Best Nokia Mobiles In 2023: నోకియాకు పూర్వవైభవం తీసుకొచ్చిన బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌.. ఫిదా చేస్తున్న ఫీచర్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Nokia Mobiles In 2023: నోకియాకు పూర్వవైభవం తీసుకొచ్చిన బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌.. ఫిదా చేస్తున్న ఫీచర్లు!

    Best Nokia Mobiles In 2023: నోకియాకు పూర్వవైభవం తీసుకొచ్చిన బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌.. ఫిదా చేస్తున్న ఫీచర్లు!

    August 23, 2023

    ప్రపంచంలోని ప్రముఖ టెక్‌ దిగ్గజాల్లో నోకియా (Nokia) ఒకటి. ఒకప్పుడు నోకియా మెుబైల్స్ (Nokia Mobiles) అంటే ఎంతో క్రేజ్‌ ఉండేది. వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడే వారు. అటువంటి నోకియా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిన తర్వాత రాణించలేకపోయింది. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఫోన్లను లాంఛ్‌ చేసి దారుణంగా విఫలమైంది. అయితే తాజాగా ఆండ్రాయిడ్‌ ఫోన్లతో నోకియా మార్కెట్‌లోకి తిరిగి దూసుకొచ్చింది. కొత్త హంగులతో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేస్తూ మెుబైల్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో నోకియా రిలీజ్‌ చేసిన టాప్‌ బెస్ట్‌ ఫోన్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    Nokia X30 5G

    నోకియా కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో  Nokia X30 5G అత్యుత్తమైనది. 8GB RAM + 256GB ROM స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.36,999గా ఉంది. క్లౌడీ బ్లూ, ఐస్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది.  ఫోన్‍లో 4,200mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‍(OIS)కు సపోర్ట్ చేసే 50 MP ప్రైమరీ కెమెరా, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు నోకియా ఇచ్చింది.

    Buy Now

    Nokia 8.3 5G

    నోకియా లాంచ్‌ చేసిన మెుట్ట మెుదటి 5G ఫోన్‌ Nokia 8.3. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 6.81 అంగుళాల ఫుల్ HD+ ప్యూర్ డిస్‌ప్లే ప్యానెల్‌ను అందించారు. 64 RAM, 128 RAMతో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు 4 కెమెరాల సెటప్‌ అందించారు. 64 MP ప్రైమరీ కెమెరా, 12 MP వైడ్ యాంగిల్ సెన్సార్, 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మాక్రో షూటర్లు ఇందులో ఉన్నాయి.  ఫ్రంట్ సైడ్‌  24MP సామర్థ్యమున్న కెమెరాను ఫిక్స్‌ చేశారు. 

    Nokia XR20

    ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ (2400×1080 రిజల్యూషన్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ పగలకుండా సురక్షితంగా ఉండడం కోసం గొరిల్లా గ్లాస్ విక్టుస్‌ అందించారు. ఈ నోకియా ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 5G ప్రొసెసర్‌తో నడుస్తుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. 48MP ప్రైమరీ కెమెరాతో పాటు, 13MP అల్ట్రా-వైడ్ కెమెరాతో ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది.

     

    Nokia G22

    నోకియా తీసుకొచ్చిన తొలి కోర్‌ రిపేరబిలిటీ స్మార్ట్‌ఫోన్‌ ‘Nokia G22’. డ్యామేజ్‌ అయిన డిస్‌ప్లే, బెంట్ ఛార్జింగ్ పోర్ట్, ఫ్లాట్ బ్యాటరీ వంటి సమస్యలను క్విక్‌ఫిక్స్ డిజైన్‌ ద్వారా వినియోగదారులే రిపేర్‌ చేసుకోవచ్చు. 720×1600 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ తయారైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB, 128GB వంటి రెండు స్టోరేజ్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డ్‌ ద్వారా వినియోగదారులు 2TB వరకు స్టోరేజీని ఎక్స్‌ప్యాండ్‌ చేసుకోవచ్చు. హ్యాండ్‌సెట్‌ వెనుక 50MP + 2MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది.  20W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5050mAh బ్యాటరీని అందించారు. 

    Nokia G11 Plus

    నోకియా జీ11 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 90 రిఫ్రెష్ రేట్‌తో యూజర్లకు స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. ఇది Unisoc T606 ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ అందించే 5,000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీని ఫోన్‌కు అందించారు. నోకియా జీ11 ప్లస్ 4GB + 64GB సింగిల్ వేరియంట్‌తో లాంఛ్‌ అయింది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చే ఈ ఫోన్‌లో బ్యాక్‌సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఆఫర్ చేశారు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు.

    Buy Now

    Nokia C12 Pro

    నోకియా C12 ప్రో ఫోన్‌లో 6.3 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 2 GB RAM / 64GB ROM, 3GB RAM / 64GB ROM ఆప్షన్స్‌గా ఇచ్చారు. 

    Buy Now

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version