Bhola Shankar Review: ‘భోళా శంకర్‌’లో చిరు యాక్టింగ్‌ అదుర్స్‌.. రీమేక్‌తో మరో హిట్ కొట్టినట్లేనా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bhola Shankar Review: ‘భోళా శంకర్‌’లో చిరు యాక్టింగ్‌ అదుర్స్‌.. రీమేక్‌తో మరో హిట్ కొట్టినట్లేనా?

    Bhola Shankar Review: ‘భోళా శంకర్‌’లో చిరు యాక్టింగ్‌ అదుర్స్‌.. రీమేక్‌తో మరో హిట్ కొట్టినట్లేనా?

    August 16, 2023

    నటీనటులు: చిరంజీవి, సుశాంత్, తమన్నా, కీర్తి సురేశ్, బ్రహ్మానందం, తదితరులు

    డైరెక్టర్: మెహెర్ రమేశ్

    మ్యూజిక్: మహతి స్వర సాగర్

    నిర్మాత: అనిల్ సుంకర

    తమిళంలో విజయం సాధించిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా వచ్చింది ‘భోళా శంకర్’. తెలుగు నేటివిటీకి తగ్గట్టు అన్ని హంగులతో మూవీని తీర్చిదిద్దినట్లు చిత్రబృందం చెప్పుకొచ్చింది. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి మరింత యంగ్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరి, శుక్రవారం(Aug 11) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ఒరిజినల్ మూవీతో పోలిస్తే ఈ సినిమాలో చేసిన మార్పులేంటి? ప్రేక్షకుడు ఎలా ఫీల్ అయ్యాడు? అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం. 

    కథ

    చెల్లి మహా(కీర్తి సురేశ్)తో కలిసి శంకర్ దాదా(చిరంజీవి) కోల్‌కతాలో నివసిస్తుంటాడు. ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే శంకర్ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో నలుగురు కిడ్నాపర్లను హతమార్చడంలో సహాయపడతాడు. దీంతో విలన్ గ్యాంగ్ శంకర్‌ని కనిపెట్టే ప్రయత్నంలో పడుతుంది. ఈ క్రమంలో మహా పెళ్లి నిశ్చయమౌతుంది. తన గురించి వెతుకుతున్నారని తెలుసుకుని శంకర్ ప్రధాన విలన్లలో ఒకడిని హతమార్చి తన అసలు రూపాన్ని బయట పెడతాడు. అసలు శంకర్ కోల్‌కతాకు ఎందుకొచ్చాడు? తన ప్రధాన లక్ష్యం ఏంటి? నిజంగా మహా తన చెల్లెలేనా? అనేది తెరపై చూడాల్సిందే.

    ఎలా ఉంది?

    మాతృక కథలో కొన్ని మార్పులు చేసినట్లు చెప్పినా, దాదాపుగా అదే స్టోరీతో సినిమాను దింపేశారు. అయితే చిరంజీవి నటన ప్రేక్షకుడికి నచ్చుతుంది. కామెడీ టైమింగ్‌తో పాటు పవన్ కళ్యాణ్ మ్యానరిజం సీన్స్‌ కాస్త ఉత్సాహం నింపుతాయి. అయితే, ఖుషి నడుము సీన్ వంటివి ప్రేక్షకుడికి కాస్త వెగటుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో భోళా ఇంట్రడక్షన్ బాగుంది. రెండు పాటలు ఆకట్టుకుంటాయి. చివర్లో క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఎలిమెంట్స్‌ని మేళవించినా.. అవి పెద్దగా పండలేదు. 

    ఎవరెలా చేశారు?

    ఎప్పటిలాగే చిరంజీవి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్‌లలో చక్కగా చేశాడు. ఇక, పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని అచ్చు గుద్దినట్లు చేసే ప్రయత్నం చేశాడు. తన యాక్టింగ్‌తో సినిమాను నడిపించాడు. ఇక కీర్తి సురేష్, తమన్నాలు తమ పాత్రకు పరిమితమయ్యారు. సుషాంత్ ఫర్వాలేదనిపించాడు. వెన్నెల కిశోర్ కాస్త నవ్వించాడు. మిగతా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. 

    టెక్నికల్‌గా

    చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎలివేషన్స్‌ని ఇవ్వడంలో డైరెక్టర్ మెహెర్ రమేశ్ కాస్త సక్సెస్ అయ్యారు. కానీ, ఒరిజినల్ ప్లాట్‌లో పెద్దగా మార్పులు చేయలేకపోయాడు. కథనాన్ని ఆసక్తికరంగా మలచలేదు. వేదాళం సినిమా చూసిన వారికి ఏ కోశాన కూడా ఈ సినిమాలో కొత్తదనం కనిపించకుండా చేశాడు. ఒకట్రెండు చోట్ల మినహా తన పనితనం కనిపించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ ఇచ్చిన పాటల్లో రెండు ఆకట్టుకుంటాయి. బీజీఎం ఒకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

     

    పాజిటివ్ పాయింట్స్

    చిరంజీవి నటన

    సెకండాఫ్

    నెగెటివ్ పాయింట్స్

    ఊహించే కథనం 

    స్టోరీలో మార్పులు లేకపోవడం

    ఖుషి నడుము సీన్

    రేటింగ్: 2.25/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version