• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.53,650కి ఎగబాకింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.330 పెరిగి రూ.58,530కి చేరింది. అటు కిలో వెండి ధర రూ. 75,500 వద్ద కొనసాగుతోంది. ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

    17 రోజులు.. 41 భారీ బహిరంగ సభలు

    అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీఆర్ఎస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఆయన 17 రోజుల్లో 41 భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నవంబంర్ 3వ తేదీ నాటికే సీఎం కేసీఆర్ 26 సభలకు హాజరయ్యేలా ప్రణాళిక రచించారు. కాగా, తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.

    గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా

    తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్‌ చేశారు. TSPSC Group 2 Examను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తం 783 గ్రూప్‌-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.

    అమిత్‌ షా అన్నీ అబద్దాలే: కేటీఆర్

    కేంద్ర మంత్రి అమిత్‌ షాకి తెలంగాణలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమిత్‌ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మండిపడ్డారు. బీజేపీకి మళ్లీ భాజపాకు 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు ఖాయమన్నారు. పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతుల్లో ఉందని కేటీఆర్ విమర్శించారు.

    రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారే: అమిత్ షా

    డిసెంబర్ 3వ తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో గిరిజన వర్సిటీ ఆలస్యానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లు అధికారంలో ఉన్నా పేదల సమస్యలు తీర్చలేదని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిందని పేర్కొన్నారు. 9ఏళ్లుగా మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రావని అమిత్‌ షా స్పష్టం చేశారు.

    హస్తకళల మేళాకు విశేష స్పందన

    నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హస్తకళల ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభిస్తోంది. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు వరుసగా ఉన్న నేపథ్యంలో ఈ ఎగ్జిబిషన్‌ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కొండపల్లి చెక్క బొమ్మలు, దుస్తులు, అలంకరణ సామగ్రి, వంట దినుసులు.. ఇలా అన్ని రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పట్టణంలోని లహరి గార్డెన్స్‌లో 15 రోజుల పాటు కొనసాగే ఈ మేళాలో 30 స్టాల్స్ ఏర్పాటు చేశారు.

    నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్

    అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టోను కేసీఆర్ ప్రకటించనున్నారు. అదే రోజు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్‌లో గులాబీ బాస్ కేసీఆర్ భేటీ కానున్నారు. అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. నవంబర్ 9న రెండు చోట్ల కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన చేపట్టనున్నారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరి బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న మధ్యాహ్నం … Read more

    చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడిగా వాదనలు

    సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాడి వేడిగా వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ‘ఈ కేసు మూలంలోనే తప్పు ఉంది. అన్నీ కలిపి ఒక ఎఫ్‌ఐఆర్ తయారు చేశారు. ఇందులోని ఎఫ్‌ఐఆర్ చట్టబద్దం కాదు. 164 కింద తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా కేసును నిర్మించారు. దానిని సవాలు చేస్తున్నాం’ అని వాదించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ‘చంద్రబాబుపై తగినన్ని ఆధారాలు లభించాక 2021లో సీఐడీ కేసు నమోదు చేసింది. 17A చట్ట … Read more

    శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఉపశమనం

    మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఆఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన అంశాలను శ్రీనివాస్ గౌడ్ తప్పుగా చూపించారని పేర్కొన్నారు. ఒకసారి అఫిడవిట్ సమర్పించాక రిటర్నింగ్ అధికారి నుంచి తిరిగి తీసుకుని దానిని సవరించారని చెప్పుకొచ్చారు. ఇది ఎన్నికల నిబంధలకు విరుద్ధమని తెలిపారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.

    దసరా పండుగకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

    దసరా పండుగ వేళ దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈనెల 13 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. 5,265 బస్సులను రద్దీ మార్గాల్లో నడపనుంది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై దసరా ఏర్పాట్ల గురించి చర్చించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర వరకు బస్సు సర్వీసులు నడపాలని దిశానిర్దేశం చేశారు.