• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్: మంత్రి అంబటి

    తమకు కక్ష సాధించాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు అరెస్టు చేశారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, 175 స్థానాల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని అంబటి అన్నారు. ఈ నెల 26 నుంచి బస్సు యాత్రతో పాటు ‘మళ్లీ జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమం సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    బాంబులతో దద్దరిల్లుతున్న గాజా

    గాజా బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది. గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 1900 మంది చనిపోయారు. బందీలకు ఎలాంటి హాని చేసినా పాలస్తీనా అంతు చూస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు గాజాలో 900 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీన తెలిపింది. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల దాడిలో 14 మంది అమెరికన్లు చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.

    ఈ పిల్లాడ్ని మిస్ అవుతున్నా: కేటీఆర్

    మంత్రి కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును బాగా మిస్‌ అవుతున్నట్లు ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేటీఆర్ ఫ్యామిలీకి టైం కేటాయించలేక పోతున్నట్లు చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉన్న తన కుమారుడిని గుర్తు చేసుకున్నాడు. ఈనేపథ్యంలో హిమాన్షుతో జాగింగ్‌ చేస్తూ దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు. “ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా” అనే క్యాప్షన్‌ను ఫోటోకు జోడించారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది.

    శంషాబాద్‌లో భారీ భూ కుంభ కోణం

    శంషాబాద్ పరిధిలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొంత ప్రభుత్వాధికారులు, రియల్టర్‌లతో కలిసి రూ.1000 కోట్ల విలువైన భూముల రికార్డులు మార్చేశారు. సుమారు 150 ఎకరాల భూమిని రియాల్టర్లకు అప్పగించారు. పెద్ద గొల్కొండ గ్రామంలో 190 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 25 ఏళ్ల కిందట ఈ భూమిని పేద రైతులకు పంపిణీ చేసింది. ఇవి అసైన్డ్ భూములు వీటిని కొనడం గాని అమ్మటం గాని చేయరాదు. అయితే వీటి రికార్డులు మార్చి రియాల్టర్లకు అప్పగించారు ప్రభుత్వాధికారులు.

    మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టారీతిన తప్పుడు వార్తలు రాస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు. రాజకీయ నిరసనతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు రాస్తున్నట్లు విమర్శించారు. ఈ వార్తల వల్ల కిందిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని చెప్పుకొచ్చారు.

    దసరా వేడుకలకు రావాలని సీఎం జగన్‌కు ఆహ్వానం

    దసరా మహోత్సవాలకు రావాలని సీఎం జగన్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లన్న ఆలయాల ధర్మకర్తల మండలి ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. ఈ నెల 15 నుంచి 23 వరకు ఇంద్రకీలాద్రిపై, 15 నుంచి 24 వరకు శ్రీశైలంలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు రావాలని సీఎం జగన్‌కు ఆహ్వానపత్రికలు అందజేశారు.

    వచ్చే 5 ఏళ్ల కోసం బీజేపీని ఎన్నుకోండి: అమిత్ షా

    వచ్చే 5 ఏళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆదిలాబాద్ సభలో అమిత్ షా పిలుపునిచ్చారు. ‘2014 ముందు దేశంలో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు.. యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేది. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. మోదీ పైన అవినీతి ఆరోపణలు లేవు. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారయ్యింది. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసాం. విదేశాల్లో భారత్ … Read more

    110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు దక్కవు: కేటీఆర్

    అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘అమిత్ షా ప్రసంగం ఆసాంతం అబద్ధాలే. అమిత్ షా- మోదీ ఎన్ని అబద్ధాలు ఆడిన తెలంగాణలో బీజేపీకి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదు. మళ్లీ ఎన్నికల్లోనూ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయం. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారు. అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

    శ్రీవారి దర్శనానికి 8 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 8 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న శ్రీవారిని 71,361 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24,579 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మంగళవారం తిరుమలేశుడి హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలి

    ఎన్నికల నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు సూచించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 46 సమస్యాత్మక నియోజకవర్గాలు ఉండగా, అందులో 13 తీవ్ర సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఈనెల 31 వరకు ఓటు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.