరెంట్, హై-వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్‌ల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. దీని ధర రూ. 449

    Dr Vaku Wall Charger

    డాక్టర్ వాకు వాల్ ఛార్జర్‌లో USB టైప్-A ,  USB టైప్-C అనే రెండు పోర్ట్‌లు ఉన్నాయి, ఇవి PD 3.0,  Qualcomm QC3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తాయి. ఇది గరిష్టంగా 20W పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది, ఇది ఐఫోన్ 12 బ్యాటరీని 30 నిమిషాల్లో 50శాతం ఛార్జ్ చేస్తుంది. దీని ధర రూ.899

    Ugreen Wall Charger

    ఉగ్రీన్ వాల్ ఛార్జర్  65W ఫాస్ట్ ఛార్జింగ్‌ని అందిస్తుంది. ఇది మూడు USB టైప్-C పోర్ట్‌లు, ఒక USB టైప్-A కలిగి ఉంది. ఏకకాలంలో నాలుగు ఫోన్లకు ఛార్జ్ చేసుకోవచ్చు.  దీనిలోని స్మార్ట్ చిప్ ఓవర్ హీట్, హైఓల్టేజ్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. దీని ధర రూ. 4,529.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version