వాహనంలో నుంచి బయటకు చూస్తే పొందే ఆనందం మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా, కారు లోపల నిలబడినప్పుడు ఎదురుగా వచ్చే గాలి శరీరాన్ని తాకుతుంటే ఆ ఫీల్ వేరే ఉంటది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు తాజా గాలిని ఆస్వాదిస్తే ఎంతో బాగుంటుంది. ఈ లగ్జరీ టచ్‌ని సన్‌రూఫ్(Sunroof) ఫీచర్ అందిస్తుంది. తొలి నాళ్లలో ఈ ఫీచర్ ఖరీదైన కార్లలో మాత్రమే ఉండేది. కానీ, దీని అవసరాన్ని తెలుసుకున్న వాహన తయారీ కంపెనీలు బడ్జెట్ అనుకూల ధరల్లోనే సన్‌రూఫ్ ఫీచర్‌ని అందిస్తున్నారు. మీరు కూడా సన్‌రూఫ్ కలిగిన కార్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అధునాతన ఫీచర్లతో కొన్ని కార్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. మరి, రూ.12 లక్షల లోపు సన్‌రూఫ్ కలిగిన కార్లేవో చూద్దాం.
హ్యుందాయ్ ఎక్స్‌టర్(Hyundai Exter)
సరసమైన ధరకే సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది హ్యుందాయ్ ఎక్స్‌టర్. సొగసైన డిజైన్‌తో స్పేషియస్ ఇంటీరియర్‌తో ఈ వాహనం ఆకట్టుకుంటుంది. ఇందులో కూర్చుని జర్నీ చేస్తుంటే వచ్చే కిక్కే వేరు. ఇక లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు సన్‌రూఫ్‌ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. రూ.10.87 లక్షలకు ఈ వాహనం అందుబాటులోకి వస్తోంది.
మారుతీ సుజుకీ బ్రెజ్జా(Maruti Suzuki Brezza)
మారుతీ సుజుకీ వాహనాలకు ఉండే గిరాకీనే వేరు. ముఖ్యంగా ఈ బ్రాండ్ నుంచి వచ్చిన మారుతి సుజుకీ బ్రెజ్జా కార్ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది. సన్ రూఫ్‌తో అత్యాధునిక ఫీచర్లతో బ్రెజ్జాలోని ZXI MT వేరియంట్ అందుబాటులోకి వస్తోంది. దీని ఎక్స్ షో రూం ధర రూ.11.04 లక్షలుగా ఉంది. మార్కెట్లో మంచి ఆదరణను కలిగి ఉన్న ఈ వాహనం.. చూడ్డానికి సొగసుగానూ కనిపిస్తుంది. సబ్‌కాంపాక్ట్ SUV క్యాటగిరీలో విశేష ఆదరణను పొందింది.
టాటా నెక్సాన్(TATA NEXON)
దేశీయంగా నమ్మకం పొందిన వాహన తయారీ కంపెనీ టాటా(Tata). ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన టాటా నెక్సాన్ XM(S) MT వేరియంట్ సన్‌రూఫ్‌తో వస్తోంది. దేశీయ మార్కెట్లో ఈ వాహనానికి మంచి గిరాకీ ఉంది. ఆకట్టుకునే సేఫ్టీ ఫీచర్లతో అత్యాధునిక డిజైన్‌తో ఈ వాహనం ఔత్సాహికులను ఆకట్టుకుంటోంది. టాటా నెక్సాన్ XM(S) MT వేరియంట్ ఎక్స్ షో రూం ధర రూ.9.50 లక్షలతో అందుబాటులోకి వస్తోంది.
హ్యుందాయ్ వెన్యూ(Hyundai VENUE)
హ్యుందాయ్ నుంచి వచ్చిన ఎస్‌యువీ మోడల్ వాహనం హ్యుండయ్ వెన్యూ. ఇందులోని SX MT వేరియంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తోంది. ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్‌కి, అత్యాధునికి టెక్నాలజీ ఫీచర్లకు ఇది పెట్టింది పేరు. స్లీక్ డిజైన్ వెహికల్ లవర్స్‌ని తెగ అట్రాక్ట్ చేస్తుంది. సన్ రూఫ్ ఫీచర్‌ని ఆస్వాదించేందుకు అనువైన వాహనం ఇది. ఈ వాహనం ఎక్స్ షో రూం ధర రూ.11.93 లక్షలుగా ఉంది.
కియా సోనెట్(KIA Sonet)
కియా నుంచి విడుదలైన సబ్ కాంపాక్ట్ ఎస్‌యువీనే కియా ‘సోనెట్’. HTX MT వేరియంట్‌కి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వస్తోంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లకు ఇది కేరాఫ్. గతేడాది అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యువీల్లో ఇదొకటి. మార్కెట్లో కియా సోనెట్ సన్ రూఫ్ వేరియంట్‌కి మంచి పాపులారిటీ ఉంది. జర్నీలో ఉండగా రూఫ్‌ని ఓపెన్ చేస్తే తాజా, చల్లని గాలిని పొందే వెసులు బాటు ఉంటుంది. ఎక్స్ షో రూం ధర రూ.11.45 లక్షలు.
టొయోటా అర్బన్ క్రూయిజర్(URBAN CRUISER)
జపాన్ కంపెనీ టొయోటా నుంచి విడుదలైన వాహనమే ‘అర్బన్ క్రూయిజర్’. సన్ రూఫ్ సౌలభ్యంతో టొయోటా ఈ వాహనాన్ని తీసుకొచ్చింది. అదనంగా లగ్జరీ ఫీచర్లు ఉండటం ఈ వాహనం ప్రత్యేకత. ఈ వాహనం ఎక్స్ షోరూం ధర రూ.9 నుంచి రూ.12 లక్షల మధ్యలో ఉంటుంది.
హ్యుందాయ్ ఐ20 అస్టా(Hyundai i20 Asta)
పనోరమిక్ సన్‌రూఫ్‌ని ఆఫర్ చేసే వాహనాలలో హ్యుందాయ్ ఐ20 అస్టా ఒకటి. మోడర్న్ డిజైన్‌తో, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఇంటీరియర్ విశాలంగా ఉంటుంది. కాబట్టి, ఎంచక్కా కూర్చుని సన్‌రూఫ్‌ని ఓపెన్ చేసుకుంటే ఆ మజానే వేరు. తాజా గాలిని ఆస్వాదించొచ్చు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?