Best iQOO Mobiles: ఐకూ నుంచి వచ్చిన తిరుగులేని మెుబైల్స్ ఇవే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best iQOO Mobiles: ఐకూ నుంచి వచ్చిన తిరుగులేని మెుబైల్స్ ఇవే..!

    Best iQOO Mobiles: ఐకూ నుంచి వచ్చిన తిరుగులేని మెుబైల్స్ ఇవే..!

    October 20, 2023

    వివో (Vivo)కు అనుబంధంగా ఏర్పడిన ఐకూ (iQOO).. అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌ఫోన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సంస్థ రిలీజ్‌ చేసే మెుబైల్స్‌ అధునిక ఫీచర్లను కలిగి ఉండటంతో పాటు మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో మంచి పర్‌ఫార్మెన్స్‌ను అందిస్తున్నాయి. అందుకే ఈ జనరేషన్‌ యువత ఐకూ మెుబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకూ ఐకూ నుంచి చాలా రకాల స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్‌లోకి వచ్చాయి. వాటిలో ఏది బెస్ట్‌ అని తెలియక చాలా మంది కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. అటువంటి వారి కోసం YouSay ఈ కథనాన్ని తీసుకొచ్చింది. ఐకూ మెుబైల్స్‌ను జల్లెడ పట్టి వాటిలోని బెస్ట్‌ ఫోన్లను మీ ముందుకు తెచ్చింది. ఆయా ఫోన్ల ధర, ఫీచర్లు ఇతర విశేషాలను ఇప్పుడు చూద్దాం. 

    iQOO 11 5G

    ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల క్వాడ్ HD ప్లస్ E6 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి 144hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో ఈ మెుబైల్ అందుబాటులో ఉంది. 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 13 MP టెలిఫోటో లెన్స్.. బ్యాక్‌ కెమెరా సెటప్‌లో ఉన్నాయి. ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా, 5000 mAh శక్తివంతమైన బ్యాటరీ, 24W ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫీచర్లను ఫోన్‌కు ‌అందించారు. అమెజాన్‌లో ఈ మెుబైల్‌ 19% డిస్కౌంట్‌తో రూ.49,999 లభిస్తోంది. 

    iQOO 9 Pro 5G

    ఈ స్మార్ట్‌ఫోన్‌ Snapdragon 8 Gen 1 పవర్‌ ఫుల్‌ ప్రొసెసర్‌తో వర్క్‌ చేస్తుంది. 120Hz రిఫ్రెష్‌ రేట్ కలిగిన AMOLED డిస్‌ప్లేను ఫోన్‌కు అందించారు. 50MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 4,700mAh బ్యాటరీ, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను ఫోన్‌ కలిగి ఉంది. దీని అసలు ధర రూ.79,990. కానీ, అమెజాన్‌ 44% తగ్గింపుతో రూ.44,990కు iQOO 9 Pro 5G మెుబైల్‌ను ఆఫర్ చేస్తోంది.

    iQOO 9 5G

    ఈ స్మార్ట్‌ఫోన్‌కు Qualcomm Snapdragon 888+ ప్రొసెసర్‌ను ‌అందించారు. 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.56 అంగుళాల FHD+ డిస్‌ప్లేను సమకూర్చారు. 48MP + 13MP + 13MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 16MP సెల్ఫీ కెమెరా, 4350 mAh బ్యాటరీ, Android 12.0 ఆపరేటింగ్‌ సిస్టమ్ ఇందులో ఫీచర్లుగా ఉన్నాయి. 

    iQOO Neo 7 5G

    ఈ నియో 7 5G మెుబైల్‌ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేట్‌ను ఫోన్‌కు అందించారు. l MediaTek Dimesity 8200 ప్రొసెసర్‌పై ఫోన్‌ వర్క్‌ చేస్తుంది. 64MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 4,700mAh బ్యాటరీ, 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను ఈ మెుబైల్‌కు అందించారు. అమెజాన్‌లో Neo 7 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.27,999లకు సేల్ అవుతోంది. 

    iQOO Neo 9 SE 5G

    ఈ మెుబైల్‌ Snapdragon 888 ప్రొసెసర్‌పై వర్క్‌ చేస్తుంది. 120Hz  అమోల్డ్‌ డిస్‌ప్లేను ఫోన్‌కు అందించారు. 50MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 4700mAh బ్యాటరీ, 66W ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ను ఫోన్‌ కలిగి ఉంది. ఫోన్‌ ధర రూ.30,990గా ఉంది. 

    iQOO Neo 6 5G

    ఈ మెుబైల్‌లో 6.62 అంగుళాల స్క్రీన్‌ 8 GB RAM / 128GB ROM, 64MP + 64MP + 8MP + 2MP రియర్ కెమెరా సెటప్‌, 16MP + 16MP డ్యుయల్‌ సెల్ఫీ కెమెరాలు, 4700 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, Snapdragon 870 processor ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.34,999లకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌ అవుతోంది. 

    iQOO Z7 Pro 5G

    ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల పుల్ హెచ్‌డీ + కర్వ్‌డ్ అమొలెడ్ సూపర్ విజన్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 64 MP ప్రైమరీ + 2 MP సెకండరీ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే 16 MP ఫ్రంట్ కెమెరా, 4600 mAh బ్యాటరీ, 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఫోన్‌కు అందించారు. ఈ మెుబైల్‌ అమెజాన్‌లో రూ.23,999లకు సేల్ అవుతోంది.

    iQOO Z6 Lite 5G

    తక్కువ బడ్జెట్‌లో ఐకూ మెుబైల్‌ను కోరుకునే వారు iQOO Z6 Lite 5G పరిశీలించవచ్చు. ఈ ఫోన్‌ 30% డిస్కౌంట్‌తో రూ.13,999లకు అమెజాన్‌లో సేల్ అవుతోంది. 120Hz రిఫ్రెష్‌ రేట్‌ కలిగిన FHD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, 50MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ వంటి ఫీచర్లు ఈ ఐకూ మెుబైల్‌లో ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version