Best Vivo Mobiles: వివోలో బెస్ట్‌ మెుబైల్‌ కోసం తెగ వెతుకుతున్నారా? అయితే ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Vivo Mobiles: వివోలో బెస్ట్‌ మెుబైల్‌ కోసం తెగ వెతుకుతున్నారా? అయితే ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి!

    Best Vivo Mobiles: వివోలో బెస్ట్‌ మెుబైల్‌ కోసం తెగ వెతుకుతున్నారా? అయితే ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి!

    October 20, 2023

    దేశంలో బాగా పాపులర్‌ అయిన మెుబైల్ బ్రాండ్లలో వివో (Vivo) ఒకటి. బడ్జెట్‌, మీడియం రేంజ్‌లో అడ్వాన్స్‌డ్‌ మెుబైల్స్‌ను రిలీజ్‌ చేస్తూ మెుబైల్‌ ప్రియుల్లో వివో మంచి గుడ్‌విల్‌ సంపాదించింది. అందుకే ఈ కంపెనీ నుంచి ఏ చిన్న మెుబైల్‌ విడుదలైన దానిపై అందరి దృష్టి పడుతుంది. ప్రస్తుతం వివోకి సంబంధించి ఎన్నో ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్‌ మెుబైల్స్‌ జాబితాను YouSay రూపొందించింది. కొత్తగా వివో ఫోన్‌ కొనాలని భావిస్తున్నవారు ఈ లిస్ట్‌లోని మెుబైల్స్‌ను ట్రై చేయవచ్చు. ఇంతకీ ఆ మెుబైల్స్‌ ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    Vivo Y16 

    తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ వివో (Vivo) ఫోన్‌ కొనాలని భావించేవారికి Vivo Y16 మంచి ఆప్షన్‌. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 15,999. కానీ అమెజాన్‌ 34% డిస్కౌంట్‌తో రూ.10,499కు ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.51 అంగుళాల స్క్రీన్‌, 13MP+2MP రియర్‌ కెమెరా సెటప్‌, 5MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 10W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌, 4GB RAM / 64GB స్టోరేజ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

    Vivo Y27

    ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.64 అంగుళాల FHD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. 6GB RAM / 128GB ROM, 50MP+2MP రియర్ కెమెరా సెటప్‌, 8MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, FunTouch OS 13 వంటి ఫీచర్లు ఫోన్‌లో ఉన్నాయి. ఈ మెుబైల్‌ 26% డిస్కౌంట్‌తో రూ.13,999 అమెజాన్‌లో లభిస్తోంది. 

    Vivo Y56 5G

    మీడియం రేంజ్‌ బడ్జెట్‌లో వివో నుంచి మంచి ఫోన్ కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఈ మెుబైల్‌ 6.58 అంగుళాల FHD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. 50MP+2MP రియర్‌ కెమెరా సెటప్‌, 8GB RAM / 128GB ROM, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లను ఫోన్‌కు అందించారు. అమెజాన్‌లో ఈ ఫోన్‌ రూ.18,999 లభిస్తోంది.

    Vivo V29e 5G

    ఈ వివో మెుబైల్‌ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను కలిగి ఉంది. ఈ మెుబైల్‌కు 6.78 అంగుళాల FHD+ స్క్రీన్‌ అందించారు. అలాగే 64MP + 8MP డ్యుయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 50MP సెల్ఫీ కెమెరా, 5000 mAh పవర్‌ఫుల్‌ బ్యాటరీని అందించారు. Vivo V29e 5G అమెజాన్‌లో 35% డిస్కౌంట్‌తో రూ.26,135 సేల్‌ అవుతోంది.

    VIVO V27 5G 

    ఈ అత్యాధునిక మెుబైల్‌ను అమెజాన్‌ రూ. 31,699లకు ఆఫర్‌ చేస్తోంది. ఈ ఫోన్‌ 6.78 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 50MP (OIS) + 8MP + 2MP బ్యాక్‌ కెమెరా సెటప్‌, 50MP సెల్ఫీ కెమెరా, 4600 బ్యాటరీ, Mediatek Dimensity 7200 5G ప్రొసెసర్‌ వంటి ఫీచర్లను ఫోన్‌కు అందించారు. 

    VIVO V27 Pro 5G 

    వివోలో టాప్‌ మెుబైల్‌ను కోరుకునే వారు దీన్ని ట్రై చేయవచ్చు. ఈ మెుబైల్‌ ప్రత్యేకతల విషయానికి వస్తే.. దీనిలో 6.78 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌, 50MP (OIS) + 8MP + 2MP రియర్‌ కెమెరా సెటప్‌, 50MP ఫ్రంట్‌ కెమెరా, 4600 mAh బ్యాటరీ, Mediatek Dimensity 8200 Processor ప్రొసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version