• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్నికల గుర్తులపై ఢిల్లీ హైకోర్టుకు బీఆర్ఎస్

    బీఆర్ఎస్ ఎన్నికల సింబల్ అయిన కారును పోలిన గుర్తును అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీకి కేటాయించొద్దంటూ ఆ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. కెమెరా, చపాతీ రోలర్, రోడ్డు రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమెషిన్, ఓడ, ఆటోరిక్షా వంటి కారును పోలిన గుర్తులను వచ్చే ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థులు, గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేటాయించొద్దని బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించనుంది.

    మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల జమున?

    మేడ్చల్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సతీమణి జమున బరిలోకి దిగుతుందనే చర్చ జరుగుతోంది. రాజేందర్ కుటుంబం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని పూడూరులో నివాసం ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాల విషయంలోనూ వారి కుటుంబానికి మేడ్చల్‌తో మంచి సంబంధాలున్నాయి. ఇక్కడ టికెట్ కోసం పోటీపడుతున్న వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా కలిసి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

    ఎన్నికల ఏర్పాట్లపై సీవీ ఆనంద్ సమీక్ష

    ఎన్నికల ఏర్పాట్లపై పోలీసులతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రచారాలు ఒకే మార్గంలో తారసపడకుండా చూడాలి. రూట్‌ ప్లానింగ్, టైమింగ్‌, పర్మిషన్ల జారీలో జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ ఓటర్ ఐడీ తయారీదారులు, రవాణా సంస్థలు, కొరియర్ సర్వీసులపై నిఘా పెట్టాలి. డబ్బు, బంగారం, మద్యం సీజ్ చేసే సమయంలో విధానాలు అమలు చేయాలి. ఎన్నికలు ముగిసేవరకు పోలీసుల నిరంతర నిఘా.. హవాలా ఆపరేటర్లపై నిఘా ఏర్పాటు చేయాలి. ఓటర్లను ప్రలోభపెట్టే గిఫ్ట్‌ల పంపిణీలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని … Read more

    ఈనెల 13 నుంచి దసరా సెలవులు

    తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఈ నెల 13 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 26న స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. మొత్తం 13 రోజులు హాలీడేస్ వచ్చాయి. మరోవైపు ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1, 2 పరీక్షల మార్కులను చైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేయాలని అన్ని పాఠశాలలను విద్యాశాఖ ఆదేశించింది. అటు అన్ని జూనియర్‌ కాలేజీలకు ఈ నెల 19 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

    20 మంది అధికారులకు ఈసీ షాక్

    తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న 20 మంది అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, అబ్కారీ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రవాణా శాఖ కార్యదర్శిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి ఎలాంటి విధులు అప్పగించొద్దని సీఎస్ శాంతికుమారిని ఆదేశించింది. కాగా, వీరిలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ ఉన్నారు.

    అన్‌స్టాపబుల్ సీజన్-3 డేట్స్ ఫిక్స్

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్-3 ఈనెల 17 నుంచి ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ‘బాలయ్య నటించిన భగవంత్ కేసరి’ మూవీ టీం సందడి చేయనుంది. డెరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు కాజల్, శ్రీలీల, అర్జున్ రామ్‌పాల్‌తో కూడిన ఫొటోలను విడుదల చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. బాలకృష్ణ మరోసారి ఈ ప్రోగ్రామ్‌లో సందడి చేయనుండటంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ 19న రిలీజ్ కానుంది.

    కవితను కాపాడేది బీజేపీనే: నారాయణ

    కేసీఆర్‌ కుమార్తె కవితను కాపాడేది బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజీ ఒప్పందం కుదిరిన తర్వాతనే. వైసీపీ, కేసీఆర్‌, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని చెప్పారు. అదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వెయిరీ వేయలేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని నారాయణ దుయ్యబట్టారు.

    రేవంత్ సీటుకు రేటెంత: కేటీఆర్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ ఫైరయ్యారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఎన్నికలంటే ఏటీఎం అని విమర్శించారు. రేవంత్ గతంలో ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు నోటు తీసుకుంటున్నాడని ఆరోపించారు. రేవంత్‌ను రేవంత్‌ అని పిలవడం లేదని రేటెంత.. రేటెంత.. అని అంటున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మళ్లీ పోటీ చేస్తున్నాడన్నాడన్నారు.. 60 ఏళ్లు అధికారంలో ఉన్న తెలంగాణకు ఏమీ చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు.

    ఐసెట్ అభ్యర్థులకు స్పెషల్ కౌన్సెలింగ్

    తెలంగాణలో ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించి MBA, MCA కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 15న స్లాట్ బుకింగ్.. 16 నుంచి 17 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఉంటుంది. 20న సీట్ల కేటాయింపు చేయనుండగా.. 20 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 30 నుంచి 31 వరకు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.

    కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి: బండి సంజయ్

    తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైందని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల కోసం ప్రజలు అతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈసారి సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారని మళ్లీ బీఆర్ఎస్‌ను ప్రజలు గెలిపిస్తారని ప్రశ్నించారు.